సీల్డ్ కవర్ లో కాళేశ్వరం కమిషన్ నివేదిక

Latest Posts Top Stories

* జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక సమర్పణ
‘ 15 నెలల పాటు కమిషన్ ఎంక్వైరీ
* సిఫార్సులు చూశాక బాధ్యులపై చర్యలు
* కేసీఆర్ పై యాక్షన్ ఉంటుందన్న కాంగ్రెస్

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. కమిషన్ కు ప్రభుత్వం ఇచ్చిన గడువు గురువారంతో ముగిసింది. దాంతో చివరి రోజున రిపోర్ట్ సబ్మిట్ చేశారు జస్టిస్ పీసీ ఘోష్. కేసీఆర్ తో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో ప్రమేయం ఉన్న అందరి దగ్గరా కమిషన్ స్టేట్మెంట్స్ రికార్డు చేసింది. 2023 డిసెంబర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, దెబ్బతిన్న మేడిగడ్డ బ్యారేజీతో పాటు ఇతర బ్యారేజీలలో సీపేజీ సమస్యలపై విజిలెన్స్ విచారణ జరిగింది. విజిలెన్స్ ప్రైమరీ రిపోర్టులో నిర్మాణ లోపాలు తీవ్రంగా ఉన్నాయని గుర్తించారు. అసెంబ్లీలో చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి న్యాయ విచారణకు ఆదేశించారు,

Kaleswaram Report

గత ఏడాది మార్చి 14న కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ లోపాలు, సమస్యలపై విచారణకు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ పీసీ ఘోష్ ఆధ్వర్యంలో కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కమిషన్ 15 నెలల పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై ఎంక్వైరీ నిర్వహించింది. కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్ సహా 115 మంది సాక్షులను విచారించి, వారి సాక్ష్యాలను రికార్డు చేసింది. జస్టిస్ పీసీ ఘోష్ నివేదికను నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు అందజేశారు. రాహుల్ బొజ్జా ఈ రిపోర్టును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు సమర్పించారు. ఘోష్ సిఫార్సులను ప్రభుత్వం పరిశీలించి తదుపరి చర్యలు తీసుకునే అవకాశముంది. నిర్మాణ లోపాలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటారని భావిస్తున్నారు. అలాగే టెక్నికల్ సమస్యలకు ఈ నివేదికలో పరిష్కార మార్గాలు కూడా ఉండవచ్చని భావిస్తున్నారు. కాళేశ్వరం నిర్మాణంలో భారీగా అవినీతికి పాల్పడ్డారని మాజీ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. లక్ష కోట్ల అవినీతి జరిగిందని మొత్తాన్ని కక్కిస్తామని.. ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ కూడా ప్రకటించారు. ఇప్పుడు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నారు. ఈ నివేదికను ముందుగా కేబినెట్లో ఆమోదిస్తారు. ఆ తర్వాత .. కేసులు నమోదు చేయడం , దర్యాప్తు సంస్థల ద్వారా విచారణ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

ఇలాంటి మంచి ఆర్టికల్స్ అందిస్తున్న TELUGU WORD టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

తెలుగు వర్డ్ Telegram Link : CLICK HERE FOR TELEGRAM LINK

Read also : ఫోన్ ట్యాపింగ్ – లీగలా, ఇల్లీగలా?

Read also : ఒకే కారులో స‌మంత‌-రాజ్!

Tagged

Leave a Reply