ప్రీక్వెల్ కు అడుగడుగునా ఆటంకాలు
షూటింగ్ లో వరుస ప్రమాదాలు, మరణాలు
అతీత శక్తులున్నాయా..? ఒక్కోసారి అవి మనమీద పగబడతాయా..? కొన్నిసార్లు మన చేతుల్లో లేనిది ఏదో జరుగుతుంది. ఊహకు అందని విధంగా అతీతంగా ఇంకేదో జరుగుతుంటుంది. అలా చూస్తూ ఆశ్చర్యపోవడం తప్ప ఏం చేయలేని పరిస్థితి. కాంతార ప్రీక్వెల్ విషయంలో అదే జరుగుతోంది. ఈ సినిమా ప్రారంభమైనప్పట్నుంచి, మినిమం గ్యాప్స్ లో ఏదో ఒక ప్రమాదం ప్రాజెక్టును వెంటాడుతూనే ఉంది.
సినిమా మొదలైన వెంటనే అడవిని నరికేశారంటూ ఏకంగా ప్రభుత్వం కోర్టుకెక్కింది. ఆ కేసు ఇంకా కోర్టులో నడుస్తూనే ఉంది. అప్పట్నుంచి చూసుకుంటే, నిన్నమొన్నటివరకు ఏదో ఒక ప్రమాదం కాంతార ఛాప్టర్-1 (ప్రీక్వెల్)ను వెంటాడుతూనే ఉంది. ఈమధ్య ఓ వాటర్ ఫాల్ వద్ద పెద్ద సెట్ వేశారు. గాలివానకు ఆ సెట్ కూలిపోయింది. అదే టైమ్ లో నదిలో యూనిట్ తో వెళ్తున్న పడవ బోల్తా కొట్టింది. అదృష్టవశాత్తూ ఎవ్వరూ గాయపడలేదు.
అంతకుముందు జూనియర్ ఆర్టిస్టులు ప్రయాణిస్తున్న వాహనానికి పెద్ద యాక్సిడెంట్ జరిగింది. మరో ఘటనలో ఓ నటుడు ప్రమాదవశాత్తూ నీటిలో పడి మృతి చెందాడు. తాజాగా జరిగిన మరో ఘటనలో సినిమాకు సంబంధించి ఓ మిమిక్రీ ఆర్టిస్టు గుండెపోటుతో మృతిచెందారు. ఇలా ఈ ప్రీక్వెల్ ను ప్రమాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. కాంతార సినిమాలో దేవుడి అంశపై చర్చించారు. ఆ సినిమా క్లయిమాక్స్ ఔట్ స్టాండింగ్. ఇప్పుడు కాంతార ప్రీక్వెల్ తీయడం ఆ దేవుడికే నచ్చలేదనే చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది. అటు హీరో కమ్ దర్శకుడు రిషబ్ శెట్టి మాత్రం తన పని తాను చేసుకుపోతున్నాడు. ఎట్టిపరిస్థితుల్లో సినిమాను అక్టోబర్ లో విడుదల చేస్తానంటున్నాడు.
Also read: కుబేర బుకింగ్స్ దుమ్మురేపుతున్నాయి!
Also read: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్: పాకిస్తాన్!
Also read: నటి కల్పికపై మరో కేసు
Also read: https://in.bookmyshow.com/movies/delhi/kantara-a-legend-chapter-1/ET00377351