మూత్రపిండాల జాగ్రత్తలు
– ప్రధాన పని:
మూత్రపిండాలు రక్తాన్ని శుద్ధి చేసి, వ్యర్థాలు, అదనపు ద్రవాలను మూత్ర రూపంలో బయటకు పంపిస్తాయి.
– ఎవరికి ముప్పు ఎక్కువ:
మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు ఉన్నవారు, ఊబకాయం, పొగతాగేవారు, ఎక్కువగా నొప్పి మందులు వాడేవారు.
-లక్షణాలు (చివరి దశలో):
నిస్సత్తువ, మూత్రంలో నురుగు లేదా రక్తం, కాళ్ల ఉబ్బు, అలసట, శ్వాస ఆడకపోవడం.
పరీక్షలు:
రక్తంలోని క్రియాటినిన్, యూరియా పరీక్షలు; మూత్రం, అల్ట్రాసౌండ్, అవసరమైతే బయాప్సీ.
జాగ్రత్తలు:
– ఉప్పు తక్కువగా తీసుకోవాలి.
– రోజూ 2 లీటర్ల నీళ్లు త్రాగాలి.
– ప్రొటీన్ తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.
– వ్యాయామం, మంచి నిద్ర అవసరం.
– నొప్పి మందులు, మద్యం, పొగాకు వీలైనంత మానుకోవాలి.
చికిత్స:
తొలిదశలో జీవనశైలి మార్పులతో నియంత్రణలో ఉంచొచ్చు. చివరి దశలో డయాలసిస్ లేదా కిడ్నీ మార్పిడి అవసరం అవుతుంది.
మూత్రపిండాల ఆరోగ్యాన్ని తొలిదశలోనే సంరక్షించడమే ఉత్తమ మార్గం.