రూ.100 కోట్ల క్లబ్ కు దగ్గరలో
టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర “కుబేర” కలెక్షన్లు కంటిన్యూ చేస్తోంది. విడుదలైన మొదటి వారంలోనే అద్భుతమైన కలెక్షన్లతో వీరవిహారం చేసిన ఈ సినిమా.. వర్కింగ్ డేస్‌లోనూ తన దూకుడును కొనసాగిస్తూ సినీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. కింగ్ నాగార్జున, కోలీవుడ్ టాలెంటెడ్ హీరో ధనుష్ హీరోగా టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “కుబేర”.
ఒక ఇంట్రెస్టింగ్ ఎమోషనల్ సోషల్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా మంచి వసూళ్లు సాధిస్తూ అదరగొడుతుంది. ఇలా భారీ కలెక్షన్లు సొంతం చేసుకుంటూ ధనుష్ కెరీర్లోనే మరో సాలిడ్ హిట్ గా నిలిచింది. యూఎస్ మార్కెట్ లో అదరగొట్టిన ఈ సినిమా రూ.100కోట్ల క్లబ్ లో చేరేందుకు రెడీ అవుతోంది. అలాగే ఈ సినిమా మరింత ఎక్కువ లెక్క దగ్గరే ఆగే అవకాశం కూడా ఉందంటున్నారు. ‘కుబేర’ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా బాలీవుడ్ నటుడు జిమ్ షర్బ్ విలన్ గా, రష్మిక మందన్నా కింగ్ నాగార్జునలు సాలిడ్ పాత్రల్లో నటించారు.
Also read: https://in.bookmyshow.com/movies/hyderabad/kuberaa/buytickets/ET00390533/20250617
Also read: ప్రియుడితో కలిసి తల్లినే చంపిన బాలిక
Also read: సమంత ‘రక్త్ బ్రహ్మాండ్’కు బ్రేక్
Also read: ‘కన్నప్ప’ బుకింగ్స్ కు సాలిడ్ రెస్పాన్స్