హీరో ధనుష్, డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో వస్తున్న సినిమా కుబేర. కింగ్ నాగార్జున ఇందులో కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ శుక్రవారం జరగాల్సి ఉంది. అయితే, అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం నేపథ్యంలో.. ప్రోగ్రాంను చిత్ర బృందం రద్దు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కొత్త డేట్ ను ప్రకటించింది. జూన్ 15న కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహిస్తామని అనౌన్స్ చేసింది. హైదరాబాద్ లోనే దీన్ని కండక్ట్ చేస్తామని తెలిపింది.
వరల్డ్ లో అతి ధనికుడైన వ్యక్తికి.. వీధుల్లో ఉండే ఓ నార్మల్ పర్సన్ కు మధ్య జరిగే ఘర్షణ ఆధారంగా కుబేర తెరకెక్కింది. దీనికి సునీల్ నారంగ్, రామ్ మోహన్ రావు ప్రొడ్యూసర్స్ గా వ్యవహరించారు. మనీలాండరింగ్, హవాలా వంటి అంశాలు కూడా సినిమాలో మిక్స్ అయి ఉంటాయి. నేషనల్ క్రష్ రశ్మిక మందన్నా దీంట్లో హీరోయిన్ గా నటిస్తున్నారు. కుబేర.. వరల్డ్ వైడ్ గా జూన్ 20న రిలీజ్ కానుంది. మరీ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో లెట్స్ వెయిట్ అండ్ సీ.
Read also : ఆ 30 సెకన్లలో ఏం జరిగింది ?
Read also: మంగ్లీ మీద ఎందుకంత కోపం !
🛍️ Recommended for You
Explore top picks in tech, lifestyle & home essentials. Every click supports https://teluguword.com/