English Version : From folk songs to Assembly : Maithili Thakur inspiring journey
Maithili సంగీతం నేర్చుకోడానికి కుటుంబం 17 సార్లు ఇల్లు మారింది
Maithili Tagore : జానపద, ఆధ్యాత్మిక గీతాలతో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన మైథిలీ ఠాకూర్ ఇప్పుడు బిహార్ రాజకీయాల్లో చరిత్ర సృష్టించింది. అలీనగర్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసి, స్థానిక ఆర్జేడీ సీనియర్ నేత వినోద్ మిశ్రాను 11 వేల ఓట్ల తేడాతో ఓడించింది. ఈ విజయంతో ఆమె బిహార్ అసెంబ్లీలోకి ఎన్నికైన అత్యంత పిన్న వయస్కురాలు ఎమ్మెల్యేగా నిలిచింది. 2008లో అలీనగర్ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత తొలిసారి BJP ఇక్కడ గెలుపొందింది.
Maithili సంగీతం నుంచి రాజకీయాల వరకు
- మైథిలీ తన జానపద గీతాలు, ఆధ్యాత్మిక పాటలతో ప్రజాదరణ పొందింది.
- ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన అభిమానులు ఉన్నారు: ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ కలిపి 1.1 కోట్లు, ఫేస్బుక్లో 1.4 కోట్లు.
- 2024లో ఆమె పాడిన శబరి గీతం ప్రధాని మోదీని ఆకట్టుకుంది.
- కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జాతీయ స్థాయి క్రియేటర్ల అవార్డుల్లో ఆమెకు “కల్చరల్ అంబాసిడర్ ఆఫ్ ది ఇయర్” బహుమతి లభించింది.
17సార్లు ఇల్లు మారిన Maithili కుటుంబం
- మైథిలీ 2000 జూలై 25న మధుబని జిల్లా, బేనిపట్టిలో జన్మించింది.
- తండ్రి రమేశ్ ఠాకూర్ శాస్త్రీయ సంగీతకారుడు, ఉపాధ్యాయుడు. తల్లి భారతి గృహిణి.
- చిన్నప్పటి నుంచే తండ్రి ఆమెకు శాస్త్రీయ సంగీతం నేర్పించారు.
- సోదరులు అయాచీ, రిషబ్ కూడా సంగీతంలో శిక్షణ పొందారు.
- సంగీత సాధన వల్ల పొరుగువారికి ఇబ్బంది కలగడంతో కుటుంబం 17 సార్లు ఇల్లు మార్చింది.
- 2017లో సొంత ఇల్లు కొనుగోలు చేసి, 2020లో అపార్ట్మెంట్లోకి మారారు.
Maithili సక్సెస్ ఎలా ?
- మైథిలీ ఇండియన్ ఐడియల్‌లో పాల్గొంది.
- ఐ జీనియస్ యంగ్ సింగింగ్ స్టార్ పోటీలో విజేతగా నిలిచింది.
- రైజింగ్ సింగర్ పోటీల్లో రన్నరప్‌గా నిలిచింది.
- 2023లో ఎన్నికల కమిషన్ ఆమెను మధుబని బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేసింది.
ఊహించని విధంగా మైథిలీ కి బీజేపీ
- 2025లో మైథిలీ భాజపా తరపున రాజకీయాల్లోకి అడుగుపెట్టింది.
- అలీనగర్‌లో ఆమె విజయం చారిత్రాత్మకంగా నిలిచింది.
- ఆర్జేడీ నేత వినోద్ మిశ్రాను 11 వేల ఓట్ల తేడాతో ఓడించింది.
- ఆమె ఎన్నిక యువత రాజకీయాల్లోకి రావడానికి కొత్త మార్గం చూపింది.

Maithili గెలుపుతో బీజేపీకి జోష్
- మైథిలీ ప్రవేశం భారతీయ సంస్కృతి, పాలన కలయికగా భావిస్తున్నారు.
- ఆమె ప్రజాదరణ, సోషల్ మీడియా ప్రభావం భాజపాకు బిహార్‌లో బలం చేకూరుస్తుంది.
- అత్యంత పిన్న వయస్కురాలైన ఎమ్మెల్యేగా ఆమె యువతకు ప్రేరణగా నిలుస్తుంది.
ముగింపు
మైథిలీ ఠాకూర్ ప్రయాణం – ఒక జానపద గాయని నుంచి బిహార్‌లో అత్యంత పిన్న వయస్కురాలైన ఎమ్మెల్యేగా మారడం – యువతకు inspiration. ఆమె జీవితం, కష్టాలు, ప్రతిభ, సోషల్ మీడియా పవర్ మైథిలీని ఎమ్మెల్యేగా నిలబెట్టాయి.
✅ Read also : భోజనం చేశాక 15 నిమిషాలు నడవండి: గుండె పోటు ప్రమాదం 40శాతం తగ్గినట్టే !
📢 Call to Action
- 👉 Follow us on Arattai Group: https://aratt.ai/@teluguword_com
- 👉 Join our Telegram Channel: https://t.me/teluguwordnews


