మాలేగావ్ కేసులో ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్ నిర్దోషి

Latest Posts Top Stories

 ఎన్.ఐ.ఎ కోర్టు సంచ‌ల‌న తీర్పు

Malegaon blast

సంచ‌ల‌నం సృష్టించిన మాలేగావ్ పేలుడు కేసులో ముంబైలోని స్పెష‌ల్ నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ (ఎన్.ఐ.ఎ) కోర్టు కీల‌క తీర్పునిచ్చింది. ఈ కేసులో నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ ఎంపీ, బీజేపీ నాయకురాలు ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్, లెఫ్టినెంట్‌ కర్నల్‌ ప్రసాద్‌ పురోహిత్ స‌హా ఏడుగురిని నిర్దోషులుగా తేల్చింది. గురువారం ఈ తీర్పు చెప్పింది. మాలేగావ్ పేలుడు కేసు ఇన్వెస్టిగేష‌న్ తో పాటు ప్రాసిక్యూషన్ వాద‌న‌లో చాలా లోపాలు ఉన్నాయ‌ని కోర్టు తెలిపింది.

ఈ కేసుకు ఉపా చ‌ట్టం వ‌ర్తించ‌ద‌ని న్యాయ‌స్థానం వెల్ల‌డించింది. పేలుడుకు వాడిన బైక్ ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్ పేరు మీద రిజిస్ట‌ర్ అయింద‌ని ప్రాసిక్యూష‌న్ ఆర్గ్యూ చేసింది. కానీ ఆ వాద‌న‌కు త‌గిన సాక్ష్యాధార‌లు లేవు. ఆ బైక్ కు సెట్ చేసిన బాంబు వ‌ల్లే బ్లాస్ట్ జ‌రిగింద‌నేందుకు కూడా ఆధారాలు లేవు. కేవ‌లం నైతిక ఆధారాలు, ఊహాగానాల‌తో కోర్టులు ఎవ‌రికీ శిక్ష వేయ‌వు. మాలేగావ్ కేసులో కేవ‌లం బెనిఫిట్ ఆఫ్ డౌట్ మాత్ర‌మే ఉంది.. అంత‌కుమించి బ‌ల‌మైన ఆధారాలు ల‌భ్యం కాలేదు అని ఎన్.ఐ.ఎ కోర్టు తెలిపింది. బ్లాస్ట్ లో చ‌నిపోయిన వారి కుటుంబాల‌కు రూ. 2 ల‌క్ష‌లు.. గాయ‌ప‌డిన వారికి రూ. 50 వేలు ఇవ్వాల‌ని ఆదేశించింది.

ఇంత‌కీ కేసు ఏంటంటే?

2008 సెప్టెంబరు 29న మహారాష్ట్రలోని మాలేగావ్ లో మసీదుకు ద‌గ్గ‌ర్లో భారీ పేలుడు సంభ‌వించింది. బ్లాస్ ధాటికి ఆరుగురు స్పాట్ లోనే చ‌నిపోయారు. వంద మందికిపైగా గాయ‌ప‌డ్డారు. ఈ కేసు ద‌ర్యాప్తును యాంటీ టెర్రర్‌ స్క్వాడ్ స్టార్ట్ చేసింది. త‌ర్వాత ఎన్.ఐ.ఎ రంగంలోకి దిగింది. ఇప్ప‌టి వ‌ర‌కు 220 మంది సాక్షుల‌ను విచారించింది. 17 సంవ‌త్స‌రాల పాటు ఈ ప్రాసెస్ జ‌రిగింది.

తాజాగా జస్టిస్ ఏకే లహోటి మాలేగావ్ కేసులో తీర్పును వెలువరించారు. ప్రజ్ఞా ఠాకూర్‌, లెఫ్టినెంట్‌ కర్నల్‌ ప్రసాద్‌ పురోహిత్ తో పాటు మేజర్‌ (రిటైర్డ్‌) రమేష్‌ ఉపాధ్యాయ్‌, సుధాకర్‌ చతుర్వేది, అజయ్‌ రహిర్కర్‌, సుధాకర్‌ ధర్‌ ద్వివేది అలియాస్‌ శంకరాచార్య, సమీర్‌ కులకర్ణిలను నిర్దోషులుగా తేల్చారు. అయితే ఈ తీర్పుపై హై కోర్ట‌ను ఆశ్ర‌యిస్తామ‌ని బాధితుల కుటుంబాలు వెల్ల‌డించాయి

 

ఇలాంటి మంచి ఆర్టికల్స్ అందిస్తున్న TELUGU WORD టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

తెలుగు వర్డ్ Telegram Link : CLICK HERE FOR TELEGRAM LINK

Read also : అమెరికా వద్దంటే మన టెకీల ఫ్యూచర్ ఏంటి ?

Read also : ఫోన్ ట్యాపింగ్ – లీగలా, ఇల్లీగలా?

Tagged

Leave a Reply