బండితో మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి భేటీ
రాష్ట్ర బీజేపీలో బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య గొదవ ముదురుతోంది. ఈ టైమ్‌లో మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతి రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను కలవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ భేటీ వెనక ఏదో పెద్ద ప్లాన్ ఉందని అంటున్నారు. బండి సంజయ్, ఈటలకు చెక్ పెట్టేందుకు మల్లారెడ్డి కుటుంబంతో పొలిటికల్ డీల్ చేస్తున్నారా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆదివారం పాతబస్తీలో జరిగిన బోనాల వేడుకల సందర్భంగా, మేకలమండికి చెందిన ఓ బీజేపీ లీడర్ ఇంట్లో బండితో ప్రీతి రెడ్డి లంచ్ మీటింగ్ అయ్యారు. అంతేకాదు, పాతబస్తీ బోనాల వేడుకల్లో వీళ్ళిద్దరి ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. మల్లారెడ్డి కుటుంబం బీఆర్ఎస్‌లో ఉండగా, , బండి సంజయ్‌తో ఇలా ఓపెన్‌గా భేటీ అవ్వడమంటే, కొత్త పొలిటికల్ గేమ్ మొదలైనట్టు అనుమానాలు వస్తున్నాయి.
మల్లారెడ్డి ఫ్యామిలీ పొలిటికల్ గా యాక్టివ్
మల్లారెడ్డి హెల్త్ యూనివర్సిటీ, మెడికల్ కాలేజీల బాధ్యతలు చూస్తున్న మల్లారెడ్డి చిన్న కొడుకు డాక్టర్ భద్రారెడ్డి, కోడలు డాక్టర్ ప్రీతి రెడ్డి రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మల్లారెడ్డి గెలుపు కోసం దంపతులిద్దరూ ఇల్లిల్లూ తిరిగారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నుంచి భద్రారెడ్డి ఎంపీగా పోటీ చేయాలని మల్లారెడ్డి ఫ్యామిలీ ప్లాన్ చేసింది. బీఆర్ఎస్ కార్యక్రమాల్లో భద్రారెడ్డి యాక్టివ్‌గా పాల్గొన్నారు, ఆయనే ఎంపీ అభ్యర్థి అని గులాగీ పార్టీ లీడర్లు కూడా ప్రచారం చేశారు. కానీ, బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తే గెలవడం కష్టమని భావించి, భద్రారెడ్డి చివరి నిమిషంలో తప్పుకున్నారు. దీంతో బీఆర్ఎస్ రాగిడి లక్ష్మారెడ్డిని ఎంపీ అభ్యర్థిగా నిలిపింది, కానీ ఆయన ఈటల రాజేందర్ చేతిలో ఓడిపోయారు. బీజేపీలో బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య విభేదాలు నడుస్తున్నాయి. ఈమధ్య హుజూరాబాద్ నేతలు ఈటల ఇంట్లో సమావేశమైనప్పుడు… బండి సంజయ్‌పై విమర్శలు చేశారు. ఈ టైమ్ లో మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డితో బండి సంజయ్ భేటీ అవ్వడం చర్చకు దారితీసింది. మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో మల్లారెడ్డి కుటుంబానికి బలమైన రాజకీయ పలుకుబడి ఉంది. మల్లారెడ్డి మేడ్చల్ ఎమ్మెల్యేగా, ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి మల్కాజ్‌గిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. 2014లో మల్లారెడ్డి మల్కాజ్‌గిరి ఎంపీగా గెలిచారు, 2019లో మర్రి రాజశేఖర్ రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేసి, స్వల్ప ఓట్ల తేడాతో రేవంత్ రెడ్డి చేతిలో ఓడిపోయారు.
బండి సంజయ్ కొత్త ప్లాన్?
మల్కాజ్‌గిరిలో మల్లారెడ్డి కుటుంబానికి ఉన్న రాజకీయ పట్టును బండి సంజయ్ వాడుకుంటూ, ఈటల రాజేందర్‌కు చెక్ పెట్టేందుకు కొత్త ప్లాన్ వేస్తున్నారా అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. బండి సంజయ్, తెలంగాణ బీజేపీలో తన ఆధిపత్యాన్ని చాటుకోవడానికి ఇలాంటి కొత్త అలయన్స్‌లను ట్రై చేస్తున్నారనే టాక్ నడుస్తోంది. మల్లారెడ్డి కుటుంబం కూడా బీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.
భద్రారెడ్డి ఏమన్నారు?
డాక్టర్ భద్రారెడ్డి మాత్రం,“పాతబస్తీలో బోనాల వేడుకలకు ఆహ్వానిస్తే, నా భార్య ప్రీతి రెడ్డి వెళ్లారు. ఆ లంచ్ మీటింగ్‌లో రాజకీయాలపై ఎలాంటి చర్చ జరగలేదు. బీఆర్ఎస్ నాయకులు కూడా ఆ మీటింగ్‌లో ఉన్నారు” అని చెప్పారు. కానీ, ఈ భేటీపై బీజేపీ, బీఆర్ఎస్‌లో డిస్కషన్ నడుస్తోంది.
Also read: కేసీఆర్, కేటీఆర్ లకు కవిత పోరు ఇంతింత కాదయా
Also read: ఫిష్ వెంకట్ కథ: మనందరికీ గుణపాఠం
Also read: లోన్లకు సిబిల్ స్కోర్ అక్కర్లేదా?