Mallojula Surrender : ఇంకా ఎదురొడ్డి పోరాడలేకో..ఎన్కౌంటర్కు భయపడో..పెయ్యిల నెత్తురు సచ్చో..సర్కారుకు సరెండయ్యావ్. తప్పేంగాదు…అట్ల మస్తుమందైండ్రు గూడ. ఇంటిని ఇడిశి.. అడవిలుండి శాతనైన కాడికి కొట్లాడినోళ్లు పాణాలు సుత ఇయ్యాల్సిందే అనడం కరెక్ట్ కాదు. మల్లోజుల సుత అంతే.
ఐతే…
మావోయిస్ట్ పార్టీల (Maoist Leader Mallojula) మల్లోజుల టాప్ లీడర్. తెలంగాణ, మహా రాష్ట్ర, ఛత్తీస్ గడ్ రాష్ట్రాల్లో నూరుకు మీద కేసులు…6 కోట్ల రివార్డు (Rs.6 Crores Reward ఉన్నదట. ఉద్యమంలోనే అన్నను కోల్పోయిండు..అమ్మ ఆఖరి సాపుకు నోసుకోలే. 45 ఏండ్ల అజ్ఞాత జీవితంల తుపాకే తోడుంది. కనియ్యాల అదే తుపాకీతో ఉద్యమాన్ని ఎన్కౌంటర్ చేశింతనంత పన్జేశిండు.

అడవి విముక్తి ఐనట్టు.. ఆదివాసీల బతుకులు మారినట్టు, ఇన్నేండ్ల పోరాటానికి ప్రతిఫలం దక్కినట్టు ఆ ఎచ్చిడి నవ్వులేంది..సీఎం సీరియస్ గా సూస్తుంటే చిల్లర పనులేంది. అంబానీ, అదానీలకు అడవి తొవ్వ సాఫ్ జేశి నందుకు సంబురమా..? ముఖ్యమంత్రే నా కోసం వచ్చిండనే మురిపేమా..? పోలీసులే సెక్రూటీ ఇస్తుండ్రనే ఆనందమా..? మీ పార్టీల ఏం జరిగిందో మాకు తెల్వదుగని.. ఇయ్యాల నీ కథ సూస్తుంటే ఎందర్నో ఖతం బట్టిచ్చినట్టే కొడ్తుంది. తోపు లీడర్వని ఉద్యమానికి నువ్వు అవసరమని నిన్ను బతికిస్తానికి అమరు లైన అన్నలెందరో పాపం.
కొట్లాడే కాడికి కొట్లాడినవ్.. పాణం బాగలేదని సప్పుడుగాంట లొంగిపోతే ఐపోవుగా. నవ్వెటోని ముంగట జారివడ్డట్టు నెరీ గింత అన్యాలమా..? పెద్దపల్లి పెద్దపులి మల్లోజుల కోటేశ్వర రావు బతికుంటే ఏంజేసో… కన్న తల్లి మధురమ్మ ఏమనో. ఇన్నెండ్ల నీ పోరాటాన్ని ఇయ్యాల నువ్వే ఎన్కౌంటర్ జేస్కున్నవ్.
మీ త్యాగాల గురించి రాశే తాకత్ మాకు లేదుగని…నీ గురించి ఈ ముక్క రాయడం తప్పులేదు అనుకుంటున్న..