నన్నెందుకు టార్గెట్ చేస్తున్నారు ? : చిరంజీవి

ET World Latest Posts Top Stories Trending Now

* రాజకీయ విమర్శలపై చిరంజీవి కౌంటర్
* నా మంచి పనులే సమాధానం చెబుతాయి
* మంచి చేసే తమ్ముళ్ళకు సహకరిస్తా
* రాజకీయాలకు దూరమేనన్న మెగాస్టార్
* జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టిక్కెట్ పుకార్లే

తెలుగు సినిమా పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవిది ప్రత్యేక స్థానం. తన నటనతో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నారు..ఆ తర్వాత తన సామాజిక కార్యక్రమాల్లోనూ అంతే పేరు తెచ్చుకున్నారు. ఒక్క ప్రజారాజ్యం పార్టీయే మెగాస్టార్ జీవితంలో మచ్చ లాంటిది. అభిమానులు ఆదరించినా… ఓటర్లు కరుణించకపోవడం. వేరే పార్టీల నేతలు తిట్టిపోయడం… ఇలాంటి కుళ్ళు రాజకీయాల్లోకి మెగాస్టార్ రాకుండా ఉంటే బాగుండేదని చాలామంది అనుకున్నారు. చిరంజీవి కూడా ఇదే భావించి…. పాలిటిక్స్ కి గుడ్ బై కొట్టారు. కానీ ఆయన ఇప్పటికీ హాట్ ఫేవరేట్. అన్ని రాజకీయ పార్టీలు చిరంజీవిని పదవుల పేరుతో ఊరిస్తూ ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్… మావాడే అని క్లెయిమ్ చేసుకుంటున్నాయి. మొన్న సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు మెగాస్టార్. దాంతో ఆయన్ని జూబ్లీహిల్స్ నుంచి నిలబెడతారని … కాంగ్రెస్ టిక్కెట్ ఇచ్చేందుకే రేవంత్ పిలిపించారని మళ్ళీ టాక్స్ మొదలయ్యాయి. బుధవారం నాడు ఓ కార్యక్రమంలో ఈ ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెట్టారు చిరంజీవి.

నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు : చిరంజీవి

“నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు, నేను ఆ బాటలో లేను!” అని మెగాస్టార్ చిరంజీవి స్పష్టంగా చెప్పారు, తన ఫోకస్ సినిమాలు, సామాజిక సేవలపైనే ఉందనన్నారు. కొన్ని జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. దీంతో ఆ సీటులో ఉప ఎన్నిక రాబోతోంది. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలో గెలిచి తమ సత్తా చాటాలని చూస్తోంది. ఈ క్రమంలో చిరంజీవిని అభ్యర్థిగా నిలబెట్టాలని కొందరు ఆలోచిస్తున్నారని రెండు దినపత్రికలు కథనాలు రాశాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చిరు రెండు రోజుల క్రితం కలిసినప్పుడు అక్కడ రాజకీయ చర్చలు జరిగాయనేది వాళ్ళ కథనం. కానీ, చిరంజీవి మాత్రం స్పష్టంగా చెప్పారు—“నా దృష్టి సినిమా ఇండస్ట్రీ సమస్యలు, సామాజిక కార్యక్రమాలపైనే. రాజకీయాల్లోకి రావడం లేదు.” అని. ఫోనిక్స్ సంస్థ రక్తదాన శిబిరంలో మెగస్టార్ మాట్లాడారు. “నేను చేసే మంచి పనులే నాకు రక్ష. విమర్శలకు స్పందించను,” అని అన్నారు. దాంతో జూబ్లీ హిల్స్ ఎన్నికల గురించి వస్తున్న పుకార్లకు కూడా
పరోక్షంగా సమాధానం ఇచ్చినట్టు అర్థమవుతోంది.

Chiranjeevi Revanth

కాంగ్రెస్ వ్యూహం ఏంటి?

జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలవాలని బలంగా కోరుకుంటోంది. సర్వేల్లో పార్టీ వెనకబడి ఉందని, అందుకే చిరంజీవి లాంటి సెలబ్రిటీని రంగంలోకి దింపాలని ఆలోచిస్తున్నట్టు కథనాలు వస్తున్నాయి. కానీ, చిరు స్పష్టంగా నో చెప్పారు. కానీ చిరంజీవి లాంటి లెజెండ్‌ని మళ్ళీ కుళ్లు రాజకీయాల్లోకి లాగడం సరికాదంటున్నారు అభిమానులు. ఆయన సినిమాలతో, సామాజిక సేవలతో సంతోషంగా ఉన్నారు. “మంచి చేస్తే శ్రీరామరక్ష,” అన్న ఆయన మాటలే ఇక్కడ గుర్తుంచుకోవాలి.

లెట్ హిమ్ బీ హ్యాపీ!

ఇలాంటి మంచి ఆర్టికల్స్ అందిస్తున్న TELUGU WORD టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

తెలుగు వర్డ్ Telegram Link : CLICK HERE FOR TELEGRAM LINK

Read also : OnePlus 13Rపై భారీ డిస్కౌంట్: అదిరిపోయే ఆఫర్‌ మిస్ చేయకండి!

Read also : ట్రంప్ కి అంత అహంకారమా ?

Read also : పాతికేళ్ళకే గుండె పోటు : కుప్పకూలుతున్న యువత

 

Tagged

Leave a Reply