స్టార్ హీరోయిన్ నయనతార (Nayanthara) దర్శకుడు, నిర్మాతగా మారిన హీరో ధనుష్ (Dhanush)కీ 10 కోట్ల పంచాయతీ నడుస్తోంది. ధనుష్ ఎలాంటి వాడో తెలుసా అంటూ నయనతార ఏకంగా మూడు పేజీల బహిరంగ లెటర్ రిలీజ్ చేయడం ఇప్పుడు Kollywood ని షేక్ చేస్తోంది. నువ్వు తండ్రి, సోదరుడి సపోర్ట్ తో ఇండస్ట్రీకి వచ్చావ్… నేను పరిశ్రమతో సంబంధం లేకుండా ఈ స్థాయికి వచ్చా… అంటూ ధనుష్ ని లెటర్ లో కడిగిపారేసింది నయనతారు. ఈ వివాదంలో నయన్ కు నటీ నటులు మద్దతు ఇస్తుంటే… ధనుష్ కి ఫ్యాన్స్ నుంచి సపోర్ట్ అందుతోంది.
ఇంతకీ ఏంటా వివాదం ?
దర్శక నిర్మాతగా మారిన హీరో ధనుష్ (Dhanush)పై విరుచుకుపడుతూ నటి నయనతార తన Instagram, X ద్వారా 3 పేజీల బహిరంగ లెటర్ రిలీజ్ చేసింది. నయనతార, తన భర్త విఘ్నేష్ శివన్ హీరోగా ‘నానుమ్ రౌడీ దాన్ (Naanum Rowdy Dhaan movie) (నేను రౌడీనే) మూవీని నిర్మించారు ధనుష్. అయితే నయన్, విఘ్నేష్ గురించి లేటెస్ట్ Netflix డాక్యుమెంటరీ ‘Nayanthara beyond the fairy taleలో’ ‘నానుమ్ రౌడీ దాన్’ లోని పాటలు వాడుకోడానికి ధనుష్ అవకాశం ఇవ్వలేదు. దాంతో Nayanthara ఈ విమర్శలు చేశారు. ఇదే డాక్యుమెంటరీలో 3 సెకన్ల క్లిప్ వాడటంతో నయన్, ధనుష్ మధ్య వివాదం మొదలైంది.
Netflix డాక్యుమెంటరీతో ముదిరిన వివాదం
నయనతార, డైరెక్టర్ విఘ్నేష్ శివన్ 2022లో పెళ్ళి చేసుకున్నారు. వీరి పెళ్లిని ప్రముఖ OTT ప్లాట్ ఫామ్ Netflixలో డాక్యుమెంటరీగా రిలీజ్ చేస్తోంది. ఈ డాక్యుమెంటరీ నవంబర్ 18 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ డాక్యుమెంటరీ ఆలస్యం అవడానికి హీరో ధనుష్ కారణమంటూ లెటర్ రిలీజ్ చేసింది నయనతార.
“తండ్రి, దర్శకుడపైన సోదరుడి సపోర్ట్ తో ఇండస్ట్రీలోకి వచ్చి … గొప్ప నటుడివి అయ్యావ్. నా లాంటి ఎందరో వ్యక్తుల మనుగడ కోసం చేసే పోరాటం ఈ సినిమా. నేను ఇండస్ట్రీతో సంబంధం లేకున్నా ఈ స్థాయికి రావడానికి చాలా పోరాడా. నా వృత్తికీ, నా అభిమానులకీ ఎప్పుడూ రుణపడి ఉంటా. నా జీవితం ఆధారంగా Netflix తయారు చేసిన డాక్యుమెంటరీ కోసం సినీ ప్రముఖులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎన్నో ఇబ్బందుల మధ్య దీన్ని రూపొందించాం. మీరు మాపై పెట్టుకున్న ప్రతీకారం… మమ్మల్నీ, ఇందులో భాగమైన ఇతర సభ్యుల్నీ ఇబ్బంది పెడుతోంది. మా జీవితంలో ఎంతో ముఖ్యమైన Naanum Rowdy Dhaan movie ఈ డాక్యుమెంటరీలో భాగం కాకపోవడం చాలా బాధగా ఉంది” అంటూ లెటర్ రాసింది నయనతార.
అభిమానులకు కనిపించే ధనుష్ వేరు…. అసలైన ధనుష్ వేరని ఆరోపించింది. ఫాన్స్ కు సూక్తులు చెప్పే నువ్వు వాటిని ఎందుకు పాటించవ్ అంటూ ఓ రేంజ్ లో ధనుష్ పై ఫైర్ అయింది నయనతార. Naanum Rowdy Dhaan movieని నిర్మించింది హీరో ధనుష్. ఇందులో కొన్ని లిరిక్స్, క్లిప్స్, సీన్స్ వాడుకుంటామని ధనుష్‌ను నయన్ రిక్వెస్ట్ చేసిందట. కానీ ధనుష్ వాళ్ళకి No Objection certificate ఇవ్వలేదు. దాంతో ఆ సినిమా టైమ్ లో తమ మొబైల్ లో తీసిన కొన్ని విజువల్స్ లో 3 సెకన్ల పాటు Nayanthara beyond the fairy taleలో ఎడిట్ చేసి, రీ షూట్ చేసి వాడారట. జస్ట్ 3 సెకన్ల BTS ఫుటేజీ వాడినందుకు ధనుష్ రూ.10 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేశారని నయన్ ఆరోపిస్తోంది.
“ప్రైవేట్‌గా తీసిన సీన్‌కి, ఇప్పటికే వెబ్సైట్లలో షేర్ చేసినందుకు పది కోట్లు పరిహారం కోరడం విచిత్రంగా ఉంది. మీరు స్టేజ్ మీద మాట్లాడే మాటలను నిజ జీవితంలో ఒక్కసారైనా పాటించరని నాకు, నా భర్తకు తెలుసు” అంటూ లెటర్లో మండిపడింది నయనతార. ‘ధనుష్ మాపై వ్యక్తిగత ద్వేషంతోనే… ఉద్దేశపూర్వకంగానే ఇలా చేయడం బాధగా ఉంది. Netflix డాక్యుమెంటరీ ట్రైలర్ రిలీజ్ అయ్యాక నష్టపరిహారం డిమాండ్ చేయడం బాధ కలిగించింది” అంటోంది నయనతారు. ఓ నిర్మాత తన సినిమాల్లో పనిచేసే ఆర్టిస్టుల వ్యక్తిగత జీవితం, స్వేచ్ఛను నియంత్రిస్తాడా? ఈ చర్యలను చట్టపరంగా ఎదుర్కుంటామని ధనుష్ కి వార్నింగ్ ఇచ్చింది నయనతార. . Naanum Rowdy Dhaan movieకి సీన్స్, పాటలకు Copyright no hold bard సర్టిఫికేట్ ఎందుకు ఇవ్వలేదో కోర్టులో తేల్చుకుందాం అంటోంది నయనతార.
నయన్ కు తారల మద్దతు…ధనుష్ కి ఫ్యాన్స్ సపోర్ట్
Naanum Rowdy Dhaan మూవీలో క్లిప్స్ వాడుకున్నందుకు నిర్మాత, హీరో ధనుష్ 10 కోట్ల రూపాయల పరిహారం డిమాండ్ చేయడంపై నయన తార రాసిన లెటర్ కోలీవుడ్ లో సంచలనం రేపుతోంది. నయన్ కు సినిమా నటీ, నటుల నుంచి మద్దతు లభిస్తోంది. ఆమె లెటర్ కి Sruthi Haasan, Iswarya Laxmi, Nazria, Yekta kapoor, Diya Mirza, Silparao లైక్ కొట్టారు. మలయాళ నటి పార్వతీ తిరువొత్తు కూడా సెల్యూట్ చేస్తూ నయన్ ధైర్యాన్ని మెచ్చుకుంది. స్మృతి కిరణ్ అనే డైరెక్టర్ కూడా స్పందించారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ధనుష్ కు ఫ్యాన్స్ ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. అగ్రనటుడిపై బహిరంగ విమర్శలు చేయడం ఏంటని #WestandwithDhanush అంటూ ట్యాగ్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ధనుష్ ని అవమానించడానికే ఈ లెటర్ రిలీజ్ చేసిందని మండిపడుతున్నారు. దాంతో Nayanthara, Dhanush issue ఇప్పుడు Google Trends, X లో ఫుల్లుగా ట్రెండింగ్ లో ఉంది.