కొత్త ULI సిస్టమ్ ఏంటో తెలుసుకోండి!
మనం బ్యాంక్ నుంచో, ఫైనాన్షియల్ సంస్థ నుంచో లోన్ తీసుకోవాలనుకుంటే, మొదట వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ప్రశ్న ఏంటంటే,
“మీ సిబిల్ స్కోర్ ఎంత?” అని.
కానీ, ఇప్పుడు ఈ సిబిల్ స్కోర్ చెక్ చేసే పద్ధతి త్వరలో మారిపోవచ్చు!
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని
ఆర్థిక సేవల విభాగం (DFS) కొత్త డిజిటల్ లెండింగ్ వ్యవస్థ,
యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్‌ఫేస్ (ULI)ని తీసుకొస్తోంది.
ఈ వ్యవస్థ సాంప్రదాయ సిబిల్ స్కోర్‌పై ఆధారపడటాన్ని తగ్గించి,
మనకు లోన్స్ ఇచ్చే సిస్టమ్ ను చాలా ఈజీ చేయబోతోంది
ULI అంటే ఏమిటి?
ULI…. అంటే యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్‌ఫేస్, ఒక డిజిటల్ ప్లాట్‌ఫారమ్.
ఇది టెక్నాలజీ, డేటా, పాలసీలను సమీకృతం చేస్తూ,
లోన్స్ ఇచ్చే వ్యవస్థను స్పీడప్ చేస్తుంది.
ఈ సిస్టమ్ ద్వారా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ప్రభుత్వ శాఖల నుంచి
నమ్మదగిన, ధృవీకరించిన డేటాను యాక్సెస్ చేయవచ్చు.
సాంప్రదాయంగా వచ్చే సిబిల్ స్కోర్‌తో పాటు,
యుటిలిటీ బిల్లు చెల్లింపులు, GST రికార్డులు,
బ్యాంక్ లావాదేవీలు లాంటి ఇతర డేటాను కూడా యాక్సెస్ చేసి…
మనకు లోన్ వచ్చే ఎలిజిబిలిటీని అంచనా వేస్తుంది.
దీనివల్ల గ్రామీణ రైతులు, చిన్న వ్యాపారులు, MSMEలు ఈజీగా లోన్స్ పొందే అవకాశం ఉంటుంది.
ULI ఎలా పనిచేస్తుంది?
ULI ద్వారా… లోన్స్ ఇచ్చే బ్యాంకులు… ఇతర ఫైనాన్షియల్ సంస్థలను
ఒకే ప్లాట్‌ఫారమ్ కింద… లోన్ తీసుకునే కస్టమర్ల…
ఆర్థిక, ఆర్థికేతర డేటాను యాక్సెస్ చేయవచ్చు.
ఉదాహరణకు, ఒక రైతు లోన్ కోసం అప్లై చేస్తే, అతని GSTరిటర్న్‌లు ఉంటే… అవి
బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు, లేదా యుటిలిటీ బిల్లు చెల్లింపులు లాంటి డేటాను చూసి,
అతనికి రుణం ఇవ్వాలా వద్దా అన్నది నిర్ణయించవచ్చు.
దీనివల్ల సిబిల్ లాంటి క్రెడిట్ బ్యూరోలపై ఆధారపడకుండా,
స్పీడ్ గా నిర్ణయాలు తీసుకోవడానికి వీలుంటుంది.
ULI వల్ల పేపర్ వర్క్ తగ్గిపోతుంది…
మన డిజిటల్ డేటాను యాక్సెస్ చేయడం ద్వారా లోన్ శాంక్షన్ చేసే టైమ్ తగ్గిపోతుంది… .
సిబిల్ స్కోర్‌తో పాటు, యుటిలిటీ బిల్లులు, జీఎస్టీ రికార్డులు, బ్యాంక్ లావాదేవీలను చూస్తుంది…
వివిధ ఫైనాన్షియల్ సంస్థల మధ్య డేటా మార్పిడి ఈజీగా అవుతుంది…
లోన్లు తీసుకునేవాళ్ళు తమ డేటాను యాక్సెస్ చేసేందుకు అనుమతి ఇవ్వవచ్చు, దీనివల్ల మోసాలు కూడా తగ్గుతాయి.
సిబిల్ స్కోర్ ఇప్పటికీ ముఖ్యమా?
ప్రస్తుతం, సిబిల్ స్కోర్ (300-900 రేంజ్‌లో ఉండే మూడు అంకెల స్కోర్) రుణఅర్హతను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. 750 లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ ఉంటే, తక్కువ వడ్డీ రేట్లతో, ఎక్కువ లోన్ అమౌంట్‌తో, ఈజీగా లోన్ పొందవచ్చు.
అయితే, ULI వ్యవస్థ వచ్చాక, సిబిల్ స్కోర్ ఒక్కటే కాకుండా, ఇతర డేటా సోర్సెస్ కూడా
రుణ అర్హతను నిర్ణయించడంలో ఉపయోగపడతాయి.
ఉదాహరణకు, ఒక వ్యక్తి సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నా, అతని బ్యాంక్ లావాదేవీలు,
యుటిలిటీ బిల్లు చెల్లింపులు సకాలంలో ఉంటే, ULI ద్వారా రుణం పొందే అవకాశం ఉంటుంది.
2025లో RBI కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. లోన్ రిజెక్ట్ అయితే, బ్యాంకులు దానికి కారణాన్ని
కస్టమర్ కి తెలియజేయాలి.
సిబిల్ రిపోర్ట్‌లో ఏదైనా ఎర్రర్ ఉంటే, దాన్ని సరిచేయడానికి 30 రోజుల టైమ్ ఇస్తున్నారు.
ఇది రుణగ్రహీతలకు ట్రాన్స్ పరెన్సీని అందిస్తుంది,
కానీ లోన్ ఆమోద ప్రక్రియ కొంచెం ఆలస్యం కావచ్చు.
ULI ఎవరికి ఉపయోగపడుతుంది?
గ్రామీణ రైతులు: సిబిల్ స్కోర్ లేని లేని రైతులు కూడా ULI ద్వారా రుణాలు పొందవచ్చు.
MSMEలు: చిన్న వ్యాపారాలకు సకాలంలో రుణాలు అందుతాయి, దీనివల్ల వ్యాపార వృద్ధి సాధ్యమవుతుంది.
తక్కువ సిబిల్ స్కోర్ ఉన్నవారు: సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నవారు కూడా ఇతర డేటా ఆధారంగా రుణాలు పొందే అవకాశం ఉంటుంది.
సామాన్య ప్రజలు: డిజిటలైజ్డ్ ప్రక్రియ వల్ల లోన్ శాంక్షన్ స్పీడప్ అవుతుంది, పేపర్‌వర్క్ తగ్గుతుంది.
ఇప్పుడు ఏం చేయాలి?
ULI పూర్తిగా అమలులోకి వచ్చే వరకు, సిబిల్ స్కోర్ ఇప్పటికీ ముఖ్యమైనదే.
మీ సిబిల్ స్కోర్ 685 కంటే తక్కువ ఉంటే, రుణం పొందడం కష్టమవుతుంది, లేదా వడ్డీ రేట్లు ఎక్కువ ఉంటాయి.
అందువల్ల మీ సిబిల్ స్కోర్‌ను ఇప్పుడే చెక్ చేసుకోండి.
ఏదైనా ఎర్రర్ ఉంటే, CIBIL వెబ్‌సైట్‌లో డిస్ప్యూట్ ను రైజ్ చేసి సరిచేయించుకోండి…
EMIలు, క్రెడిట్ కార్డ్ బిల్లులు సకాలంలో చెల్లించండి.
క్రెడిట్ లిమిట్‌లో 30% కంటే ఎక్కువ వాడకండి.
ULI వ్యవస్థ 2025లో దేశవ్యాప్తంగా అమలులోకి వస్తే, రుణ ప్రక్రియ మరింత సులభమవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారు, క్రెడిట్ హిస్టరీ లేనివారు కూడా ఈ సిస్టమ్ ద్వారా రుణాలు పొందే అవకాశం ఉంటుంది.
Also read: అరెస్ట్ చేయకుండా జగన్ పక్కా ప్లాన్
Also read: బీహార్ లో 41 లక్షల ఓటర్లు మిస్సింగ్
Also read: కవిత ఇంటికి వాస్తు దోషం వల్లే సమస్యలు