విదేశాల్లో చదువులు ఆగినట్టేనా ?

Latest Posts NRI Times Top Stories Trending Now

న్యూఢిల్లీ : ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్టే కుదిరి మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అయ్యాయి. 11 రోజులుగా జరుగుతున్న యుద్ధంతో అక్కడి జన జీవనం భయానకంగా మారింది. జెరూసలెం, టెహ్రాన్ లాంటి కొన్ని నగరాల్లో ఏ క్షణం ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు . యుద్ధభూమి నుంచి భారత పౌరులను స్వదేశానికి తరలించే ఆపరేషన్ సింధు కొనసాగుతోంది. ఐదు రోజుల్లో ఇరాన్ నుంచి ఎనిమిది విమానాల్లో 1700 మందికి పైగా భారతీయులు ఇళ్ళకు చేరుకున్నారు. 162 మంది ఇజ్రాయెల్ నుంచి జోర్డాన్ సరిహద్దు దాటి వచ్చారు. టెల్‌అవీవ్‌లోని ఇండియన్ ఎంబసీ నుంచి బస్సుల్లో భారతీయులను జోర్డాన్‌కి తరలిస్తున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి తీసుకొస్తున్నారు.

చదువులు ఆగినట్టేనా ?

ఇరాన్‌-ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం ఎప్పటికి ఆగుతుందో తెలీదు. దాంతో చాలామంది ఇండియన్ స్టూడెంట్స్ ఫ్యూచర్ అయోమయంలో పడింది. ఇరాన్ లో చాలా మంది భారతీయులు మెడికల్ విద్యార్థులే ఉన్నారు. ఇరాన్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో మెడిసిన్ చదువుతున్నారు. వీళ్ళు కాకుండా ఇంజనీరింగ్ చదివే వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళల్లో ఫైనలియర్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. మరికొన్ని రోజుల్లో ఫైనల్ ఎగ్జామ్స్ పూర్తయితే డాక్టర్ పట్టాలు చేతికి వస్తాయని భావించారు. తాము ఈ కోర్సు కోసం చాలా డబ్బులు ఖర్చు చేశామని వాపోతున్నారు. ఇజ్రాయెల్ తో యుద్ధం మొదలైనప్పటి నుంచీ చాలామంది ఎంబీబీఎస్ విద్యార్థులు బిక్కు బిక్కుమంటూ కాలం గడిపారు. తమ పక్కనే భవనాల్లో బాంబు దాడులు జరుగుతుండటంతో వణికిపోయేవారు. ఇరాన్ చాలా ప్రశాంతంగా ఉండే దేశమనీ, ఇళా జరుగుతుందని అనుకోలేదని కొందరు విద్యార్థులు చెబుతున్నారు. కొందరు విద్యార్థులు
టెహ్రాన్‌లోని ఉర్మియా యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఎంబీబీఎస్ చదువుతున్నారు. ఆ వర్సిటీలో పరీక్షలు పూర్తి అయ్యాయనీ, తమ కోర్సు రిజల్ట్స్ రావాల్సి ఉందని చెబుతున్నారు. భారత ప్రభుత్వం తమ పరిస్థితిని అర్థం చేసుకుని ఏదైనా ఆల్టర్నేట్ రూట్ చూడాలని కోరుతున్నారు.

Also read: భారీగా తగ్గనున్న ఎంపీటీసీ స్థానాలు !

Also read: కలెక్షన్లు కుమ్మేస్తున్న‘కుబేర’

Also read: ప్రియుడితో కలిసి తల్లినే చంపిన బాలిక

Also read: https://www.indiatvnews.com/news/india/india-begins-evacuating-students-from-iran-via-armenia-amid-escalating-israel-iran-conflict-10-points-2025-06-17-994968

Tagged

Leave a Reply