అభిమానులను ప్రతి ఏడాది ఓ సినిమాతో అలరించేందుకు ఎన్టీఆర్ పక్కా ప్లాన్ తో ముందుకెళ్తున్నారు. ఆయన నటిస్తున్న బాలీవుడ్ పాన్‌ఇండియా మల్టీస్టారర్ ‘వార్ 2’ ఈ ఏడాది ఆగస్ట్ 14న విడుదలవుతోంది. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ దాదాపు 90 శాతం పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. తారక్ కేరక్టర్ పై బాలీవుడ్‌లో వేర్వేరు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన నెగటివ్ షేడ్స్ లో కనిపిస్తారనీ, హృత్రిక్ పాత్రకు గట్టి పోటీగా ఉంటుందని సమాచారం.
మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ (వర్కింగ్ టైటిల్) సినిమా షూటింగ్ కూడా మొదలైంది. ఇటీవల మంగళూరులో కీలక సన్నివేశాలను చిత్రీకరించగా, తారక్ కూడా షూట్‌లో పాల్గొన్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. తాజా సమాచారం ప్రకారం, తారక్ ‘దేవర 2’ ప్రాజెక్టును కూడా మొదలు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ దాదాపు పూర్తి అయినట్టు సమాచారం.
దర్శకుడు కొరటాల శివ, మొదటి పార్ట్ కంటే మరింత శక్తివంతమైన కథను సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. మార్చి 2026 నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందని అంటున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సైఫ్ అలీఖాన్ విలన్‌గా కనిపిస్తారు. సంగీత దర్శకుడిగా అనిరుధ్ బాధ్యతలు తీసుకుంటున్నారు. ఇలా వరుస సినిమాలతో ఎన్టీఆర్ ఫుల్ జోష్‌లో ఉన్నారు.