5000 కిమీ భూమిని చైనాకు అమ్మేసిన పాకిస్తాన్ షాకింగ్ నిజాలు (Shaksgam)
ఒక దేశం తనది కాని భూమిని… అదీ మన దేశానికి చెందిన భూమిని… ఇంకొక దేశానికి గిఫ్ట్ గా ఇస్తుందా ? ఇది వినడానికే అసంబద్ధంగా, అన్యాయంగా ఉంది కదూ? కానీ ఇదే జరిగింది. కొన్ని దశాబ్దాల క్రితం మనకు తెలియకుండా మన దేశానికి చెందిన దాదాపు 5,180 చదరపు కిలోమీటర్ల అత్యంత కీలకమైన భూభాగాన్ని పాకిస్తాన్, చైనాకు రహస్యంగా ధారాదత్తం చేసింది. ఆ ద్రోహం ఇప్పుడు మన దేశ భద్రతకే పెను సవాలుగా మారింది. ఇంతకీ ఏంటా భూభాగం అంటే… దాని పేరే షక్స్‌గామ్ (Shaksgam) లోయ.
భారతదేశానికి తెలియకుండా… మన దేశానికి చెందిన 5,180 చదరపు కిలోమీటర్ల భూమిని పాకిస్తాన్ రహస్యంగా చైనాకు ఎప్పుడు, ఎందుకు అప్పగించింది? అసలు ఈ కుట్ర వెనుక ఉన్న అసలు రహస్యమేంటి? ఈ ఒక్క ఒప్పందమే ఈనాడు చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్‌కు ఎలా వెన్నెముకగా మారింది? ఈ అక్రమ బదిలీపై భారత్ ఎంత తీవ్రంగా స్పందించిందో…ఈ రోజు వివరంగా తెలుసుకుందాం. ఈ నిజాలు ప్రతి భారతీయుడూ తెలుసుకోవాలి.
అసలు ఏంటి ఈ షక్స్‌గామ్ (Shaksgam) లోయ? దాని ప్రాముఖ్యత ఏంటి? (What & Where)
మ్యాప్‌లో చూస్తే, షక్స్‌గామ్ లోయ లేదా ట్రాన్స్-కారకోరం ట్రాక్ట్ అనేది పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని గిల్గిట్-బల్టిస్తాన్ ప్రాంతంలో ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన, కఠినమైన ప్రదేశాల్లో ఒకటి. దీనికి ఉత్తరాన చైనాలోని జిన్‌జియాంగ్ ప్రావిన్స్, పశ్చిమాన పాక్ ఆక్రమిత కాశ్మీర్, తూర్పున మనందరికీ తెలిసిన సియాచిన్ గ్లేసియర్ ఉన్నాయి. అంటే, ఇది భారత్, పాకిస్తాన్, చైనా మూడు దేశాల వ్యూహాత్మక కూడలిలో ఉంది. ప్రపంచంలోనే రెండో ఎత్తైన శిఖరం K2 కూడా ఈ ప్రాంతానికి దగ్గర్లో ఉంది. దీని ప్రాముఖ్యత కేవలం భౌగోళికమైనది కాదు, సైనికపరంగా అత్యంత కీలకమైనది.
సియాచిన్ గ్లేసియర్‌పై ఆధిపత్యం కోసం భారత్ ఎంత పోరాడుతోందో మనకు తెలుసు. ఆ సియాచిన్‌కు అతి దగ్గర్లో, ఉత్తరాన ఈ షక్స్‌గామ్ లోయ ఉండటం…. మన భద్రతకు అత్యంత సున్నితమైన విషయం. ఇక్కడి నుండి మన సియాచిన్ స్థావరాలను, లడఖ్‌లోని మన కదలికలను శత్రువులు ఈజీగా గమనించవచ్చు. అందుకే ఈ ప్రాంతంపై పట్టు సాధించడం చైనాకు చాలా అవసరం.
Shaksgamపై చారిత్రక ద్రోహం – 1963 ఒప్పందం (The Betrayal)
ఈ కథ 1947లో భారతదేశ విభజనతో మొదలవుతుంది. జమ్మూ కాశ్మీర్ మహారాజు మన దేశంలో విలీనమయ్యాక, మొత్తం జమ్మూ కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలు చట్టబద్ధంగా భారతదేశంలో అంతర్భాగమయ్యాయి. కానీ పాకిస్తాన్ దురాక్రమణకు పాల్పడి కొంత భాగాన్ని ఆక్రమించుకుంది, దాన్నే మనం పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) అని పిలుస్తాం.
ఈ PoK లో భాగమే షక్స్‌గామ్ లోయ.
అసలు ద్రోహం జరిగింది 1963 మార్చి 2న. ఆ రోజు పాకిస్తాన్, చైనాతో ఒక సరిహద్దు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, పాకిస్తాన్ తన అక్రమ ఆధీనంలో ఉన్న…. దాదాపు 5,180 చదరపు కిలోమీటర్ల షక్స్‌గామ్ లోయను చైనాకు అప్పగించింది. ఇది అంతర్జాతీయ చట్టాలను పూర్తిగా ఉల్లంఘించడమే. ఎందుకంటే, ఒక దేశం చట్టవిరుద్ధంగా ఆక్రమించుకున్న భూభాగాన్ని మరొక దేశానికి బదిలీ చేసే హక్కు దానికి లేదు. పాకిస్తాన్‌కు ఆ భూమిపై ఎలాంటి సార్వభౌమాధికారం లేదు. అయినప్పటికీ, భారత్‌తో ఉన్న శత్రుత్వం, చైనాతో స్నేహాన్ని పెంచుకోవాలనే దరిద్రపు ఆలోచనతో పాకిస్తాన్ ఈ ద్రోహానికి పాల్పడింది.
భారత్ ఈ ఒప్పందాన్ని మొదటి రోజు నుంచే తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇది చట్టవిరుద్ధం, చెల్లదు అని క్లారిటీ ఇచ్చింది. కానీ ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ఒప్పందం ద్వారా చైనా, పాకిస్తాన్ ప్రత్యక్షంగా….భూ సరిహద్దును పంచుకునే అవకాశం దొరికింది,
కుట్ర పర్యవసానం – CPEC (The Consequence)
1963లో జరిగిన ఆ అక్రమ ఒప్పందం…. అసలు పర్యవసానాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC). వేల కోట్ల డాలర్ల పెట్టుబడితో చైనా నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్టు, చైనాలోని జిన్‌జియాంగ్‌ను పాకిస్తాన్‌లోని గ్వాదర్ పోర్టుతో కలుపుతుంది. అయితే, ఈ కారిడార్ వెళ్లే మార్గం ఎక్కడిదో తెలుసా?
పాకిస్తాన్ చట్టవిరుద్ధంగా ఆక్రమించుకున్న మన భూభాగం నుంచే. మరింత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, ఈ CPEC ప్రాజెక్టులో భాగంగా, చైనా ఇప్పుడు షక్స్‌గామ్ లోయలో భారీ ఎత్తున నిర్మాణ పనులు చేపడుతోంది. మన సియాచిన్ స్థావరాలకు అతి దగ్గరలో, అన్ని కాలాల్లోనూ పనిచేసే రోడ్లను నిర్మిస్తోందని రిపోర్టులు చెబుతున్నాయి.
దీనివల్ల, చైనా తన సైన్యాన్ని, ఆయుధాలను స్పీడ్ గా …ఈ ప్రాంతానికి తరలించే అవకాశం ఏర్పడుతుంది. ఇది మన ఉత్తర సరిహద్దుల్లో భద్రతకు ఇబ్బందిగా మారుతుంది. అంటే, 1963లో పాకిస్తాన్ వేసిన దొంగ ముద్ర, ఇప్పుడు చైనాకు మన ఇంటి ముందు రోడ్డు వేసేందుకు లైసెన్స్‌గా మారింది.
Shaksgamపై భారత్ స్టాంగ్ రెస్పాన్స్ (India’s Strong Response)
ఈ పరిణామాలపై భారతదేశం స్పందించింది…. మన సార్వభౌమాధికారం విషయంలో ఏమాత్రం రాజీపడబోమని చెప్పింది. పాకిస్తాన్, చైనా కుదుర్చుకున్న 1963 ఒప్పందాన్ని భారత్ ఎప్పుడూ గుర్తించలేదు… అది పూర్తిగా చట్టవిరుద్ధం, చెల్లదని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అనేక సందర్భాల్లో చెప్పారు. షక్స్‌గామ్ (Shaksgam) లోయ భారతదేశ భూభాగమని, అక్కడ చైనా చేస్తున్న ఎలాంటి నిర్మాణాలను ఒప్పుకునేది లేదని చెప్పారు.. ఇదే విషయంపై భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది కూడా స్పందించారు. షక్స్‌గామ్ (Shaksgam) లోయకు సంబంధించి 1963లో జరిగిన ఒప్పందం చట్టవిరుద్ధమన్నారు. ఆ లోయలో జరుగుతున్న ఏ కార్యకలాపాలను ఆమోదించబోమని, CPEC అనేది రెండు దేశాలు కలిసి చేస్తున్న ఒక అక్రమ చర్యగా గుర్తిస్తామన్నారు ఆర్మీ చీఫ్. భారత్ స్పందన కేవలం మాటలకే పరిమితం కాలేదు. తన ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకునే హక్కు తమకు ఉందని, గ్రౌండ్ లెవల్లో వాస్తవాలు మారిస్తే సహించేది లేదని చైనాకు గట్టి మెస్సేజ్ ఇచ్చింది. 1962 నాటి భారత్‌కు, ఇప్పటి భారత్‌కు చాలా తేడా ఉందని, ఎలాంటి ప్రయత్నాన్ని అయినా తిప్పికొట్టే సామర్థ్యం మనకు ఉందని…లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కూడా హెచ్చరించారు.
ముగింపు
షక్స్‌గామ్ లోయ వివాదం కేవలం ఒక భూమి ముక్కకు సంబంధించినది కాదు. ఇది మన దేశ సార్వభౌమాధికారం, మన భద్రత ఇంకా మన ఆత్మగౌరవానికి సంబంధించినది. పాకిస్తాన్ ఆక్రమించి, చైనాకు అక్రమంగా గిఫ్ట్ ఇచ్చిన ఈ భూమి…చట్టబద్ధంగా, నైతికంగా భారత్ కి చెందింది. మన భూభాగాన్ని కాపాడుకోవడం కోసం….భారత ప్రభుత్వం దౌత్యపరంగా, సైనికపరంగా ప్రయత్నాలు చేస్తోంది. చైనా అండ్ పాకిస్తాన్ కలిసి మన సరిహద్దుల్లో సృష్టిస్తున్న ఈ సవాలును ఎదుర్కోవడానికి దేశమంతా ఒకే మాటపై నిలబడాల్సిన టైమ్ ఇది.
పాకిస్తాన్ మన భూమిని చైనాకు అప్పగించడం, అక్కడ చైనా నిర్మాణాలు చేపట్టడంపై మీ అభిప్రాయం ఏమిటి? ఈ చారిత్రక ద్రోహం గురించి ప్రతి భారతీయుడికి తెలియాలి. అందువల్ల కింద ఇచ్చిన వీడియోను మీ ఫ్రెండ్స్… కుటుంబ సభ్యులతో తప్పకుండా పంచుకోండి. ఇలాంటి మరిన్ని లోతైన విశ్లేషణల కోసం మన Telugu Journalist ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.
జై హింద్


