పాకిస్థాన్ ప్రధాని ఆరోపణలపై ఆగ్రహం
అంతర్జాతీయ వేదికగా ఐక్యరాజ్యసమితి (UN) సర్వప్రతినిధి సభలో భారత్‌ను దోషిగా నిలబెట్టేందుకు ప్రయత్నించిన పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. సింధూజలాల ఒప్పందం (Indus Waters Treaty) నిబంధనలను ఉల్లంఘించారని భారత్‌పై ఆరోపణలు చేసిన షెహబాజ్ షరీఫ్‌కు భారత దౌత్యవేత్త పేటల్ గహ్లోత్ గట్టి కౌంటర్ ఇచ్చారు. పాకిస్థాన్ ఆరోపణలు అసంబద్ధం, వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నాలు చేస్తోందని ఆమె మండిపడ్డారు. ఈ సంఘటనతో పేటల్ గహ్లోత్ పేరు మరోసారి అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఇంతకీ ఎవరీ పేటల్ గహ్లోత్?
పేటల్ గహ్లోత్ : భారతీయ రాయబారి
పేటల్ గహ్లోత్ మహారాష్ట్రలోని రాజ్‌పుత్ కుటుంబంలో పుట్టారు. ముంబైలోని ప్రతిష్ఠాత్మక సెయింట్ జేవియర్ కాలేజీ నుంచి పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ పొందారు. ఆ తర్వాత దిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజీ ఫర్ విమెన్‌లో పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశారు. 2015లో ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ (IFS)లో చేరి దౌత్యవేత్తగా తన కెరీర్‌ను ప్రారంభించారు. గత పదేళ్లలో ఆమె వివిధ హోదాల్లో అనేక కీలక బాధ్యతలు నిర్వర్తించారు. కేంద్ర విదేశాంగ శాఖలో యూరోపియన్ వెస్ట్ డివిజన్‌లో అండర్ సెక్రటరీగా పనిచేశారు. పారిస్, శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత దౌత్య కార్యాలయాల్లో సేవలందించారు. ప్రస్తుతం ఐక్యరాజ్యసమితిలో భారత మిషన్‌లో ఫస్ట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. అంతర్జాతీయ వేదికలపై భారత్ తరఫున సమర్థవంతంగా వాదించడంలో ఆమె టాలెంట్ చూపిస్తున్నారు. గతంలోనూ పాకిస్థాన్ ఆరోపణలను ఐరాసలో ఆమె గట్టిగా తిప్పికొట్టారు.
ఉగ్రవాద క్యాంపులు మూసేయండి : గెహ్లాట్
పేటల్ గహ్లోత్ యూఎన్‌లో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రసంగాన్ని నాటకీయాలుగా వర్ణించారు. పాకిస్థాన్ విదేశాంగ విధానమంతా ఉగ్రవాదం కేంద్రంగానే ఉందని ఆమె ఆరోపించారు. యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్‌లో పాక్ ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ను రక్షించడాన్ని ఉదాహరణగా చూపారు. ఆ సంస్థ పహల్గాం దాడిలో 26 మంది పర్యాటకులను చంపింది. ఆపరేషన్ సిందూర్‌లో పాక్ రన్‌వేలు ధ్వంసమైనట్లు, తమ జెట్‌లు కాదని స్పష్టం చేశారు. సింధూ జలాల ఒప్పందాన్ని పహల్గాం దాడికి ప్రతిచర్యగా సస్పెండ్ చేసినట్లు పేటల్ వివరించారు. భారత్ తో చర్చలకు ముందు పాక్ ఉగ్రవాద క్యాంపులను మూసివేయాలని, ఉగ్రవాదులను అప్పగించాలని డిమాండ్ చేశారు. భారత్-పాక్ సమస్యలు బైలాటరల్‌గా పరిష్కరించాలని, మూడో పక్షానికి స్థానం లేదంటూ పరోక్షంగా అమెరికాను కూడా హెచ్చరించారు. పాక్ ఉసామా బిన్ లాడెన్‌ను దాచిన చరిత్రను గుర్తుచేస్తూ, వాస్తవాలను నాటకీయాలతో దాచలేమని పేటల్ గెహ్లాట్ హెచ్చరించారు.

సంగీత ప్రియురాలు, గిటారిస్ట్
దౌత్య బాధ్యతలతో బిజీగా ఉన్నప్పటికీ, పేటల్ గహ్లోత్‌కు సంగీతం పట్ల అమితమైన ఆసక్తి ఉంది. ఖాళీ సమయాల్లో గిటార్ వాయిస్తూ, పాటలు పాడుతూ తన టాటెంట్ చూపిస్తుంటారు. ఆమె సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసిన ఇటాలియన్ పాట ‘బెల్లా సియావో’కు నెటిజన్లు ఫుల్లుగా రెస్పాండ్ అయ్యారు.
భవిష్యత్‌లోనూ భారత్ తరఫున బలమైన గళం
పేటల్ గహ్లోత్ లాంటి యువ దౌత్యవేత్తలు అంతర్జాతీయ వేదికలపై భారత్ ప్రతిష్ఠను మరింత పెంచుతున్నారు. విదేశాంగ వ్యవహారాల్లో ఆమె సమర్థత, సంగీతంలో ఆమె సృజనాత్మకత ఆమెను ప్రత్యేక వ్యక్తిగా నిలిపాయి. భవిష్యత్‌లోనూ ఆమె భారత్ తరఫున బలమైన గళంగా కొనసాగుతారనడంలో సందేహం లేదు.

Hey everyone! The Amazon Great Indian Festival is live and packed with amazing deals across electronics, fashion, home essentials, and more. If you’re planning to shop, consider using my affiliate links in the description below. It won’t cost you anything extra, but I’ll earn a small commission that helps support this channel/website. Thanks for the love!
🛍️ Recommended for You
Explore top picks in tech, lifestyle & home essentials. Every click supports https://teluguword.com/