ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందుకు కవిత ?

Latest Posts Trending Now

: త్వరలో నోటీసులు ఇచ్చే ఛాన్స్

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. రాష్ట్రంలో ఏడాదిగా ప్రకంపనలు రేపుతోన్న ఈ కేసులో సిట్‌ ఎంక్వైరీ స్పీడప్ అయింది. ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత పేరు కూడా బయటకు వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ పై విచారణ జరుపుతున్న సిట్ ముందుకెళ్లిన మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్‌… ఎమ్మెల్సీ కవిత పేరు ప్రస్తావించారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కవిత ఫోన్‌ మీద కూడా నిఘా పెట్టిందని ఆయన చెప్పారు. దీంతో ఇన్నాళ్లు వినిపించని కవిత పేరు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చింది. కవిత మాత్రం తన ఫోన్ ట్యాపింగ్‌ అయిందన్న ప్రచారంపై ఇప్పటి వరకూ నోరు విప్పలేదు. ఇప్పుడు ఒకవేళ సిట్ కవితను సాక్షిగా పిలిస్తే ఆమె వెళ్తారా? వెళితే ఏం చెబుతారన్నది రాజకీయవర్గాల్లో ఆసక్తిరేపుతోంది. కొన్నాళ్లుగా బీఆర్ఎస్‌ తో అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారు. ఆమె డాడీకి రాసిన లెటర్ బయటికి రావడం..ఆ తర్వాత చిట్‌ చాట్లు, ప్రెస్‌మీట్లు అంటూ కవిత చేసిన కామెంట్స్ తో గులాబీ బాస్ ఆగ్రహంగా ఉన్నారన్న టాక్ ఉంది. అందుకే కాళేశ్వరం విచారణ రోజు ఫాంహౌస్‌కు వెళ్లిన కవితతో మాట్లాడేందుకు కూడా కేసీఆర్ ఇష్టపడలేదంటున్నారు. అసలు కవిత బీఆర్ఎస్‌లో ఉన్నారా? లేరా?

అన్నట్లుగా ఉంది ఆమె ప్రజెంట్ సిచ్యువేషన్‌. ఇదే టైమ్‌లో బీఆర్ఎస్ హయాంలో కవిత ఫోన్ కూడా ట్యాప్ అయిందని గోనె ప్రకాశ్‌ బాంబ్‌ పేల్చారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై ముందు నుంచి సైలెంట్‌గా ఉంటున్నారు కవిత. మీ ఫోన్ కూడా ట్యాప్ అయ్యిందా అని మీడియా అడిగినా సమాధానం చెప్పలేదు. కనీసం తన ఫోన్ ట్యాపింగ్‌ వార్తలను కూడా ఖండించలేదు. అయితే బీఆర్ఎస్‌ పవర్‌లో ఉన్నప్పటి నుంచే కవిత రాజకీయంగా సొంతంగా ఎదిగే ప్రయత్నం చేశారనీ, అందుకే ఆమె ఫోన్ కూడా ట్యాప్ చేశారన్న ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజానిజాలేంటో తెలియదు గాని.

అదే నిజమైతే మాత్రం కవిత ఫోన్‌ను ట్యాప్ చేయాలని ఆదేశించింది ఎవరన్న దానిపైనే రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. తన ఫోన్ ట్యాప్ అయిందన్న సంగతి కవితకు తెలుసు కాబట్టే ఆమె ఖండించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. ఈ విషయంలో తాను ఏం మాట్లాడినా తన తండ్రి కేసీఆర్‌కు ఇబ్బందిగా మారుతుందనే కవిత సైలెంట్‌ ఉంటున్నారట. అయితే విచారణ జరుపుతున్న సిట్ అధికారులు బయటపెట్టే పేర్లలో కవిత నేమ్ ఉంటుందా అన్నది ఇంట్రెస్టింగ్‌గా మారింది. సిట్ ఆమెను కూడా పిలిచి స్టేట్‌మెంట్‌ రికార్డు చేయొచ్చన్న టాక్ వినిపిస్తోంది. అప్పుడు కవిత సిట్ ముందుకు వస్తారా? రారా అన్నది ఆసక్తి రేపుతోంది. సిట్ పిలిస్తే కవిత ఏం చెబుతారోనని అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్‌తో పాటు రాజకీయవర్గాల్లో ఆసక్తి కనిపిస్తోంది.

Also read: జూబ్లీ హిల్స్ ఉపఎన్నిక: పార్టీల్లో టెన్షన్

Also read: రెండో టెస్ట్‌లో ఎవరికి చోటు?

Also read: కవిత రైల్ రోకోకు బీఆర్ఎస్ సపోర్టు ఉందా ?

Also read: https://10tv.in/tag/kavitha-phone-tapping

Tagged

Leave a Reply