థాయిలాండ్, కంబోడియా అనే రెండు బౌద్ధ దేశాల మధ్య ఒక హిందూ దేవాలయం కోసం యుద్ధం జరుగుతోంది. ఈ ఘర్షణలో రాకెట్ లాంచర్లు, మిసైల్స్, ఎఫ్-16 యుద్ధ విమానాలతో దాడులు జరుగుతున్నాయి. ఈ ఉద్రిక్తతలకు కారణం ప్రిహ విహియర్ ఆలయం (Preah Vihear Temple), ఇది 11వ శతాబ్దపు నాటి శివాలయం, ఇది డాన్గ్రేక్ పర్వతాల మీద ఉంది. యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించారు.
ఈ ఆలయాన్ని ఖైమర్ సామ్రాజ్య రాజులు, సూర్యవర్మన్-1, సూర్యవర్మన్-2, 9వ, 11వ శతాబ్దాల్లో నిర్మించారు. ఆలయం భగవాన్ శివుడికి సంబంధించినది దాని అద్భుతమైన శిల్ప కళ ఆకర్షణీయంగా ఉంటుంది. మొదట హిందూ ఆలయంగా నిర్మించినా, తర్వాత ఆ ప్రాంతంలో హిందూ మతం క్షీణించాక బౌద్ధులు దీన్ని ఆక్రమించారు. 1962లో అంతర్జాతీయ న్యాయస్థానం ఈ ఆలయం కంబోడియాకు చెందినదని తీర్పు ఇచ్చింది, కానీ థాయిలాండ్ దాని చుట్టూ ఉన్న భూమిని పొందేందుకు పోరాడుతోంది.
వివాదం ఎలా మొదలైంది?
ఈ వివాదం 20వ శతాబ్దం ప్రారంభం నుంచి కొనసాగుతోంది. 1907లో ఫ్రెంచ్ కాలనీలు కంబోడియా-థాయిలాండ్ సరిహద్దులను గీసినప్పుడు, ప్రిహ విహియర్ ఆలయం కంబోడియాలో ఉందని చూపించారు. అయినా థాయిలాండ్ దీన్ని తన సూరిన్ ప్రావిన్స్‌లో ఉన్న భూమిగా చెబుతోంది. 2008లో కంబోడియా ఈ ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా నమోదు చేయించినప్పుడు, థాయిలాండ్ తీవ్రంగా వ్యతిరేకించింది కూడా. తర్వాత 2008 నుంచి 2011 వరకు ఘర్షణలు జరిగి, వందల మంది చనిపోయారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో, కంబోడియా సైనికులు ఆలయ ప్రాంతంలోకి వెళ్లి తమ జాతీయ గీతాన్ని పాడటంతో, థాయ్ బలగాలతో ఘర్షణ జరిగింది. ఏప్రిల్‌లో ఒక ఒప్పందం కుదిరినా, ఈమధ్య కాలంలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. గురువారం నాడు థాయిలాండ్, కంబోడియా సైన్యాలు రాకెట్లు, ఆర్టిలరీతో పోరాడుతున్నాయి. థాయిలాండ్ తన బోర్డర్ చెక్‌పోస్ట్‌లు మూసివేసి, కంబోడియా రాయబారిని బహిష్కరించింది. కంబోడియా కూడా తన దౌత్య సిబ్బందిని వెనక్కి పిలిచింది.
రెండు దేశాలకూ ఈ హిందూ ఆలయం జాతీయ సంపదగా మారింది. కంబోడియా ఖైమర్ సామ్రాజ్య చరిత్ర ఆధారంగా వాదిస్తోంది, థాయిలాండ్ భౌగోళిక ఆధారాలను చూపిస్తోంది. ఈ యుద్ధం ఆగాలంటే ద్వైపాక్షిక చర్చలు, అంతర్జాతీయ మధ్యవర్తిత్వం అవసరం అంటున్నారు విశ్లేషకులు.
Read also : ధర్మస్థలలో ఏ జరిగింది ? అంతు చిక్కని మిస్టరీ
Read also : వైసీపీది ఏ కూటమి ? తేల్చుకోలేకపోతున్నజగన్