Priyanka Gandhi : ప్రియాంక గాంధీ. ఈ పేరు చెప్పగానే మనకు ఠక్కున గుర్తొచ్చేది నెహ్రూ-గాంధీ కుటుంబ వారసురాలు అనే. కానీ, తెర వెనుక అంతకుమించి ఏదో జరుగుతోంది…. అవి కేవలం యాదృచ్ఛికంగా జరుగుతున్నాయా.. లేకపోతే ప్రధాని పదవి లక్ష్యంగా పక్కా ప్లానింగ్ తో వేస్తున్న అడుగులా?
ఒక నినాదం… పార్టీలో ఒక కొత్త పాత్ర…పార్లమెంటులో అనూహ్యమైన ఎంట్రీ…
ఇవన్నీ విడివిడిగా చూస్తే జనరల్ గా పాలిటిక్స్ లో ఉంటాయిలే అనిపించొచ్చు. కానీ వాటన్నిటినీ కలిపి చూస్తే, ఒక గ్రాండ్ డిజైన్ మన కళ్ళ ముందు కనిపిస్తోంది. ఈ రోజు ఈ వీడియోలో, ప్రియాంక గాంధీ ప్రస్థానం వెనుక దాగి ఉన్న ఆ పొలిటికల్ సీక్రేట్ గేమ్ గురించి డిటైల్డ్ గా మాట్లాడుకుందాం…
Priyanka Gandhi పునాది – “లడ్కీ హూన్, లడ్ శక్తి హూన్”
ప్రతి పెద్ద ప్రయాణం ఒకే ఒక్క అడుగుతో మొదలవుతుంది. ప్రియాంక పొలిటికల్ ప్లానింగ్ కూడా ఆ మొదటి,
బలమైన అడుగు 2022 ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో పడింది. అప్పుడు యూపీ కాంగ్రెస్ (Congress) ఇన్‌చార్జ్‌గా చేపట్టిన బాధ్యతలు చిన్నవేమీ కాదు.. ఒకప్పుడు వెలుగు వెలిగి… దేశంలోనే అధికారంలో చలయించడానికి ఉపయోగపడ్డ ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. కానీ అక్కడ ఆమె గెలుపు ఓటముల కన్నా ఒక దీర్ఘకాలిక లక్ష్యంపై దృష్టి పెట్టారు.
అక్కడే పుట్టింది “లడ్కీ హూన్, లడ్ శక్తి హూన్” (నేను అమ్మాయిని, పోరాడగలను) అనే నినాదం. ఇది కేవలం యూపీ మహిళల ఓట్ల కోసం వేసిన ఎత్తుగడ కాదు. జాతీయ స్థాయిలో ప్రియాంక గాంధీకి (Priyanka Gandhi)…. తన ఓన్ బ్రాండ్‌ను క్రియేట్ చేసుకోడానికి ఉద్దేశించింది. నెహ్రూ-గాంధీ కుటుంబం అనే ట్యాగ్‌తో పాటు… మహిళా సాధికారతకు, హక్కుల కోసం పోరాడే యోధురాలిగా నిలబెట్టే ప్రయత్నం అక్కడే మొదలైంది. నిజమే కానీ… యూపీలో ఎన్నికల ఫలితాలు ఘోరంగా వచ్చాయి, పార్టీ కేవలం రెండు సీట్లకే పరిమితమైంది. చాలామంది దీన్ని ప్రియాంక ఫెయిల్యూర్‌గా కొట్టిపారేశారు. కానీ రాజకీయ చదరంగంలో, ఒక్కోసారి ఓటమే…. అతిపెద్ద విక్టరీకి ఫౌండేషన్ వేస్తుంది. ఆ ఎన్నికల ఫలితం ఎలా ఉన్నా, ప్రియాంక తనకంటూ ఒక జాతీయ స్థాయి గుర్తింపును, ఒక సైద్ధాంతిక వైఖరిని మాత్రం బలంగా నిర్మించుకోగలిగారు.

Priyanka Gandhi ఆర్గనైజర్ అవతారం – తెరవెనుక చక్రం
ఒక నినాదం మాత్రమే ఒకరిని ప్రధానిని చేయదు కదా? ఇక్కడే కథ మరో ఆసక్తికరమైన మలుపు తీసుకుంది.
యూపీ ఎన్నికల తర్వాత ప్రియాంకను పక్కనపెట్టేశారని చాలామంది అనుకున్నారు. కానీ జరిగింది దానికి పూర్తి రివర్స్. కాంగ్రెస్ ఆమెను రాష్ట్ర స్థాయి బాధ్యతల నుంచి తప్పించి, జాతీయ స్థాయి సంస్థాగత వ్యవహారాల్లోకి తీసుకువచ్చింది. ఇదొక వ్యూహాత్మక అడుగు. దానికి తాజా ఉదాహరణే, 2026లో జరగబోయే…. అస్సాం అసెంబ్లీ ఎన్నికల కోసం ఆమెను పార్టీ స్క్రీనింగ్ కమిటీ చైర్‌పర్సన్‌గా నియమించడం. ఇది ఆమెకు అప్పగించిన చాలా కీలకమైన జాతీయ స్థాయి బాధ్యత. స్క్రీనింగ్ కమిటీ అంటే ఏంటి? ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలి, ఏ వర్గాలను ఎలా బ్యాలెన్స్ చేయాలి, గెలుపు గుర్రాలను ఎలా గుర్తించాలి… ఇలాంటి అత్యంత క్లిష్టమైన నిర్ణయాలు తీసుకునేది ఈ కమిటీనే. బీజేపీ బలంగా ఉన్న అస్సాం లాంటి రాష్ట్రంలో… ఈ బాధ్యతను ప్రియాంకకు అప్పగించడం వెనుక చాలా అర్థం ఉంది. పార్టీ ఆమెను కేవలం ఒక “స్టార్ క్యాంపెయినర్”గా కాకుండా, ఒక “నేషనల్ లెవల్ ఆర్గనైజర్”గా, ట్రబుల్ షూటర్‌గా ప్రొజెక్ట్ చేయాలని చూస్తోంది. ఇది ప్రియాంకను కేవలం ఒక రాష్ట్ర ఇన్‌చార్జ్ స్థాయి నుంచి “ఆల్-ఇండియా ఆపరేటర్”గా అప్‌గ్రేడ్ చేసే ప్రక్రియలో ఒక ముఖ్యమైన అడుగు అనుకోవాలి…
మాస్టర్‌స్ట్రోక్ – వయనాడ్ ఎంపీగా Priyanka Gandhi పార్లమెంటరీ ఎంట్రీ
ఓ వైపు పార్టీపై పట్టు, మరోవైపు ప్రజల్లో గుర్తింపు… అంతా బాగానే ఉంది. కానీ, అసలైన పవర్ ఎక్కడుంటుంది? పార్లమెంటులో. ఇక్కడే ప్రియాంక ప్లాన్‌లో అత్యంత కీలకమైన ఘట్టం. 2024 ఎన్నికల్లో రాహుల్ గాంధీ రెండు చోట్ల (రాయ్‌బరేలీ, వయనాడ్) గెలిచినప్పుడు, ఆయన వయనాడ్ సీటు వదులుకున్నారు. ఆ స్థానం నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేసి, తన పార్లమెంటరీ పాలిటిక్స్ ను మొదలుపెట్టారు….
ఇది యాదృచ్ఛికం కాదు, పక్కా పొలిటికల్ స్ట్రాటజీ. దీని ద్వారా ప్రియాంకకు ఒక “సేఫ్ ఎలక్టోరల్ హోమ్” దొరికింది, అదీ కాంగ్రెస్ బలంగా ఉన్న దక్షిణ భారతదేశంలో. వయనాడ్ ఉపఎన్నికలో ఆమె దాదాపు 4 లక్షలకు పైగా ఓట్ల భారీ మెజారిటీతో గెలవడం, ఆమె ఎన్నికల గెలుపు సామర్థ్యాన్ని నిరూపించింది. ఈ గెలుపుతో, ఆమె కేవలం పార్టీ కార్యదర్శి కాదు, ప్రజలచే ఎన్నుకోబడిన పార్లమెంట్ సభ్యురాలు అయ్యారు. ఇక్కడ మరో వ్యూహం కూడా ఉంది. ఇప్పుడు పార్లమెంటులో రాహుల్ గాంధీ…. ఉత్తర భారతదేశంలోని రాయ్‌బరేలీ నుంచి, ప్రియాంక గాంధీ దక్షిణ భారతదేశంలోని వయనాడ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీనివల్ల గాంధీ కుటుంబానికి ఇప్పుడు నార్త్, సౌత్… రెండు ప్రాంతాల్లోనూ బలమైన పట్టు దొరికినట్టయింది. భవిష్యత్తులో జాతీయ నాయకత్వం కోసం… ఇది వారికి పాన్-ఇండియా అప్పీల్‌ను ఇస్తుంది.
గ్రాండ్ డిజైన్ – అన్నీ కలిపి చూస్తే?
ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ కలిపి చూద్దాం. ఒక ప్రచారం, ఒక సంస్థాగత పాత్ర, ఒక పార్లమెంటరీ స్థానం…
ఇవి విడివిడి ఘటనలుగా కాకుండా, ఒక చెస్ బోర్డులో ఎత్తులుగా కనిపిస్తున్నాయి.
- మొదటి ఎత్తు: “లడ్కీ హూన్” నినాదంతో ప్రియాంక … మహిళా పక్షపాతిగా సొంత బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు…
- రెండో ఎత్తు: అస్సాం లాంటి బాధ్యతలతో పార్టీలో ఒక సమర్థురాలైన ఆర్గనైజర్‌గా తనను తాను నిరూపించుకుంటున్నారు.
- మూడో ఎత్తు: వయనాడ్ గెలుపుతో పార్లమెంటరీ legitimacy సంపాదించారు.
ఇప్పుడు ఆమె ప్రభుత్వ విధానాలపై నేరుగా పార్లమెంటులో గళం విప్పుతున్నారు.
ఈ మూడు దశలను కలిపి చూస్తే…
ప్రియాంక గాంధీని నెమ్మదిగా, వ్యూహాత్మకంగా జాతీయ నాయకత్వానికి, ఫైనల్ గా ప్రధాని అభ్యర్థిత్వానికి సిద్ధం చేస్తున్నారనే వాదనకు బలం చేకూరుతోంది. ఇది అధికారికంగా ప్రకటించకపోయినా, కాంగ్రెస్‌లోనే ఆ వాదన పెరుగుతోంది. కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ లాంటి వారు “ప్రియాంకను ప్రధానిని చేసి చూడండి” అని బహిరంగంగా వ్యాఖ్యానించడం, దానికి ఆమె భర్త రాబర్ట్ వాద్రా కూడా రెస్పాండ్ అవడం… ప్రియాంక ప్రధాని కావాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా ఉందని చెప్పడం ఈ ఊహాగానాలు నిజం అనిపిస్తున్నాయి. రాహుల్ గాంధీ పార్టీని నడిపిస్తే… ప్రియాంక గాంధీ తన వాగ్ధాటితో, చరిష్మాతో “విన్నింగ్ కాంబినేషన్”గా ఎదుగుతున్నారని విశ్లేషకులు అంటున్నారు.
Priyanka Gandhiకి ముందున్న సవాళ్లు
అయితే ఈ దారంతా పూలబాట కాదు కదా? బీజేపీ “కుటుంబ రాజకీయాలు” అనే అస్త్రాన్ని ప్రియాంకపై బలంగా ప్రయోగిస్తుంది. పార్లమెంటులో ఆమె పనితీరు మీద ఆ పార్టీ ఓ కన్నేసి ఉంది. ప్రియాంక స్పీచెస్… ఆమె లేవనెత్తే అంశాలు ఆమె పొలిటికల్ గా ఎంత ఎదుగుతోంది అన్న సంగతిని తేలుస్తాయి. ఈ వ్యూహాలన్నీ 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జరుగుతున్నాయా? లేక భవిష్యత్ రాజకీయాల కోసం ఆమెను తీర్చిదిద్దుతున్నారా? అనేది చూడాలి. కానీ ఒకటి మాత్రం స్పష్టం. ప్రియాంక గాంధీ ఇప్పుడు కేవలం గాంధీ కుటుంబ సభ్యురాలు కాదు. ఆమె ఒక పూర్తిస్థాయి రాజకీయ నాయకురాలు. ఒక పక్కా ప్లానింగ్ తో… ఒక్కో అడుగూ వేస్తూ, భారత రాజకీయాల్లో ప్రధాని పదవి వైపు ఆమె ప్రయాణం సాగుతున్నట్టు కనిపిస్తోంది.
ముగింపు
సో, చూశారుగా… ప్రియాంక ప్రయాణం యాదృచ్ఛికంగా సాగుతున్నట్టు లేదు. ‘లడ్కీ హూన్’ నినాదం దగ్గర మొదలుపెట్టి, పార్టీలో ఆర్గనైజర్‌గా ఎదుగుతూ, ఇప్పుడు పార్లమెంటులో అడుగుపెట్టడం వరకు… ప్రతి అడుగు వెనుక ఒక ఆలోచన, ఒక వ్యూహం ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రియాంక గాంధీ యొక్క ఈ వ్యూహం 2029 నాటికి ఫలిస్తుందని మీరు అనుకుంటున్నారా? రాహుల్, ప్రియాంక ఇద్దరూ కలిసి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తేగలరా? ప్రియాంకలో ఒక ప్రధాని అభ్యర్థికి ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయని మీరు నమ్ముతున్నారా? మీ అభిప్రాయాలను కింద కామెంట్స్‌లో మాతో పంచుకోండి.
ఇలాంటి మరిన్ని రాజకీయ విశ్లేషణల కోసం…. మా తెలుగు జర్నలిస్ట్ ఛానెల్‌కు సబ్‌స్క్రయిబ్ చేసుకోండి.
థ్యాంక్యూ… జై హింద్…
(విష్ణుకుమార్ మేడుకొండూరు, సీనియర్ జర్నలిస్ట్ )


