రష్మిక-విజయ్ జంట: వందల కోట్ల సంపదతో కొత్త చాప్టర్!
Rashmika-Vijay Devarakonda : ఈ మధ్య తెలుగు సినిమా వర్గాల్లో, సోషల్ మీడియాలో ఒకే మాట. “రష్మిక-విజయ్ పెళ్లితో ఒక్కటవ్వబోతున్నారు. ఇద్దరు కూడా ఏళ్ల తరబడి డేటింగ్‌లో ఉండి, ఇప్పుడు అధికారికంగా నిశ్చితార్థం చేసుకున్నారుని కూడా వార్తలు వస్తున్నాయి. కొద్ది మంది సినీ ప్రముఖులు, ఫ్రెండ్స్ ని మాత్రమే నిశ్చితార్థానికి పిలిచినట్టు సమాచారం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి జరగబోతుందని సమాచారం. దాంతో అభిమానుల దృష్టి “వారిద్దరి ఆస్తులు” మీదకు మళ్లింది. ఎందుకంటే ఇద్దరూ కూడా టాప్ స్టార్‌లు. అందుకే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న Assests Networth ఎంత?” అనే ప్రశ్న హాట్ టాపిక్‌గా మారింది.
రష్మిక మందన్న – స్టార్ హీరోయిన్ నుంచి Successful Business Women
రష్మిక మందన్న ఇప్పుడు కేవలం హీరోయిన్ కాదు. సినిమాల్లో నటించడమే కాదు, బ్రాండింగ్ & వ్యాపారాల్లో కూడా పెద్ద దుమ్ము రేపుతోంది. ప్రస్తుతం ఆమె నెట్‌వర్త్ ₹66 కోట్ల వరకు ఉందని అనేక మీడియా రిపోర్టులు చెబుతున్నాయి.

రష్మిక Remuneration ఎంత ?
- సినిమా రెమ్యూనరేషన్: “పుష్ప 2”కు ₹10 కోట్లు తీసుకున్నట్లు రిపోర్ట్స్. “సికందర్”లో సల్మాన్‌తో జోడీగా నటించడానికి ₹13 కోట్లు తీసుకుందనే వార్తలు కూడా ఉన్నాయి.
- బ్రాండింగ్ ఆదాయం: సినిమాల కంటే ఎక్కువగా బ్రాండింగ్ ఒప్పందాల (Branding Agreements) ద్వారానే Rashmika సంపాదన ఎక్కువగా వస్తోందట. ప్రస్తుతం 7 పెద్ద కార్పొరేట్ బ్రాండ్స్ ఆమె చేతిలో ఉన్నాయి.
- పెట్టుబడులు: ప్లమ్ (Plum) వంటి లైఫ్‌స్టైల్ కంపెనీల్లో పెట్టుబడులు పెడుతోంది.
- స్వంత బ్రాండ్: “Dear Diary” పేరిట పెర్ఫ్యూమ్ బ్రాండ్ కూడా ప్రారంభించింది.
- ఆస్తులు: బెంగళూరులో ₹8 కోట్ల విలువైన ఇల్లు, ఖరీదైన కార్లు, కుటుంబ వ్యాపారాల్లో వాటాలు ఉన్నాయి.
ఈ లెక్కలన్నీ మీడియా అంచనాలు అయినా, రష్మిక ఫైనాన్షియల్ స్థాయి బలంగా ఉందని మాత్రం అందరికీ స్పష్టంగా కనిపిస్తోంది.
Read also : షోయబ్ మాలిక్ ముచ్చటగా మూడోసారి విడాకులు
విజయ్ దేవరకొండ – స్టార్ హీరోగా, ఆంట్రప్రెన్యూర్‌గా
విజయ్ దేవరకొండ కూడా టాలీవుడ్‌లో టాప్ హీరో. ఆయన Rowdy Wear అనే స్వంత ఫ్యాషన్ బ్రాండ్ మింత్రాలో నడుపుతున్నాడు. అలాగే బ్రాండింగ్ ఒప్పందాలు కూడా చాలా ఉన్నాయి.
ప్రస్తుతం విజయ్ నెట్‌వర్త ₹70 కోట్ల పైగా ఉందని మీడియా రిపోర్టులు చెబుతున్నాయి.
- సినిమా రెమ్యూనరేషన్: ఒక్కో సినిమాకు సుమారు ₹15 కోట్లు తీసుకుంటాడని అంచనా.
- బ్రాండింగ్: ఒక్కో బ్రాండ్ అండార్స్‌మెంట్‌కు ₹1 కోటి రూపాయలు వసూలు చేస్తాడట.
- సోషల్ మీడియా ఆదాయం: Instagramలో అతనికి ఫుల్లుగా ఫాలోయింగ్ ఉంది. ఒక్కో పోస్ట్‌కు ₹40 లక్షల రూపాయలు వసూలు చేస్తాడట.
- ఆస్తులు: హైదరాబాదు జూబ్లీహిల్స్‌లో ₹15 కోట్ల విలువైన విల్లా ఉంది.
- వ్యాపారాలు: Rowdy Wear ద్వారా డిజైన్, ఫ్యాషన్ రంగంలో అడుగుపెట్టాడు.
ఈ ఆస్తులు చూస్తుంటే విజయ్ కూడా ఆర్థికంగా బలంగానే ఉన్నాడని స్పష్టమవుతోంది.
రష్మిక – విజయ్ Networth ఎంత ?
రష్మిక (₹66 కోట్ల అంచనా) + విజయ్ (₹70 కోట్ల అంచనా)
= ₹150 కోట్ల దాకా Joint Networth
అంటే, ఈ జంటకు సినిమాల ద్వారా మాత్రమే కాకుండా బ్రాండింగ్, వ్యాపారాలు, పెట్టుబడుల ద్వారా కూడా వందల కోట్ల ఆదాయం ఉంది. ఇది వారికి “సెలబ్రిటీ కపుల్” ఇమేజ్‌ను మరింత బలపరిచింది.
కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం –
ఇవన్నీ మీడియా అంచనాలు మాత్రమే.
అధికారిక ఆర్థిక డాక్యుమెంట్‌లు బయటకు రావడం లేదు.
కాబట్టి ఈ సంఖ్యలు మారవచ్చు.

నిశ్చితార్థం – అధికారికంగా ధృవీకరించారా ?
విజయ్ టీమ్ కొంతవరకు ఈ వార్తలను ధృవీకరించినట్లు Times of India లో కథనం వచ్చింది.
ఫిబ్రవరిలో పెళ్లి ఉంటుందని కూడా చెబుతున్నారు.
అయితే, ఈ జంట తమ పెళ్లి గురించి అధికారికంగా ధృవీకరించలేదు. అందువల్ల అభిమానులు, మీడియా ఊహాగానాల్లోనే ఈ వార్తలు నడుస్తున్నాయి.
ఆస్తులు & లైఫ్‌స్టైల్ – హైలైట్స్
- రష్మిక బెంగళూరు విల్లా – ₹8 కోట్లు
- విజయ్ జూబ్లీహిల్స్ విల్లా – ₹15 కోట్లు
- రష్మిక పెట్టుబడులు – ప్లమ్ & Dear Diary
- విజయ్ బ్రాండ్ – Rowdy Wear
- ఇద్దరికీ లగ్జరీ కార్లు, హైఎండ్ లైఫ్‌స్టైల్
ఇవన్నీ కలిపి ఈ జంటను “Top 5 Rich Celebrity Couples” లిస్ట్‌లో చేర్చేలా చేశాయి.



