కాస్కో పాకిస్తాన్ ! S-500 వస్తోంది !

Latest Posts Trending Now

మొన్నటి ఇండో పాకిస్తాన్ మధ్య జరిగిన చిన్నపాటి యుద్ధం.. ఆపరేషన్ సిందూర్ తో పాకిస్తాన్ గజ గజలాడిపోయింది.. పాకిస్తాన్ నుంచి వచ్చే చిన్న చిన్న డ్రోన్ల నుంచి పెద్ద మిస్సైల్స్ దాకా అన్నింటినీ భారత్ తిప్పికొట్టింది.. ఆ క్రెడిట్ అంతా మన దగ్గరున్న ట్రయంఫ్ S400 దే.. అయితే S400 కి మించి.. దాని బాబులాంటి S500 ను రష్యా ఇప్పుడు ఇండియాకి సప్లయ్ చేయబోతోంది.. ఈ వార్త విన్నప్పటి నుంచి భారతీయుల్లో సంతోషం ఉప్పొంగుతోంది..

RUSSIA SUCCESSFULLY TESTED S-500 MISSILE SYSTEM - Chanakya Mandal Online

S400 కంటే ఎక్కువ సామర్థ్యంతో S 500 ఎయిర్ డిఫెన్స్ కంట్రోల్ సిస్టమ్ ను రష్యా తయారు చేసింది. ఈ వ్యవస్థతో శత్రు దేశాల అస్త్ర శస్త్రాలను ధ్వంసం చేయడమే కాదు.. అంతరిక్షంలోని టార్గెట్స్ ను కూడా ధ్వంసం చేసే సామర్థ్యం ఉందట. భూ వాతావరణంలో వచ్చే దాదాపు అన్ని రకాల టార్గెట్స్ ను గుర్తించి నాశనం చేసే సామర్థ్యం S500 కు ఉందని రష్యా అధికారులు చెబుతున్నారు. ఇది పూర్తిగా ఫుల్లీ ఆటోమేటెడ్ సిస్టమ్ అట. ఒక్కసారి సిస్టమ్ ను ఆన్ చేస్తే చాలు.. మన సరిహద్దుల అవతల నుంచి ఏది వచ్చినా వెంటనే కూల్చేస్తుంది. ఫైటర్ జెట్స్, క్రూయిజ్ మిసైల్స్, హైపర్ సానిక్ మిసైల్స్, శత్రు దేశాల నిఘా శాటిలైట్స్ ను కూడా S500 ధ్వంసం చేస్తుంది. భూ ఉపరితలం నుంచి 200 కిలోమీటర్ల పైన ఉన్న టార్గెట్ ను నాశనం చేయగలిగే సామర్థ్యం S500 కు ఉంది. 600 కిలోమీటర్ల పరిధిలోని శత్రు దేశ మిసైళ్ళ దగ్గర నుంచి విమానాల దాకా ఏవీ కూడా S500 ధాటికి తట్టుకోలేవు. మాక్ 20 వేగంతో వస్తున్న 10 టార్గెట్స్‌ను ఒకే టైమ్ లో ధ్వంసం చేయగల సత్తా దీనికి ఉంది. S-500ను అల్మాజ్ ఆంటే అనే రష్యా సంస్థ డిజైన్ చేసింది. 2021లో దీన్ని రష్యా అంతరిక్ష భద్రతా దళంలో దీన్ని ఇప్పటికే ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించిన తొలి రెజిమెంట్ కూడా అందుబాటులోకి వచ్చింది.
ఇక్కడ ఇంకో విషయం మనం చెప్పుకోవాలి..

Russia's S-500 Air Defense System Reportedly Hits Target Nearly 300 Miles Away

ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ కి ప్రపంచంలోనే మంచి పేరుంది.. పవర్ ఫుల్ అని చెప్పుకునేవారు.. ఇది ఒకప్పటి మాట.. హమాస్ దాడుల తర్వాత దాని సక్సెస్ రేటు 80శాతానికి పడిపోయింది.. హమాస్ మిస్సైల్స్, డ్రోన్లను ఈ ఐరన్ డోమ్ అడ్డుకోలేకపోయింది.. అమెరికా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా పెద్దగా సామర్థ్యం లేనివే ఉన్నాయి. కానీ రష్యా తయారు చేసిన S400 మాత్రం.. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ లో నంబర్ 1గా నిలిచింది.. అందులో డౌటే లేదు. అయితే S500 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను మన భారత్ కు సప్లయ్ చేస్తామని ఇప్పటికే రష్యా ఆఫర్ ఇచ్చిందట. మొన్నటి పాకిస్తాన్ తో యుద్ధం తర్వాత. ఇది కొనాల్సిన అవసరం కూడా భారత్ కి ఉంది. అయితే మనం ఇప్పటికే S400 ని ఆర్డర్ చేశాం. అవి సప్లయ్ పూర్తయ్యాక.. S500 కొంటారా ? లేదంటే.. S400 కి బదులు S500 సప్లయ్ చేయమని రష్యాను భారత్ అడుగుతుందా అన్నది చూడాలి. ఇంకో ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే.. రష్యా S550 ని కూడా డెవలప్ చేసిందట. దాన్ని ఇండియా కొనుగోలు చేసి.. దానికి మన ఆకాశ్ మిసైల్ సిస్టమ్ ను యాడ్ చేస్తే.. మన ఎయిర్ బేస్ ఫుల్లు సేఫ్. S500 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గానీ ఇండియాలోకి అందుబాటులోకి వస్తే మన దేశానికి సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్, రాజస్థాన్, ఈశాన్య రాష్ట్రాలు, లద్దాఖ్ అరుణాచల్ ప్రదేశ్‌లతో పాటు తీర ప్రాంతాలై ముంబై, చెన్నై, వైజాగ్‌ నగరాల్లో మోహరించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. పాకిస్తానే కాదు.. చైనా.. ఇంకా వాళ్ళ తాతల దాడులను కూడా తిప్పి కొట్ట వచ్చని అంటున్నారు. ఎందుకంటే.. చైనా దిపావళి టపాసులను కొనుక్కొని పాకిస్తాన్ ఎంత నష్టపోయిందో.. మొన్నటి ఆపరేషన్ సిందూర్ తో తెలిసొచ్చింది..

READ ALSO  ICICI బ్యాంక్ వీర బాదుడు - ₹50,000 మినిమమ్ బ్యాలెన్స్

Better than the S-500: China to shoot down bombers from 2000 km away

ఈ సందర్భంగా అమెరికా గురించి మరో చిన్న విషయం చెప్పుకోవాలి..
కార్గిల్ యుద్ధం టైమ్ లో.. మనం అమెరికాను శాటిలైట్ సాయం చేయాలని అడిగాం.. కానీ దుర్మార్గం.. అమెరికా సాయం చేయలేదు.. ఎప్పుడూ తమ వస్తువులు అమ్ముకోవడం మీదే ధ్యాస.. నిన్నటికి నిన్న ట్రంప్ ప్రకటన చూస్తే అదే అర్థమవుతుంది.. ఇండియా పాకిస్తాన్ మధ్య కాల్పులను మేమే ఆపించాం.. ఆ రెండు దేశాలతో బిజినెస్ బాగా చేస్తామని ట్రంప్ చెప్పాడు.. శవాల మీద చిల్లర ఏరుకునే మనస్తత్వం అంటే ఇదేనేమో.. కానీ ఇజ్రాయెల్, రష్యా మనకు ఎప్పటికీ ట్రూ ఫ్రెండ్స్. ఆపరేషన్ సిందూర్ మొదలు పెట్టగానే.. ఇజ్రాయెల్ సాయానికి ముందుకు వచ్చింది.. రష్యా కూడా తోడుగా ఉంటుందని ప్రధాని మోడీకి కాల్ చేసి పుతిన్ చెప్పారు. ఏదేమైనా S500… S550 ఇండియాకి వస్తే మాత్రం.. పాకిస్తాన్ తో పాటు చైనాకి కూడా బ్యాండ్ బాజా తప్పదనిపిస్తోంది.

Tagged