గత కొంతకాలంగా సమంత-రాజ్ నిడిమోరు జంట హాట్ టాపిక్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ మధ్య రాజ్‌తో సమంత క్లోజ్ గా కనిపించడం.. తిరుమల, శ్రీకాళహస్తి ఆలయాలకు కలసి వెళ్లడంతో వీళ్ల మధ్య ఏదో ఉందనే టాక్ వినిపిస్తోంది. అలాగే సమంత నిర్మాతగా వచ్చిన ఫస్ట్ మూవీ ‘శుభం’ సక్సెస్ సెలబ్రేషన్‌లోనూ ఇద్దరూ కలిసి హాజరవడం చూసి ఇద్దరి మధ్య స్ట్రాంగ్ రిలేషన్ ఏర్పడిందనే పుకార్లు జోరందుకున్నాయి. ఈమధ్య రివీల్ అయిన ఓ ఫోటోలో .. సమంత భుజంపై రాజ్ చేయి వేసి నడవగా, మరో ఫొటోలో ఇద్దరు పక్కపక్కన కూర్చొని చాలా హ్యాపీ మూడ్‌లో కనిపించారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కట్ చేస్తే ఈ జంట ఇప్పుడు ఒకే కారులో కనిపించి మళ్లీ అందరి దృష్టిలో పడ్డారు. ఇక, ఇది చూసిన తర్వాత కొందరు నెటిజన్లు త్వరలోనే వారి రెండో పెళ్లి అంటూ కామెంట్ చేస్తున్నారు. దీంతో మళ్లీ ఈ జంటపై రూమర్స్ హల్‌చల్ చేస్తున్నాయి.
ఇలాంటి మంచి ఆర్టికల్స్ అందిస్తున్న TELUGU WORD టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
తెలుగు వర్డ్ Telegram Link : CLICK HERE FOR TELEGRAM LINK
Read also : అది చూసి నా ఫ్యామిలీ బాధపడింది: విజయ్ సేతుపతి
Read also : నైసార్ ఉపగ్రహం సక్సెస్