గెలాక్సీ బుక్ 4 ఎడ్జ్ ల్యాప్ టాప్ ను శామ్ సంగ్ లాంఛ్ చేసింది. భారత్ లో దీన్ని అందుబాటులోకి తెచ్చింది. క్వాల్ కామ్ ఎంట్రీ లెవల్ స్నాప్ డ్రాగన్ ఎక్స్ మొబైల్ ప్రాసెసర్, 16 జీబీ ర్యామ్ డిఫాల్ట్ గా ఇందులో ఉంటాయి. గెలాక్సీ బుక్ 4 ఎడ్జ్ ప్రస్తుతం శామ్ సంగ్ పోర్ట్ ఫోలియోలో మోస్ట్ ఆఫర్డబుల్ ల్యాప్‌టాప్. ధర విషయానికొస్తే 64 వేల 990 రూపాయలు చెల్లించి గెలాక్సీ బుక్ 4 ఎడ్జ్ ను సొంతం చేసుకోవచ్చు.
గెలాక్సీ బుక్ 4 ఎడ్జ్ ఫీచర్లు:
ప్రీమియం డిజైన్, 15.6 ఇంచ్ యాంటీగ్లేర్ డిస్ ప్లే, వైఫై-7, 27 గంటల లాంగ్ బ్యాటరీ బ్యాకప్, కేవలం 1.5 కేజీ బరువు, ఆర్కిటిక్ బ్లూ కలర్. వీటితో పాటు క్వాల్ కామ్ 8 కోర్ స్నాప్ డ్రాగన్ ఎక్స్ ఏఆర్ఎం బేస్డ్ చిప్, 3.0 గిగా హెర్ట్జ్ క్లాక్ స్పీడ్, విండోస్ 11 సాఫ్ట్ వేర్, మెక్రో ఎస్డీ కార్డ్ రీడర్, 1080పీ వెబ్ క్యామ్, ఫింగర్ ప్రింట్ రీడర్ వంటి స్పెసిఫికేషన్లు కూడా ఉన్నాయి.
ఆఫర్ లో భాగంగా ఎంపిక చేసిన కొన్ని బ్యాంకుల కార్డులను ఉపయోగించి రూ. 5 వేల క్యాష్ బ్యాక్ పొందొచ్చు. అంటే గెలాక్సీ బుక్ 4 ఎడ్జ్ ను 59 వేల 990 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు. శామ్ సంగ్ అఫిషియల్ వెబ్ సైట్ తో పాటు ఫ్లిప్ కార్ట్, శామ్ సంగ్ షాప్ యాప్, శామ్ సంగ్ ఎక్స్ పీరియన్స్ స్టోర్లలో ఇది అందుబాటులో ఉంది.
ఇలాంటి మంచి ఆర్టికల్స్ అందిస్తున్న TELUGU WORD టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
తెలుగు వర్డ్ Telegram Link : CLICK HERE FOR TELEGRAM LINK
SAMSUNG GALAXY BOOK 4 EDGE BUY WITH THIS LINK https://inr.deals/tG08ib
SAMSUNG GALAXY BOOK 4 BUY WITH THIS LINK : https://amzn.to/4l4rcdq