12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితా సవరణ ప్రారంభం
2025 నవంబర్ 4న మంగళవారం నుంచి ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా (ECI) 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ( SIR 2.0 ) ప్రక్రియను ప్రారంభించనుంది. ఈ ప్రక్రియలో సుమారు 51 కోట్ల మంది ఓటర్ల వివరాలు పరిశీలిస్తారు.
ఏయే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అంటే !
తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, పుదుచ్చేరి, అండమాన్ & నికోబార్ దీవులు, లక్షద్వీప్.
SIR 2.0 ముఖ్యమైన తేదీలు
- ఇంటింటి సర్వే: నవంబర్ 4 – డిసెంబర్ 4, 2025
- డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదల: డిసెంబర్ 9, 2025
- అభ్యర్థనలు, అభ్యంతరాల సమర్పణ: డిసెంబర్ 9 – జనవరి 8, 2026
- విచారణలు, ధృవీకరణలు: డిసెంబర్ 9 – జనవరి 31, 2026
- తుది ఓటర్ల జాబితా విడుదల: ఫిబ్రవరి 7, 2026
SIR 2.0 లో కొత్త మార్పులు
- ఇంటింటి సర్వే సమయంలో ఓటర్ల నుంచి ఎలాంటి పత్రాలు తీసుకోరాదు.
- ఆధార్‌ను గుర్తింపు పత్రంగా మాత్రమే ఉపయోగించాలి, పౌరసత్వానికి కాదు.
- ఓటరు అందుబాటులో లేకపోతే, తల్లిదండ్రులు లేదా బంధువు సంతకం చేయవచ్చు.
- BLO (బూత్ స్థాయి అధికారి) కనీసం 30 ఫారం 6లను తీసుకెళ్తారు, కొత్త ఓటర్ల నమోదు కోసం.
- గత SIR (2002–2004) ఆధారంగా ప్రీ-మ్యాపింగ్ పూర్తయింది.
మీ పేరు జాబితాలో ఉందా? ఎలా తెలుసుకోవాలి ?
- మీ గ్రామ పంచాయతీ ఆఫీస్, మున్సిపల్ ఆఫీస్ లేదా బ్లాక్ డెవలప్ మెంట్ ఆఫీసర్ ( BLO) ఆఫీసులో బూత్ వారీగా జాబితాలు ప్రదర్శిస్తారు.
- డ్రాఫ్ట్ జాబితాలో పేరు లేకపోతే, కారణం (మరణం, డూప్లికేషన్ మొదలైనవి) కూడా చూపబడుతుంది.
- మీ పేరు జాబితాలో లేకపోతే, డిసెంబర్ 9 నుంచి జనవరి 8 మధ్య అభ్యర్థన సమర్పించవచ్చు.
- ఆన్ లైన్ లో Election Commission of India వెబ్ సైట్ లో కూడా చెక్ చేసుకోవచ్చు
🆕 కొత్త ఓటర్ల నమోదు ఎలా?
- 2026 జనవరి 1 నాటికి 18 యేళ్ళు పూర్తి చేసుకునే వారు
- కొత్తగా స్థిరపడిన వారు లేదా వలస వచ్చిన వారు
- పేరు తొలగించబడిన వారు
మీ BLOని సంప్రదించి ఫారం 6 మరియు డిక్లరేషన్ ఫారం తీసుకోండి. ఓటరు నమోదు కోసం అప్లయ్ చేయండి.
READ ALSO | ఆధార్ అప్డేట్ 2025: ఇక క్యూలైన్లు అవసరం లేదు, PAN తో లింక్ తప్పనిసరి!



