పాకిస్తాన్ కి రాజ్ నాథ్ వార్నింగ్
for English Article : CLICK HERE
ఆపరేషన్ సింధూర్ ద్వారా గట్టి షాక్ ఇచ్చినా… పాకిస్తాన్ బుద్ధి మాత్రం మారడం లేదు. బోర్డర్ దగ్గర రెచ్చగొట్టే చర్యలకు దిగుతూనే ఉంది… లేటెస్ట్ గా సర్ క్రీక్ సరిహద్దుల దగ్గర పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడింది…
దీనిపై రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు…. ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా పాక్ బుద్ధి మార్చుకోలేదు….మాతో పెట్టుకుంటే వరల్డ్ మ్యాప్ లో మిగలకుండా పోతావ్ అంటూ గట్టి వార్నింగే ఇచ్చారు రాజ్ నాథ్ సింగ్.
అసలు సర్ క్రీక్ దగ్గర ఏం జరుగుతోంది ?
ఇక్కడ వివాదం ఏంటి ? అన్నది ఈ ఆర్టికల్ లో చూద్దాం.
సర్ క్రీక్ ఏరియాలో ఆక్రమణలకు పాల్పడితే… భారత్ నుంచి చావు దెబ్బలు తినాల్సి వస్తుందని, అది చరిత్ర, భౌగోళిక స్థితిని కూడా మార్చేస్తుందని రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ హెచ్చరించారు. గుజరాత్‌లోని భుజ్ బోర్డర్ దగ్గర సైనిక స్థావరంలో సైనికులతో కలిసి దసరా వేడుకలు జరుపుకున్నారు. ఇందులో భాగంగా రాజ్ నాథ్ ఆయుధ పూజ కూడా నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్ తో మన సత్తా చాటాం. 1965 యుద్ధంలో భారత సైన్యం మేం లాహోర్‌కు చేరుకోగలం అని నిరూపించింది… ఇప్పుడు కరాచీకి క్రీక్ లైన్ నుంచి వెళ్ళే ఛాన్సుందని పాకిస్తాన్ గుర్తుంచుకోవాలని రాజ్ నాథ్ హెచ్చరించారు.

అసలు Sir Creek అంటే ఏమిటి?
Sir Creek అనేది 96 కిలోమీటర్ల పొడవైన ఒక జలప్రాంతం, ఇది గుజరాత్ అండ్ సింధ్ (పాకిస్థాన్) మధ్య ఉంది. ఇది అరేబియా సముద్రంలో కలుస్తుంది. జనసంచారం లేని మట్టితో నిండిన ప్రాంతం అయినా వ్యూహాత్మకంగా, ఆర్థికంగా రెండు దేశాలకు కూడా చాలా కీలకం.
సర్ క్రీక్ పై వివాదం ఎలా మొదలైంది?
1947లో భారత విభజన తర్వాత, గుజరాత్ భారత్ ఉండిపోయింది, సింధ్ పాకిస్థాన్‌లోకి వెళ్లింది. 1914లో బ్రిటిష్ టైమ్ లో డిసైడ్ చేసిన ప్రకారం…. పాకిస్థాన్ ఈ ప్రాంతమంతా మాదే అంటోంది. భారత్ మాత్రం థాల్వేగ్ సిద్ధాంతం ప్రకారం, నదిలో నడిచే మార్గం మధ్యలోనే సరిహద్దు ఉండాలని వాదిస్తోంది.
భారత్ 1925 మ్యాప్ అండ్ మధ్యలో ఉన్న స్తంభాలను ఆధారంగా చూపుతోంది. పాకిస్థాన్ మాత్రం Sir Creek నది కాదు, కాబట్టి థాల్వేగ్ వర్తించదని అంటోంది. ఈ వివాదం వల్ల రెండు దేశాల మధ్య సముద్ర సరిహద్దులు,
Exclusive Economic Zones (EEZs) నిర్ణయించడంలో సమస్యలు వస్తున్నాయి.
యూట్యూబ్ లో సాంకేతిక సమస్యలు : పెద్దవాళ్ళకి 18యేళ్ళ లోపు యూజర్ల స్టాంప్
ఆర్థిక ప్రాధాన్యత
- Sir Creek ప్రాంతంలో ఆయిల్, గ్యాస్ నిక్షేపాలు భారీగా ఉన్నాయని భావిస్తున్నారు.
- మత్స్యకారులు తరచుగా సరిహద్దు దాటి పోతారు, దాంతో పాకిస్తాన్ అరెస్ట్ చేస్తోంది.
- పాకిస్థాన్ LBOD కాలువ ద్వారా ఉప్పు నీరు, పరిశ్రమల వ్యర్థాలను Sir Creek లోకి విడుదల చేస్తోంది, ఇది సింధూ జలాల ఒప్పందానికి విరుద్ధంగా ఉంది.
భారత వైఖరి ఏంటి ?
సర్ క్రీక్ వివాదంపై భారత్ చర్చల ద్వారా సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించింది. కానీ పాకిస్థాన్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ లేదు… ఆ ఏరియాలో సైనిక నిర్మాణాలు కూడా పెరుగుతున్నాయి. దాంతో ఇప్పుడు భారత్ గట్టి హెచ్చరికలు జారీ చేసింది. BSF అండ్ భారత సైన్యం అంతా కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉంది.
సర్ క్రీక్ కి సంబంధించి ఇంకా పూర్తి డిటైల్స్ … అంటే పాకిస్తాన్ ఉగ్రవాదులను ఇండియాకు సప్లయ్ చేసే మార్గం ఇదేనా ? ముంబై పేలుళ్ళకు టెర్రరిస్టులు బోర్డర్ దాటింది ఇక్కడి నుంచేనా లాంటి డిటైల్స్
మరో ఆర్టికల్ లో చూడండి.



