రీల్స్ తో పిల్లల్లో తగ్గుతున్న Memory Power !
Social Media Reels Danger : మీ పిల్లలు సోషల్ మీడియాలో రీల్స్ చూస్తూ ఎక్కు టైమ్ గడిపేస్తున్నారా? అబ్బా, ఎంత ఫన్‌గా ఉంది అని మురిసిపోతున్నారా? కానీ జాగ్రత్త! ఈ social media addiction వల్ల పిల్లల జ్ఞాపకశక్తి తగ్గుతోంది అని లేటెస్ట్ స్టడీస్ చెబుతున్నాయి. ముఖ్యంగా reels effects on kids గురించి మాట్లాడుకుంటే, memory loss సమస్యను తెస్తుంది. ఒక గంట సోషల్ మీడియాలో గడిపిన పిల్లలు, రీడింగ్, మెమరీ టెస్టుల్లో తక్కువ స్కోరు చేస్తున్నారు అని రుజువైంది. ఇప్పుడు ఈ సమస్యల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
అమెరికాలో లేటెస్ట్ స్టడీ
అమెరికన్ మెడికల్ అసోసియేషన్ (JAMA Pediatrics) చేసిన తాజా స్టడీలో, 9 నుంచి 13 ఏళ్ల పిల్లలపై సోషల్ మీడియా impact on brain development గురించి పరిశోధించారు. ఇందులో, కనీసం ఒక గంట సోషల్ మీడియా యూస్ చేసే పిల్లలు, అసలు ఉపయోగించని వాళ్లతో పోలిస్తే రీడింగ్, మెమరీ, లాంగ్వేజ్ టెస్టుల్లో 1 నుంచి 2 పాయింట్లు తక్కువ మార్కులు తెచ్చుకుంటున్నారు. ఇది చిన్న విషయమే అనుకోకండి, ఎందుకంటే ఈ వయసులో పిల్లల మెదడు అభివృద్ధి చాలా కీలకం. సోషల్ మీడియాలోని రకరకాల కంటెంట్, ముఖ్యంగా షార్ట్ వీడియోలు లాంటి రీల్స్, వాళ్ల దృష్టిని మారుస్తూ డీప్ కాన్సంట్రేషన్‌ను భంగం చేస్తాయి.
ఇంకా చెప్పాలంటే, social media impact on children’s cognitive development వల్ల attention span తగ్గుతుంది. పిల్లలు ఒకే విషయంపై ఎక్కువ సేపు ఫోకస్ చేయలేకపోతున్నారు. దాంతో ఏకాగ్రత కోల్పోతున్నారు. ఇది చదువుల్లో మాత్రమే కాదు, మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపిస్తోంది. ఉదాహరణకు, ఎక్కువ స్క్రీన్ టైమ్ వల్ల స్లీప్ డిస్టర్బెన్స్, ఆంక్సైటీ లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు, దీర్ఘకాలంలో ఇది మానసిక రుగ్మతలకు కూడా దారితీయవచ్చు.
తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండండి
తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. పిల్లల సోషల్ మీడియా యూస్‌ను నియంత్రించండి. వీలైనంతగా పిల్లలు మొబైల్ వాడకుండా చూసుకోండి. లేదంటే రోజుకు ఇంత టైమ్ అని లిమిట్ పెట్టండి. మొబైల్ కి బదులుగా బుక్స్ చదవడం, ఆటలు ఆడటం, ఫ్యామిలీ తో టైమ్ గడపడం లాంటివి ఎంకరేజ్ చేయండి. ఇలా చేస్తే పిల్లల మెదడు ఆరోగ్యంగా అభివృద్ధి చెందుతుంది.
పిల్లల్లో తగ్గిపోతున్న క్రియేటివిటీ
ఇంకా, మరిన్ని స్టడీస్ లో తేలింది ఏంటంటే, పిల్లలు ఎక్కువ సోషల్ మీడియా ఉపయోగిస్తుంటే వాళ్ల క్రియేటివిటీ కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే రీల్స్ లాంటివి పాసివ్ కంటెంట్, అంటే చూడటమే కానీ సొంతంగా ఆలోచించడం లేదు. అందుకే Balanced digital habits పెంచుకోవాలి.
చివరగా, ఈ social media effects on children గురించి అవగాహన పెంచుకుందాం. మీ పిల్లల ఫ్యూచర్ కోసం ఇప్పుడే గట్టి నిర్ణయం తీసుకోండి… పిల్లలు మొబైల్స్ వాడకుండా, రీల్స్ చూడకుండా కట్టడి చేయండి.