తెలంగాణలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఎన్నికల నిర్వహణకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడమే ఆలస్యం అని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. జులై చివరి నాటికి లేదంటే ఆగస్టు ఫస్ట్ వీక్ లో స్థానిక సంస్థలు కొత్త పాలకమండలి చేతుల్లో వెళ్ళిపోతాయి. గ్రామాల్లో అప్పుడే ఎలక్షన్ ఫీవర్ మొదలయ్యింది. అయవతే రాష్ట్రంలో ఎంపీటీసీ స్థానాలు తగ్గబోతున్నాయని తెలుస్తోంది. మొత్తం 566 జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు ఎలక్షన్ నిర్వహించేందుకు పంచాయత్ రాజ్ శాఖ రెడీ అవుతోంది. ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్ల అమలు లాంటి అంశాలను కొలిక్కి తెచ్చే పనిలో బిజీగా ఉంది. దీంతో పాటే రాష్ట్రంలో ఎంపీటీసీల స్థానాల సంఖ్య కూడా ఫైనల్ అవుతుంది.
ఇప్పటిదాకా 5,817 ఎంపీటీసీ స్థానాలు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య తగ్గతుందని అధికారులు చెబుతున్నారు. ఈమధ్య కాలంలో రాష్ట్రంలో కొత్త మున్సిపాలిటీలు ఏర్పడటమే ఇందుక్కారణం. అంతేకాకుండా కార్పొరేషన్ల దగ్గర్లోని గ్రామాల విలీనం కూడా జరిగింది. మేడ్చల్ జిల్లా మొత్తాన్ని అర్బన్ ప్రాంతంగా మార్చారు. అలాగే ఔటర్ రింగ్ రోడ్డు లోపలి మండలాల్ని మున్సిపాలిటీలు చేశారు. దీంతో ఎంపీటీసీ సభ్యుల సంఖ్య తగ్గనుందని అధికారులు చెబుతున్నారు. 2019లో 32 జిల్లా పరిషత్ ఛైర్మన్లు, 539 జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. కానీ ఈ సారి మాత్రం 31 జిల్లా పరిషత్తులు, 566 జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. లేటెస్ట్ లెక్కల ప్రకారం రాష్ట్రంలో అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 33 జెడ్పీటీసీ స్థానాలు ఉంటాయి. ఆ తర్వాత స్థానంలో నిజామాబాద్ ఉంది.
ఇక్కడ 31 జెడ్పీటీసీ స్థానాలున్నాయి. ఆ తర్వాత సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో 26, కామారెడ్డిలో 25 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. అతి తక్కువ జెడ్పీటీసీ స్థానాలు మంత్రి సీతక్క సారధ్యం వహిస్తోన్న ములుగు జిల్లాలో ఉన్నాయి. ఇక్కడ 10 జెడ్పీటీసీ స్థానాలే ఉన్నాయి. అసలే మండల స్థాయిలో టిక్కెట్ల కోసం అన్ని పార్టీల నేతల్లో డిమాండ్ ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఎంపీటీసీ స్థానాలు తగ్గిపోవడంతో కొందరు లీడర్లు నిరాశగా ఉన్నారు.
Also read: కలెక్షన్లు కుమ్మేస్తున్న‘కుబేర’
Also read: ప్రియుడితో కలిసి తల్లినే చంపిన బాలిక
Also read: సమంత ‘రక్త్ బ్రహ్మాండ్’కు బ్రేక్