* వేతనాల పెంపు కోసం సమ్మె
* 8 రోజులైనా కొలిక్కిరాని చర్చలు
* పూట గడవక కార్మికుల ఇబ్బందులు
* చెరో సగం తగ్గించుకోండన్న మంత్రి కోమటిరెడ్డి
తెలుగు సినీ పరిశ్రమలో గత 8 రోజులుగా సమ్మె సైరన్ మోగుతోంది. జూనియర్ ఆర్టిస్టులు, డ్యాన్సర్లు, ఫైటర్లు, మేకప్ మెన్లు మొదలుకొని 24 క్రాఫ్ట్స్ కి చెందిన దాదాపు 24 వేల మంది కార్మికులు వేతనాలు 30 శాతం పెంచాలంటూ సమ్మె బాట పట్టారు. ప్రతి మూడేళ్ళకోసారి 30 శాతం వేతనాలు పెంచుతామని నిర్మాతలు హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకోవాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. 8 రోజులుగా షూటింగ్‌లు ఆగిపోవడంతో చాలా మంది కార్మికులు రోజు గడవడానికి అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. సినీ కార్మికులు ఆకలి దప్పులు తీర్చేవాళ్ళే కనిపించడం లేదు.
“రెక్కాడితేగాని డొక్కాడని” పరిస్థితి లేబర్ ది. సినిమా కార్మికులదీ ఇదే పరిస్థితి. వాళ్ళకి నెలకు 10 నుంచి 15 రోజులు మాత్రమే పని దొరుకుతుంది, ఆ వచ్చిన వేతనాలతోనే మిగతా రోజులు గడపాలి. జూనియర్ ఆర్టిస్టులకు ఒక్క రోజు షూటింగ్‌కు కన్వినియన్స్ రూపంలో రూ.100, షూటింగ్ పేమెంట్ కింద రూ.630 ఇస్తారు. క్లాస్ వేషాలకు రూ.900 ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ.600 మాత్రమే చేతికిచ్చి మోసం చేస్తున్నారు కొంతమంది ఏజెంట్లు. టీవీ సీరియల్స్‌లో అయితే రూ.700 మాత్రమే ఇస్తున్నారు. ఏజెంట్లు నిర్మాతల నుంచి రూ.900 వసూలు చేసి, యూనియన్‌కు రూ.650 చెల్లించి, మిగతా డబ్బు కట్ చేసుకుంటున్నారు. యూనియన్ నాయకులు కూడా ఒక్కో ఆర్టిస్ట్ నుంచి రూ.20 కట్ చేసుకొని, రూ.630 చేతులో పెడుతున్నారు. ఇలా అడుగడుగునా మోసాలు, దగాలు ఎదురవుతున్నాయి.
ప్రస్తుత ధరలు, ఖర్చుల మధ్య ఈ వేతనాలు అస్సలు సరిపోవడం లేదని సినీ కార్మికులు ఆవేదన చెందుతున్నారు. 30 ఏళ్ల అనుభవమున్న జూనియర్ ఆర్టిస్ట్ మాటల్లో చెప్పాలంటే…”రోజుకి రూ.740 ఇస్తున్నారు, కానీ పని చేసిన వెంటనే డబ్బులు రావు. ఎన్నో రోజుల తర్వాతే డబ్బు చేతికి వస్తుంది. తమ కుటుంబాలు, పిల్లల చదువులు, అద్దెలు ఎలా గడుపుతాం?” సమ్మె వల్ల ఎనిమిది రోజులుగా పని లేక, ఆకలి కేకలు వినిపిస్తున్నాయి.. కోట్లు సంపాదించే హీరోలు, డైరెక్టర్లు కూడా కార్మికుల కష్టాలపై స్పందించడం లేదు అంటున్నారు. నిర్మాతలు మూడు విడతలుగా వేతన పెంపు ప్రతిపాదించారు. కానీ కార్మికులు ఈ ప్రపోజల్ ను తిరస్కరించారు, ఏకకాలంలో 30 శాతం పెంచాలని పట్టుబడుతున్నారు. చర్చలు విఫలమయ్యాయి. సినీ ఇండస్ట్రీ స్తంభించింది. కార్మికులు ఆమరణ నిరాహార దీక్షలకు సిద్ధమవుతున్నారు.
ఈ సమ్మె పరిశ్రమలోని చిన్న చూపును బయటపెడుతోంది. కార్మికులు లేకుండా సినిమా సీన్లు సాగవు, కానీ వారి కష్టాలు ఎవరూ పట్టించుకోవట్లేదు పెద్దలు ఆలోచించి, త్వరగా పరిష్కారం చూడాలి, లేకుంటే ఈ కార్మికుల బతుకులు మరింత దుర్భరమవుతాయి.
ఇలాంటి మంచి ఆర్టికల్స్ అందిస్తున్న TELUGU WORD టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
తెలుగు వర్డ్ Telegram Link : CLICK HERE FOR TELEGRAM LINK
Read also : బంగారం ధరలకు రెక్కలు !
🛍️ Recommended for You
Explore top picks in tech, lifestyle & home essentials. Every click supports https://teluguword.com/