ట్రంప్-మోడీకి ఎక్కడ చెడింది?

Latest Posts NRI Times Top Stories

ట్రంప్-మోడీ మధ్య స్నేహం ఒకప్పుడు బాగానే ఉండేది. “హౌడీ మోడీ”, “నమస్తే ట్రంప్” అంటూ గట్టిగా ప్రచారం చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఏమైందో ఏంటో, సంబంధాలు కాస్త గాడి తప్పినట్టున్నాయి. ట్రంప్ భారత్‌పై 25 శాతం టారిఫ్‌లు విధిస్తున్నానని ప్రకటించాడు. వీళ్ళిద్దరికీ ఎక్కడ చెడింది ? ఇండియా అంటే ట్రంప్ ఎందుకు కోపం ?

ఒకప్పుడు ట్రంప్, మోడీని తన బెస్ట్ ఫ్రెండ్‌లా చూసేవాడు. భారత్‌-అమెరికా సంబంధాలు కూడా సూపర్‌గా ఉండేవి. కానీ ఇప్పుడు ట్రంప్ భారత్‌పై 25% టారిఫ్‌లు వేస్తున్నాడు. భారత్ తో గొడవకు మూడు పెద్ద కారణాలు ఉన్నాయి.

1. వాణిజ్య గొడవలు – టారిఫ్‌ల మోత:

ట్రంప్‌కి భారత్‌తో వాణిజ్య చర్చలు సరిగ్గా సెట్ కాలేదు. భారత్ అమెరికా వ్యవసాయ, డెయిరీ ఉత్పత్తులను తన మార్కెట్‌లోకి రానివ్వడం లేదని ట్రంప్ ఫీలయ్యాడు. అనేక రౌండ్ల చర్చలు జరిగినా రిజల్ట్ జీరో! భారత్ కఠినమైన టారిఫ్‌లు, వాణిజ్య అడ్డంకులు పెట్టడం వల్ల ట్రంప్‌కి కోపం వచ్చింది.
అందుకే “మీరు నా దేశ ఉత్పత్తులపై టారిఫ్స్ వేస్తారా? నేనూ మీపై 25% టారిఫ్‌లు వేస్తా!” అని ప్రకటించేశాడు. భారత్ కూడా తన జాతీయ ప్రయోజనాల కోసం కఠినంగా వ్యవహరిస్తోంది. కానీ ఈ గొడవలో ట్రంప్ ఆగ్రహం పీక్‌కి వెళ్లింది.

2. రష్యాతో భారత్ స్నేహం:

భారత్‌-రష్యా సంబంధాలు ట్రంప్‌కి ఏ మాత్రం నచ్చడం లేదు. రష్యా ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తుంటే, భారత్ రష్యా నుంచి చమురు, సైనిక ఉత్పత్తులు భారీగా కొంటోంది. 2024-25లో భారత్‌-రష్యా వాణిజ్యం 68.7 బిలియన్ డాలర్లకు చేరింది. భారత్ తన ముడి చమురులో 35-40% రష్యా నుంచే తెచ్చుకుంటోంది. ఇది ట్రంప్‌కి నచ్చలేదు. “మీరు మా శత్రువుతో డీల్ చేస్తారా?” అని కోపంతో భారత్‌ని “డెడ్ ఎకానమీ” అని కూడా అనేశాడు.

3. బ్రిక్స్ కూటమిపై ట్రంప్ వ్యతిరేకత:

ట్రంప్‌కి బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా) కూటమి అస్సలు నచ్చదు. ఈ దేశాలు అమెరికా డాలర్‌పై దాడి చేస్తున్నాయని, అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని ఆరోపిస్తున్నాడు. భారత్ ఈ కూటమిలో యాక్టివ్‌గా ఉండటం ట్రంప్‌కి ఇబ్బందిగా అనిపించింది. “మోడీ నా ఫ్రెండ్ అనుకున్నా, కానీ ఈ డబుల్ స్టాండర్ట్స్ ఏంటి ?” అని ఓపెన్‌గా చెప్పేశాడు.

మోడీ దౌత్యం ఫెయిల్ అయిందా ?

మోడీ ఈ సమస్యలను సాల్వ్ చేయడానికి బాగానే ట్రై చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా వెళ్లి ట్రంప్‌ని కలిశారు. కానీ ట్రంప్ మొండిగా “టారిఫ్‌లపై ఎవరికీ మినహాయింపు లేదు” అని తేల్చేశాడు. భారత్ కొన్ని సుంకాలు తగ్గించింది, అమెరికా నుంచి రక్షణ పరికరాలు కొంటామని చెప్పింది. కానీ ట్రంప్ ఏమీ లెక్కచేయలేదు.
వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ కూడా అమెరికా వెళ్లి చర్చలు జరిపారు. కానీ ఫలితం సున్నా. ట్రంప్ భారత్‌ని “డెడ్ ఎకానమీ” అనడం, అవసరమైతే పాకిస్థాన్ నుంచి కూడా చమురు కొంటారంటూ అవమానించడం జరిగాయి. అయినా మోడీ ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు…, దీన్ని ఎందుకు ఖండించడం లేదు. అని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఎందుకంటే… రష్యాతో స్నేహం చేస్తున్నందుక ట్రంప్… భారత్, చైనా కలిపి తిట్టారు. మా దేశ ప్రయోజనాలకు ప్రియారిటీ ఇస్తామని మన విదేశాంగ శాఖ ఓ ప్రకటన చేసింది…కానీ చైనా మాత్రం టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా సమాధానం చెప్పింది ట్రంప్ కి…మరి ఈ విషయంలో “మోడీ దౌత్యం ఫెయిల్” అయిందా… భారత్ – పాక్ యుద్ధం నేనే ఆపా అన్నప్పుడు కూడా గట్టిగా….ట్రంప్ ని నువ్వు ఆపలేదు అని గట్టిగా చెప్పలేకపోయాం…పార్లమెంట్ లో మోడీ ప్రకటన చేసినా… డైరెక్ట్ గా ట్రంప్ ని ఉద్దేశించి ఎందుకు అనడం లేదని రాహుల్, ప్రియాంక తదితర లీడర్లు ప్రశ్నించారు.

ఇప్పుడు ఏం జరుగుతుంది?

ట్రంప్ ఈ టారిఫ్‌లతో భారత్‌కి పెద్ద డ్యామేజ్ చేశాడని అమెరికా విశ్లేషకులు చెబుతున్నారు. భారత్‌-అమెరికా సంబంధాలు పూర్తిగా తెగిపోవు… కానీ ఇకపై భారత్ అమెరికాతో జాగ్రత్తగా డీల్ చేసే అవకాశం ఉంది. ఓ రకంగా ట్రంప్ ఈ వైఖరితో భారత్‌ని రెచ్చగొట్టాడు అనే అనుకోవాలి. కానీ మోడీ సైలెన్స్ వెనక ఏ స్ట్రాటజీ ఉందో ఇంకా క్లియర్ కాలేదు. ఈ గొడవ ఎటు వెళ్తుందో చూడాలి!

Read also : ఫోన్ ట్యాపింగ్ – లీగలా, ఇల్లీగలా?

Read also : గెలాక్సీ బుక్ 4 ఎడ్జ్ ను లాంఛ్ చేసిన శామ్ సంగ్

 

ఇలాంటి మంచి ఆర్టికల్స్ అందిస్తున్న TELUGU WORD టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

తెలుగు వర్డ్ Telegram Link : CLICK HERE FOR TELEGRAM LINK

 

Tagged

Leave a Reply