అమెరికా వద్దంటే మన టెకీల ఫ్యూచర్ ఏంటి ?

Latest Posts NRI Times Top Stories Trending Now

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 4డేస్ బ్యాక్ భారతీయుల మీద ఓ కామెంట్ చేశారు… AI సమ్మిట్‌లో భారతీయ టెక్ ఉద్యోగుల గురించి చేసిన కామెంట్స్ తో
అమెరికాలో ఉన్న భారతీయ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు ఆందోళన కలిగిస్తున్నాయి. “అమెరికన్ కంపెనీలు భారతీయులను నియమించడం మానేయాలి, స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి” అని ట్రంప్ చెప్పడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. ట్రంప్ కామెంట్స్ ఎందుకు చేశారు. ఒకవేళ ఆయన ఆదేశాలతో వాటిని ఇంప్టిమెంట్ చేస్తే…
ఎవరిపై ఎలాంటి ప్రభావం పడుతుంది. మన భారతీయులకు అమెరికా కలలు కల్లలు అవుతాయా…

ట్రంప్ ఆలోచన ఏంటి?

ట్రంప్ ఎప్పటిలాగే తన “అమెరికా ఫస్ట్” నినాదాన్ని ముందుకు తెస్తున్నారు. అమెరికాలో ఉద్యోగాలు అమెరికన్లకే దక్కాలని, ఇతర దేశాల నుంచి వచ్చే వలసదారుల వల్ల స్థానికుల అవకాశాలు తగ్గిపోతున్నాయని ఆయన భావిస్తున్నారు. H1B వీసాల ద్వారా అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయ టెకీలపై ఆయన దృష్టి పెట్టారు. ఈ వీసాల ద్వారా లక్షల మంది భారతీయులు అమెరికాలో ఐటీ రంగంలో పనిచేస్తున్నారు. గతంలోనూ ట్రంప్ H1B వీసాలపై కఠిన నిబంధనలు విధించారు. ఇప్పుడు మళ్లీ ఇలాంటి కామెంట్స్ చేయడం వెనుక రాజకీయ ఎత్తుగడ కూడా ఉందని అంటున్నారు.
రాబోయే ఎన్నికల్లో వలస వ్యతిరేక ఓట్లను ఆకర్షించేందుకు ఇదొక ప్రయత్నంగా చూస్తున్నారు.

అమెరికా ఐటీ రంగంలో భారతీయుల పాత్ర

అమెరికా ఐటీ రంగంలో భారతీయులు చాలా కీలకంగా ఉన్నారు. దాదాపు 40% ఐటీ ఉద్యోగులు భారతీయులే అని ఒక అంచనా. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్ లాంటి టెక్ దిగ్గజ కంపెనీల్లో భారతీయ ఇంజనీర్లు, సీఈఓలు ఉన్నారు. సుందర్ పిచై (గూగుల్), సత్య నాదెళ్ల (మైక్రోసాఫ్ట్) లాంటి వారు ఈ రంగంలో భారతీయుల సత్తాను చాటారు.
వీళ్ళ నైపుణ్యం, కఠిన శ్రమ, తక్కువ ఖర్చులో ఎక్కువ ఫలితాలు ఇవ్వడం వల్ల అమెరికన్ కంపెనీలు భారతీయులను ఎంపిక చేస్తున్నాయి. ఒకవేళ ట్రంప్ చెప్పినట్టు ఇండియన్స్ రిక్రూట్ మెంట్ ఆపేస్తే, దాని ప్రభావం అమెరికన్ కంపెనీలపైనే ఎక్కువగా పడుతుంది.

ఎవరికి నష్టం అన్నది ఓసారి చూద్దాం…

1. అమెరికన్ కంపెనీలకు

భారతీయ టెకీలు అమెరికన్ ఐటీ రంగంలో బ్యాక్ బోన్ లాంటివారు. వీరి నైపుణ్యం లేకపోతే, ప్రాజెక్టులు ఆలస్యం కావచ్చు, ఖర్చులు పెరగవచ్చు. భారతీయులు తక్కువ జీతంతో ఎక్కువ పని చేస్తారనే అపవాదు ఉన్నప్పటికీ, వారి సామర్థ్యం, కొత్త ఆలోచనలు ఈ రంగాన్ని ముందుకు నడిపిస్తున్నాయి.

2. ఆవిష్కరణలపై ప్రభావం

టెక్ రంగంలో ఆవిష్కరణలకు మల్టిపుల్ గా ఆలోచించే సామర్థ్యం కావాలి.. భారతీయ ఇంజనీర్లు విభిన్న ఆలోచనలతో ఈ రంగంలో కొత్త ఒరవడిని తీసుకొచ్చారు. వీరిని తొలగిస్తే, అమెరికా టెక్ రంగంలో ఆవిష్కరణల వేగం తగ్గిపోయే అవకాశం ఉంది.

3. భారతదేశానికి ప్రయోజనం?

ట్రంప్ వ్యాఖ్యలు ఒకవిధంగా భారతదేశానికి కలిసొచ్చే అవకాశం కూడా ఉంది. అమెరికాలో అవకాశాలు తగ్గితే, భారతీయ యువత ఇండియాలోని స్టార్టప్‌లు, ఐటీ కంపెనీల వైపు మొగ్గు చూపుతారు. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు ప్లస్ అవుతుంది. ఇప్పటికే భారత్‌లో టెక్ స్టార్టప్‌లు వేగంగా ఎదుగుతున్నాయి. ఈ పరిస్థితి దేశీయంగా స్టార్టప్స్ పెరగడానికి… మరిన్ని ఉద్యోగ అవకాశాలు కలగడానికి అవకాశం ఏర్పడుంది.

4. గ్లోబల్ ఐటీ రంగంపై ప్రభావం

భారతీయ టెకీలు ప్రపంచ ఐటీ రంగానికి పెద్ద ఎత్తున నైపుణ్యాలను అందిస్తున్నారు.వీళ్ళ సంఖ్య తగ్గితే, అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఐటీ ప్రాజెక్టుల స్పీడ్ తగ్గుతుంది… క్వాలిటీ నాణ్యత దెబ్బతినే అవకాశం ఉంది.

ఇది నిజంగా జరుగుతుందా?

ట్రంప్ వ్యాఖ్యలు రాజకీయ హడావిడిగా మిగిలిపోయే అవకాశాలే ఎక్కువ. ఎందుకంటే, అమెరికన్ కంపెనీలు ఉద్యోగులను జాతీయత ఆధారంగా కాకుండా, స్కిల్ బేస్డ్ ఆధారంగా ఎంపిక చేస్తాయి. భారతీయ టెకీలు తమ ప్రతిభతో అమెరికన్ ఐటీ రంగంలో తమ స్థానాన్ని సంపాదించుకున్నారు. అయినప్పటికీ… ఏమో ట్రంప్ మైండ్ లో ఏ పురుగు తొలుస్తుందో చెప్పలేం… ఇలాంటి కామెంట్స్ మాత్రం భారతీయ వలసదారుల్లో ఆందోళన కలిగిస్తాయి. H1B వీసా నిబంధనలు మరింత కఠినతరం అయితే, భారతీయ యువత ఇతర దేశాల వైపు లేదంటే స్వదేశంలోనే అవకాశాలు వెతకాల్సి రావచ్చు.

మన యువత సత్తా ఏంటి?

భారతీయ యువతలో ఉన్న నైపుణ్యం, శ్రమ, ఆలోచనా శక్తి ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. ఎవరైనా అడ్డుపడినా, మన యువత తమదైన రూట్ ను క్రియేట్ చేసుకునే సత్తా ఉంది. ట్రంప్ వ్యాఖ్యలు ఒక రాజకీయ ఎత్తుగడ కావచ్చు, కానీ అవి గ్లోబల్ ఐటీ రంగంపై, వలస పాలసీలపై ఎంత ప్రభావం చూపుతాయో చూడాలి. ఒకవేళ అమెరికా తలుపులు మూసుకుంటే, భారత్‌లోనే కొత్త తలుపులు తెరుచుకునే అవకాశం ఉంది. మన యువత ప్రతిభ, శక్తి ఎక్కడైనా గుర్తింపు ఉంటుంది… టోటల్ గా మన భారతీయులను కాదనుకుంటే.. నష్టపోయేది అమెరికానే అన్నది ట్రంప్ గుర్తించాలి…

ఇలాంటి మంచి ఆర్టికల్స్ అందిస్తున్న TELUGU WORD టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

తెలుగు వర్డ్ Telegram Link : CLICK HERE FOR TELEGRAM LINK

Read also : ఫోన్ ట్యాపింగ్ – లీగలా, ఇల్లీగలా?

Read also : నైసార్ ఉపగ్రహం సక్సెస్

 

Tagged

Leave a Reply