Site icon Telugu Word

ఎవరినీ బాధపెట్టే ఉద్దేశం లేదు: విజయ్ దేవరకొండ క్షమాపణ

టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తమిళ నటుడు సూర్య నటించిన ‘రెట్రో’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో, ఆయన “ట్రైబల్” అనే పదాన్ని ఉపయోగించారు. అయితే, ఈ వ్యాఖ్యలు గిరిజనులను అవమానించేలా ఉన్నాయంటూ బాపూనగర్‌ ట్రైబల్స్ లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కిషన్‌రాజ్ చౌహాన్ ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్ నగర్ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.

విజయ్ దేవరకొండపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరారు. ఆదివాసీ సంఘాలు కూడా విజయ్ వ్యాఖ్యలను తప్పుబట్టి, క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. దీంతో విజయ్ దేవరకొండ ఓ ప్రకటన రిలీజ్ చేశారు. “నాకు ఎవరినీ బాధపెట్టే ఉద్దేశం లేదు. ప్రత్యేకంగా షెడ్యూల్డ్ తెగల వారిని నేను గౌరవిస్తాను. వారు ఈ దేశ సమగ్రతలో భాగమని నమ్ముతాను. భారతీయులందరినీ నా సోదరులుగా భావిస్తాను. ఎవరినీ ఉద్దేశపూర్వకంగా విడదీయాలన్న ఆలోచన కూడా నాకు ఉండదు” అని విజయ్ వివరణలో తెలిపారు. “ట్రైబ్” అనే పదాన్ని నిఘంటువు, చారిత్రక సందర్భంలో వాడానని వివరిస్తూ, ఇది ఆధునిక భారతదేశంలోని షెడ్యూల్డ్ తెగల వర్గీకరణకు సంబంధించినది కాదని స్పష్టం చేశారు.

ఆంగ్ల నిఘంటువు ప్రకారం, “ట్రైబ్” అనేది ఒకే సంస్కృతి, భాష, సంప్రదాయాలున్న సామాజిక సమూహాన్ని సూచించే పదమని వివరించారు. తన మాటలు ఎవరికైనా బాధ కలించినట్టు అనిపిస్తే లేదా ఎవరినైనా బాధించితే, అందుకు తాను హృదయపూర్వకంగా క్షమాపణలు చెబుతున్నట్టు విజయ్ దేవరకొండ తెలిపారు. “శాంతి, ఐక్యత, అభివృద్ధి గురించి మాట్లాడటమే నా ధ్యేయం. నా వేదిక ఎప్పటికీ ప్రజలను విభజించడానికి కాదు, ఐక్యంగా నిలిపే ప్రయత్నానికే ఉపయోగపడాలి” అని విజయ్ దేవరకొండ తెలిపారు.

Read this also : ఎవరినీ బాధపెట్టే ఉద్దేశం లేదు: విజయ్ దేవరకొండ క్షమాపణ

Read this also : మూత్రపిండాల తో జాగ్రత్తలు. Kidneys care

Read this also : ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్: త్వరలో ‘స్పిరిట్’ షూటింగ్

Exit mobile version