అప్పుడప్పుడు కొందరు ఫిలిం సెలబ్రెటీలకు ఉన్న బయట ఇమేజ్‌కు భిన్నంగా కొన్ని ఆరోపణలు వస్తుంటాయి. వాటిని జనం నమ్మినా నమ్మకపోయినా .. ఆ ఆరోపణలు ఆ సెలబ్రిటీస్ ను డిస్టర్బ్ చేస్తాయి. ‘మీ టూ’ ఉద్యమం మొదలయ్యాక తమకు జరిగిన అన్యాయం గురించి ధైర్యంగా అమ్మాయిలు గళం విప్పడం మొదలైంది. కానీ దీన్ని తమకు అనుకూలంగా వాడుకుని కొందరి మీద బురదజల్లే వాళ్లూ తయారయ్యారు. అంటే ఇది కూడా మిస్ యూజ్ అవుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. శేఖర్ కమ్ముల లాంటి క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తి మీద కూడా శ్రీరెడ్డి ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. శేఖర్ తీవ్రంగా స్పందించేసరికి తర్వాత ఆమె సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు విజయ్ సేతుపతి మీద కూడా ఇలాగే రమ్య అనే మహిళ ఆరోపణలు చేయడం చర్చనీయాంశమైంది. తన స్నేహితురాలు సేతుపతి వల్ల ఇబ్బంది పడిందంటూ ఒక మహిళ సోషల్ మీడియా పోస్టు పెట్టి డెలీట్ చేయడం సంచలనం రేపింది.
కోలీవుడ్లో కాస్టింగ్ కౌచ్ బాగా ఎక్కువగా ఉందని.. దీని వల్ల తన స్నేహితురాలు ఇబ్బంది పడిందని.. విజయ్ సేతుపతి ఆమెను ఇబ్బంది పెట్టాడని.. దీంతో తన ఫ్రెండు డిప్రెషన్‌కు గురైందని రమ్య అనే మహిళ పోస్ట్ పెట్టింది. ఐతే ఈ పోస్టు మీద సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వచ్చేసరికి దాన్ని ఆమె డెలీట్ చేసింది. ఈ నేపథ్యంలో సేతుపతి సైతం దీనిపి స్పందించాడు. తనను ఎన్నో ఏళ్లుగా చూస్తున్న వాళ్లంతా ఆమె ఆరోపణలు చూసి నవ్వుకున్నారని.. తనేంటో తనకు, చుట్టూ ఉన్న వాళ్లకు తెలుసని సేతుపతి ఈ ఆరోపణల్ని తిప్పికొట్టాడు. ఇలాంటి తప్పుడు ఆరోపణలు తనను బాధ పెట్టలేవని.. కానీ తన కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రం బాధ పడ్డారని చెప్పాడు. ఆమె ఫేమస్ కావడం కోసమే ఇలా చేస్తోందని.. కొన్ని నిమిషాల పాటు తను హైలైట్ అవుతుందని.. తనను ఎంజాయ్ చేయనివ్వాలని వాళ్లందరికీ చెప్పానని సేతుపతి తెలిపాడు. తన మీద పోస్టు పెట్టిన మహిళ మీద సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేసినట్లు కూడా వెల్లడించాడు. తన పోస్ట్ వివాదాస్పదమయ్యేసరికి.. ఏదో కోపంలోనే అలా పోస్ట్ చేశానని.. అదంత వైరల్ అవుతుందని అనుకోలేదని రమ్య తర్వాత మరో పోస్టులో వివరణ ఇచ్చింది.
ఇలాంటి మంచి ఆర్టికల్స్ అందిస్తున్న TELUGU WORD టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
తెలుగు వర్డ్ Telegram Link : CLICK HERE FOR TELEGRAM LINK
Read also : మాలేగావ్ కేసులో ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ నిర్దోషి
Read also : ఫోన్ ట్యాపింగ్ – లీగలా, ఇల్లీగలా?