ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల “వొకల్ ఫర్ లోకల్” (Vocal for Local) అంటూ స్వదేశీ ఉత్పత్తులను వాడాలని పిలుపునిస్తున్నారు. అమెరికా, యూరప్ వంటి దేశాలు భారతీయ వస్తువులపై
భారీ టారిఫ్స్, దిగుమతులపై పరిమితులు పెడుతున్నాయి. ఇలాంటి సమయంలో మనం కూడా టిట్ ఫర్ టాట్ గా మన దేశ ఉత్పత్తిదారులను ఆదుకోవాలని, దేశీయ పరిశ్రమలకు మద్దతు ఇవ్వాలని ప్రధాని మోడీ చెబుతున్నారు. ఇదే పిలుపుని గతంలో RSS కూడా ఇచ్చింది… మనం ప్రతిరోజూ ఉదయం నుంచి రాత్రి వరకు నిజంగా ఏం వాడుతున్నాం? వాటిల్లో ఏవి దేశీయ ఉత్పత్తులు? ఏవి విదేశీ బ్రాండ్లు? ఒకసారి చూద్దాం…
మనం ఉదయం లేవగానే…
* టూత్ బ్రష్, టూత్ పేస్ట్: ఎక్కువగా కోల్గేట్ (అమెరికా), పేప్సోడెంట్ (యూకే), సెన్సొడైన్ (యూకే) లాంటి విదేశీ కంపెనీల వస్తువులే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి.
వీటికి స్వదేశీ ప్రత్యామ్నాయాలు: పతంజలి దంతకాంతి, డాబర్ రెడ్, విజ్డమ్ టూత్ బ్రష్ (భారతీయ బ్రాండ్) ఉన్నాయి.
* సబ్బు, ఫేస్ వాష్: లైఫ్‌బాయ్ (యూనిలీవర్ – యూకే/నెదర్లాండ్స్), పియర్స్, డవ్ …. ఇవన్నీ విదేశీ వస్తువులే…
* స్వదేశీ: గోధుమ (మెడిమిక్స్), చందన సబ్బు (మైసూర్ శాండల్), హమామ్ (ఇండియా), పతంజలి,
బ్రేక్‌ఫాస్ట్ టైంలో….
*టీ, కాఫీ పౌడర్లు : బ్రూక్‌బాండ్, నెస్కఫే (స్విట్జర్లాండ్) ఇవి విదేశీ వస్తువులు…
* స్వదేశీ: తాజ్ మహల్ టీ (టాటా), టాటా కాఫీ, సుఫీ టీ లాంటివి స్వదేశీలు వస్తువులు…
* బ్రెడ్, కార్న్‌ఫ్లేక్స్: *కెలాగ్స్ (అమెరికా) విదేశీ కంపెనీ… తప్పనిసరిగా మనం వాడటం మానేయాలి
*స్వదేశీ: బ్రిటానియా (భారతీయ కంపెనీ అయినా ఫారిన్ ఇన్వెస్టర్లు ఎక్కువగా ఉన్నారు), సూర్య, స్థానిక బేకరీలు.
[irp posts=”4229″ ]
ఆఫీస్ / స్కూల్ కి వెళ్ళే ముందు
* డ్రెస్‌లు: మార్కెట్లో నైక్, అడిడాస్, ప్యూమా, లేవీస్ లాంటి విదేశీ బ్రాండ్లు ఎక్కువగా వాడుతున్నాం.
* స్వదేశీ: రేమండ్, ఆల్లెన్ సోలీ (అదిత్య బిర్లా గ్రూప్), మంత్రా, రిలయన్స్ ట్రెండ్స్, పీటర్ ఇంగ్లాండ్.
* షూస్: అడిడాస్, నైక్, రీబాక్ విదేశీ వస్తువులు…
* స్వదేశీ: బాటా (భారతదేశంలో స్థిరపడి ఉంది), రిలయన్స్ ఫుట్‌ప్రింట్, లిబర్టీ, ప్యారగాన్ అనేవి మన దేశానికి చెందినవి…
మధ్యాహ్నం భోజనం టైమ్ లో…
* రైస్, పప్పులు, కూరగాయలు: చాలా వరకు స్వదేశీ రైతులు పండించినవే… కాబట్టి నో ప్రాబ్లెమ్.
* సాఫ్ట్ డ్రింక్స్: *కోకాకోలా, పెప్సీ లాంటివి అమెరికా కంపెనీలు… వీటిని వాడొద్దు…
* స్వదేశీ ప్రత్యామ్నాయాలు: క్యాంపా కోలా, బోవాంట్, పతంజలి జ్యూసులు, లోకల్ కూల్ డ్రింక్స్… వీటన్నింటికంటే మన కొబ్బరి నీళ్ళు ఇంకా శ్రేష్టం….
సాయంత్రం టైంలో…
* మొబైల్ ఫోన్లు: ఎక్కువగా యాపిల్ (అమెరికా), శాంసంగ్ (కొరియా), వన్‌ప్లస్, షియోమీ (చైనా) ఫోన్లు వాడుతున్నాం…
* స్వదేశీ ప్రయత్నం: మైక్రోమ్యాక్స్, లావా, కార్బన్ (కానీ వీటి మార్కెట్ షేర్ తగ్గింది). సో మొబైల్స్ విషయంలో మనం విదేశీ కంపెనీల మీద ఆధారపడక తప్పదు.
* బైక్స్, కార్లు: హోండా, సుజుకి, హ్యుందాయ్, టయోటా – విదేశీ వస్తువులు…
* స్వదేశీ: హీరో, బజాజ్, టాటా, మహీంద్రా మన స్వదేశీ బ్రాండ్స్
రాత్రి భోజనం & నిద్ర … ఇతర టైమ్స్ లో…
*వంటనూనెలు: సన్‌ఫ్లవర్, ఫార్చ్యూన్ అనేవి భారతీయ కంపెనీలు… ఈ బ్రాండ్స్ వాడటం బెటర్.
* చాక్లెట్స్, ఐస్‌క్రీమ్స్: క్యాడ్‌బరీ (యూకే/అమెరికా), నెస్లే కూడా విదేశీ కంపెనీయే
* స్వదేశీ: అమూల్ ఐస్‌క్రీమ్, డెయిరీ మిల్క్ కు ప్రత్యామ్నాయంగా స్థానిక చాక్లెట్స్ వాడుకోవచ్చు.
* బెడ్ షీట్స్: ఎక్కువగా భారతీయ టెక్స్‌టైల్ ఉత్పత్తులే. కానీ IKEA (స్వీడన్), హోమ్ సెంటర్ (దుబాయ్) లాంటి విదేశీ బ్రాండ్లు కూడా బాగా మార్కెట్లో అమ్ముతున్నారు.
మన దైనందిన జీవితంలో ఉదయం లేవగానే రాత్రి నిద్రపోయేవరకు ఎన్నో విదేశీ బ్రాండ్లను (Foreign Brands) మనం వాడుతున్నాం. అయితే అదే సమయంలో భారతీయ వస్తువులు కూడా ఉన్నాయి. వాటిని ఎంపిక చేసుకోవడం ద్వారా మన దేశీయ పరిశ్రమలను, రైతులను, చిన్నవ్యాపారులను ఆదుకోవచ్చు.
ఒకప్పుడు… RSS ఇచ్చిన “స్వదేశీ” పిలుపుని ఇప్పుడు ప్రధాని మోడీ ‘వొకల్ ఫర్ లోకల్, లోకల్ టు గ్లోబల్’ అన్న నినాదంతో మరో స్థాయికి తీసుకెళ్తున్నారు. ఇక మనం వినియోగదారులుగా మన ఖర్చుతో మన దేశ ఆర్థిక వ్యవస్థ బలపడేలా నిర్ణయాలు తీసుకోవాలి. మన ఉత్పత్తిదారులను ఆదుకోవాలి.
“వొకల్ ఫర్ లోకల్” (Vocal for Local)
Read Also : చిన్నకార్లపై 1లక్ష దాకా తగ్గింపు – GST బెనిఫిట్స్



