Youtube Down: 15th Oct, 2025 (బుధవారం) మధ్యాహ్నం సమయంలో అమెరికాలోని చాలా నగరాల్లో YouTube, YouTube Music, YouTube TV పనిచేయడం ఆగిపోయింది.
DownDetector అనే వెబ్సైట్ ప్రకారం, 2 లక్షల మందికి పైగా యూజర్లు YouTube పనిచేయడం లేదని ఫిర్యాదు చేశారు.
ఏ నగరాల్లో You Tube Down అయిందంటే ?
అమెరికాలో ఈ YouTube డౌన్ వల్ల న్యూయార్క్, లాస్ ఏంజిల్స్, చికాగో, ఫీనిక్స్, సియాటిల్, డెట్రాయిట్ లాంటి పెద్ద నగరాల్లో ఎక్కువగా ప్రభావం చూపింది. చాలామంది వీడియోలు ప్లే అవ్వడం లేదని, మ్యూజిక్ స్ట్రీమింగ్ ఆగిపోయిందని చెప్పారు.
YouTube Music, YouTube TV పనిచేయలేదు
YouTube Musicలో 4,800 మందికి పైగా, YouTube TVలో 2,300 మందికి పైగా యూజర్లు సమస్యలు ఎదుర్కొన్నారు. లైవ్ షోలు, ప్లేలిస్ట్‌లు, సేవ్ చేసిన కంటెంట్ కూడా ప్లే అవ్వలేదు.

సోషల్ మీడియాలో యూజర్ల స్పందన
చాలామంది X (Twitter) లో @TeamYouTube ను ట్యాగ్ చేసి ఫిర్యాదులు చేశారు. YouTube సపోర్ట్ టీమ్ ఇలా స్పందించింది:
“మీరు వీడియోలు చూడలేకపోతున్నారని మాకు తెలుసు. సమస్యను పరిశీలిస్తున్నాం.”
అయితే, సమస్య ఎందుకు వచ్చిందో మాత్రం You tube నుంచి ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.
DDOS అటాక్ అయిందా? లేక సర్వర్ లో బగ్ ఉందా?
కొంతమంది DDOS attack అయిందని అనుమానిస్తున్నారు. మరికొంతమంది Google servers లో బగ్ ఉండొచ్చని సోషల్ మీడియాలో అంటున్నారు. కానీ YouTube అధికారికంగా ఏమీ చెప్పలేదు.
ఇంకా YouTube పనిచేయకపోతే ఏం చేయాలి?
YouTube Music లో డౌన్లోడ్ చేసిన పాటలు వినండి
- Vimeo, Spotify, JioSaavn లాంటి ఇతర ప్లాట్‌ఫామ్‌లు ఉపయోగించండి
- బ్రౌజర్ cache క్లియర్ చేసి YouTube app రీస్టార్ట్ చేయండి
- DownDetector YouTube Status లో లైవ్ అప్డేట్స్ చూడండి
ఈ సమస్య Google యొక్క సర్వర్ సిస్టమ్ మీద ప్రశ్నలు రేపుతోంది. ఇలాంటి పెద్ద ప్లాట్‌ఫామ్‌లు కూడా డౌన్ అవుతుంటే, యూజర్లకు స్పష్టమైన సమాచారం ఇవ్వడం చాలా ముఖ్యమని అంటున్నారు.