ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్: పాకిస్తాన్!

Latest Posts Top Stories Trending Now Uncategorized

ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం ఇప్పుడు పీక్స్‌కి చేరింది. గత మూడు రోజులుగా ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు దుమ్మురేపుతున్నాయి. ఇక ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ పాకిస్తాన్ అని తెలుస్తోంది. అణ్వస్త్రాలు ఉన్న ముస్లిం దేశాలను ఇజ్రాయెల్ టార్గెట్ చేస్తోంది. ఇదే విషయం గతంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన నెతన్యాహు కూడా చెప్పారు. అందుకే ఇరాన్ తర్వాత నెక్ట్స్ టార్గెట్ పాకిస్తాన్ పైనే అని తెలుస్తోంది.
గత మూడు రోజులుగా ఇజ్రాయెల్, ఇరాన్‌పై దాడులు తీవ్రంగా చేస్తోంది. టెహ్రాన్‌లోని సైనిక కేంద్రాలు, అణు కేంద్రాలు, చమురు శుద్ధి కేంద్రాలు ఇజ్రాయెల్ లక్ష్యంగా మారాయి. ఇరాన్‌లోని సౌత్ పార్స్ చమురు రిఫైనరీ పూర్తిగా నాశనమైంది. ఈ దాడులను ఇజ్రాయెల్ “ప్రీ-ఎంప్టివ్ స్ట్రైక్స్” అంటోంది. అంటే, ఇరాన్ అణ్వస్త్రాలు తయారు చేస్తోందని ఆరోపిస్తూ, ముందుగానే దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఇరాన్‌కి చెందిన చాలా మంది అణు శాస్త్రవేత్తలు, సైనిక అధికారులు చనిపోయారు. అటు ఇరాన్ కూడా కౌంటర్ ఎటాక్స్ స్టార్ట్ చేసింది.

నెక్ట్స్ టార్గెట్ పాకిస్తాన్‌ ?

ఇరాన్‌పై దాడుల తర్వాత, ఇజ్రాయెల్ దృష్టి ఇప్పుడు పాకిస్తాన్‌పై పడినట్లు తెలుస్తోంది. ఐదారేళ్ళ క్రితం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం స్పష్టంగా చెప్పారు. అణ్వస్త్రాలు ఉన్న ముస్లిం దేశాలు తమ టార్గెట్ అని. ఇప్పుడు ఇరాన్‌పై దాడులు జరుగుతున్నాయి. అందువల్ల తదుపరి పాకిస్తాన్ అని అప్పట్లోనే చెప్పారు. పాకిస్తాన్ కి కూడా అదే భయం పట్టుకుంది. ఆ దేశ రక్షణ మంత్రి ఖాజా ఆసిఫ్ ఇటీవల హెచ్చరించారు. “ఇజ్రాయెల్ ముస్లిం దేశాలను టార్గెట్ చేస్తోంది. మనం అందరం ఏకమై ఉండకపోతే, ఇరాన్, పాలస్తీనా లాంటి దాడులు మనపైనా జరుగుతాయి,” అని అన్నారు. పాకిస్తాన్ ఎంపీ కూడా సంచలన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎంపీ అసద్ క్వైజర్ పాక్ పార్లమెంట్‌లో మాట్లాడారు. “ఇజ్రాయెల్ ముస్లిం దేశాలను టార్గెట్ చేస్తోంది. తదుపరి లక్ష్యం పాకిస్తాన్. ఇజ్రాయెల్-ఇండియా సైనిక ఒప్పందాలు పాకిస్తాన్‌కి ముప్పుగా ఉన్నాయి. ఇరాన్‌తో 1200 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. అల్లా మమ్మల్ని కాపాడాలి, ఇరాన్‌కి ఈ కష్ట కాలంలో అండగా ఉండాలి,” అని ఆ ఎంపీ వేడుకున్నారు.


పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో హమాస్, లష్కరే తోయిబా, జైషే మహ్మద్ లాంటి ఉగ్రవాద సంస్థల నేతలు సమావేశం అయ్యారని ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మెస్సాద్‌కి సమాచారం ఉంది. ఇజ్రాయెల్‌పై దాడులు ప్లాన్ చేస్తున్నారని తెలిసి, ఇజ్రాయెల్ కోపంగా ఉంది. మరో వైపు ఇజ్రాయెల్, ఇండియా మధ్య సైనిక సంబంధాలు బలంగా ఉన్నాయి. ఇటీవల ఇండియా-పాకిస్తాన్ ఘర్షణలో ఇండియా ఉపయోగించిన డ్రోన్లు ఇజ్రాయెల్ నుంచి కొన్నవే. ఇది కూడా పాకిస్తాన్‌లో భయం కలిగిస్తోంది. గాజా, లెబనాన్, సిరియా, యెమెన్, ఇరాన్‌లపై ఇజ్రాయెల్ దాడులు చేసిన తర్వాత, ఇప్పుడు పాకిస్తాన్ అప్రమత్తంగా ఉంది. పైగా ఈమధ్యే మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి… గుర్తుంచుకోమంటూ భారత్ కు వార్నింగ్స్ కూడా ఇచ్చింది. అందుకే ఇజ్రాయెల్ ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ ని వదిలిపెట్టే అవకాశం లేదని అంటున్నారు.

Also read: నటి కల్పికపై మరో కేసు

Also read: 498 A టీ కేఫ్: భార్య కేసులపై అత్తారింటి ముందు నిరసన : బేడీలతో టీ అమ్ముతున్న భర్త!

Also read: కావ్యా పెళ్లిపై గుస గుసలు !! పాప సంపాదన ఎంతో తెలుసా !!

Also read: https://ntvtelugu.com/international-news/israel-iran-war-israels-next-target-is-pakistan-813972.html

Tagged