కొత్త సంవత్సరం వస్తోంది… చాలామంది చాలా తీర్మానాలు చేసుకుంటారు. ఈ ఏడాదిలో అది పూర్తి చేయాలి… ఇది పూర్తి చేయాలి. ప్రతి రోజూ ఎక్సర్ సైజెస్ చేయాలి… జిమ్ కి వెళ్ళాలి… జంక్ ఫుడ్స్ కి దూరంగా ఉండాలి… ఇలాంటి తీర్మానాలకు లెక్కలేదు. జనవరి 2 నుంచి మర్చిపోయేవాళ్ళు చాలామంది అయితే… మరికొంతమంది 15 రోజులు… లేదంటే నెల పాటు… అతి కష్టంగా తమ New year resolutions ని కొనసాగిస్తారు. కానీ ఏటేటా పెరిగిపోతున్న అనారోగ్య సమస్యలు, హాస్పిటల్ ఖర్చులు తగ్గించుకోవాలంటే మాత్రం కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పదు.
మిమ్మల్ని మీరు తెలుసుకోండి
చాలామంది తమకంటే పక్కవాళ్ళ మీదే ఎక్కువ దృష్టి పెడతారు. ఈమధ్య సోషల్ మీడియా బాగా విస్తృతం అయ్యాక… పక్కోడి గురించి తెలుసుకోవడం ఎక్కువైంది. తెలుసుకున్నంతవరకూ ఓకే. వాళ్ళ మీద లేని పోని నిందలు వేయడం… కామెంట్స్ చేయడం అలవాటుగా మారింది. ఇలాంటి చర్యల వల్ల మన వ్యక్తిగత జీవితంలో చాలా నష్టపోతాం. మన విలువ తగ్గిపోతుంది. అందుకే బీకేర్ ఫుల్. పక్కవాడి గురించి మనకెందుకు ? రోజులో కొంత టైమ్ మీకోసం మీరు టైమ్ కేటాయించుకోండి. మిమ్మల్ని మీరు సంతోష పెట్టుకోండి… ప్రశాంతంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండే అలవాట్లు, పనులకు ప్రాధాన్యత ఇవ్వండి.
ఎక్సర్ సైజెస్ మానేయొద్దు
ప్రతి రోజూ శరీరాన్ని కదల్చకుండా… ఫోన్లు, కంప్యూటర్లు, లాప్ ట్యాప్స్, టీవీలకు అతుక్కుపోవడం వల్ల ఒబెసిటీ, డయాబెటీస్ లాంటి అనేక దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. అందుకే ప్రతి యేటా చేసుకునే ఎక్సర్ సైజెస్ తీర్మానాన్ని 2025 New year కి కూడా చేయండి. కానీ ఎప్పటిలాగే మర్చిపోకుండా… ఈసారి కనీసం నడకతో అయినా స్టార్ట్ చేయండి. ఉదయం, సాయంత్రం వేళల్లో మీకు వీలైనప్పుడు కనీసం 30నిమిషాల నుంచి 1 గంట దాకా వాకింగ్, మెడిటేషన్ తో పాటు ఇతర వ్యాయామాలకి టైమ్ కేటాయించండి.
ఇది కూడా చదవండి Cancer Risk: క్యాన్సర్ కి ఇవే కారణం: అర్జెంట్ గా అవతల పారేయండి !
జంక్ ఫుడ్స్ కి బై బై
2024 డిసెంబర్ 31 నాడు ఎలాగూ… స్వీట్లు, హాట్స్, జంక్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్, మద్యంతో ఎంజాయ్ చేస్తాం. ఈ హడావిడిని ఈ ఒక్క రోజుకే పరిమితం చేయండి. జనవరి 1 నుంచి కనీసం… జంక్ ఫుడ్, వేపుళ్ళను పూర్తిగా మానేయండి. వీటిని బంద్ పెడితే ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టినట్టు అవుతుంది. డయాబెటీస్, బీపీ, గుండె జబ్బులు లాంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు మీ దరికి రాకుండా కాపాడుకోవచ్చు. మీ ఇంట్లో నుంచి మైదాను పూర్తిగా తీసేయండి. అలాగే బయట కూడా మైదాతో తయారు చేసిన పదార్థాలను తినడం మానేయండి.
మీ ఫుడ్ లో ప్రొటీన్స్
మీ ఆహారంలో ప్రొటీన్స్ ఉండేలాగా చూసుకోండి. ఇప్పటిదాకా ఎలాగూ నాలుక రుచి కోసం ఏవేవో తిన్నాం… ఇప్పటి నుంచైనా మీ ఫుడ్ లో ప్రొటీన్స్ కి ప్రియారిటీ ఇవ్వండి. వాటితో కండరాలకు బలం చేకూరుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. నట్స్, గుడ్లు, మొక్కల నుంచి లభించే ప్రొటీన్లను మీ ఆహారంలో చేర్చుకోండి.
నీళ్ళు తాగడం మానొద్దు
మీరు ప్రతి రోజూ ఎన్ని నీళ్ళు తాగుతారు ? ఆరోగ్య నిపుణులు మాత్రం… రోజుకి 8 సార్లు నీళ్ళు తాగాలని చెబుతారు. లేదా రెండు లీటర్లు. తాగిన ప్రతిసారి కనీసం 240 మిల్లీ లీటర్లు నీటిని తీసుకోవాలని నిబంధన ఉంది. మనం తీసుకున్న నీరు చాలా వరకు చెమట, మూత్రం, శ్వాస రూపంలో బయటికి పోతుంది. బాడీ డీహైడ్రేషన్ కాకుండా రోజూ సరిపడా నీళ్ళు తాగాలి. దాహం అయినప్పుడల్లా నీళ్ళు తాగడం బెటర్. కొంతమంది వర్క్ బిజీలో పడి… లేవడానికి బద్దకమై కూడా గంటల కొద్దీ దాహంతో గడుపుతారు. అలాంటప్పుడు… మీ పక్కనే నీళ్ళ బాటిల్ పెట్టుకోండి.
ఇది కూడా చదవండి : ఆ గ్రీటింగ్స్ క్లిక్ చేశారో… మీ ఖాతా ఖాళీ !
సరిపడా నిద్ర పోతున్నారా ?
ఆరోగ్యంగా ఉండానికి మంచి ఫుడ్ ఎంత అవసరమో, ఆరోగ్యకరమైన శరీరానికి నిద్ర కూడా అంతే కావాలి. నిద్ర లేకపోవడం వల్ల కూడా అనేక రకాల సమస్యలు, వ్యాధులు ఎటాక్ చేస్తాయి. వయస్సు ప్రకారం ఎవరికి ఎన్ని గంటల నిద్ర అవసరం అంటే… నవజాత శిశువులకు రోజులో 11 నుంచి 14 గంటల నిద్ర అవసరం. 3-5 ఏళ్ళ పిల్లలకు 10 నుంచి 13 గంటలు, యుక్త వయస్సు ఉన్న వారు అంటే 14-17 ఏళ్ళ వారు 8 నుంచి 10 గంటల వరకు నిద్ర పోవాలి. 18 – 60 మధ్య వయసు గల వారు 7 నుంచి 9 గంటల స్లీప్ బెటర్. వృద్ధులు అంటే 60 యేళ్ళపైబడిన వారు 6 నుంచి 8 గంటల పాటు నిద్రపోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
నిద్ర లేకపోవడం వల్ల మానసిక స్థితి, జ్ఞాపకశక్తిపై తీవ్ర ప్రభావం పడుతుంది. గత కొన్నేళ్ళుగా అర్థరాత్రి దాటే దాకా మొబైల్స్, టీవీ స్క్రీన్స్ కి అతుక్కుపోతూ నిద్రను దూరం చేసుకుంటున్నారు చాలామంది. మీరు కూడా ఇలాగే చేస్తుంటే… ఈ కొత్త ఏడాదిలో అయినా… మొబైల్స్, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ని పక్కనబెట్టి… రోజుకి కనీసం 6 నుంచి 8 గంటల టైమ్ నిద్రకు కేటాయించండి. అంతేకాదు… మన నిద్రకు ఇబ్బంది కలిగించే కెఫీన్, కూల్ డ్రింక్స్ లాంటి పదార్థాలను రాత్రిళ్ళు తీసుకోవద్దు.
ఇది కూడా చదవండి : మరికాస్త ఉప్పు… మహా డేంజర్ !

ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉచిత సలహాలు ఇవ్వొచ్చు. కానీ వీటిని తప్పకుండా అమలు చేస్తే… మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోగలుగుతారు. అందుకే మీరు రాసుకునే ఏ తీర్మానమైనా…. మొత్తం ఏడాదంతా కాకుండా… మైక్రో మైల్ స్టోన్ పద్దతిలో… వారం, రెండు వారాలు, నెల, రెండు నెలలు, 3 నెలలు… ఇలా పొడిగించుకుంటూ పోండి. అప్పుడు తప్పకుండా మీరు విజయం సాధిస్తారు.
2025లో అయినా హాస్పిటల్ గుమ్మం తొక్కకుండా… పక్కవాడి జోలికి పోకుండా ఒత్తిడిలేని ప్రశాంతతతో జీవిద్దాం…
అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు… 2025లో మరిన్ని ఆర్టికల్స్ తో మిమ్మల్ని చేరుకోవాలని Telugu word ఆశిస్తోంది. మీ కామెంట్స్ రూపంలో మమ్మల్ని ఆశీర్వదించండి. ఈ కింది లింక్ ద్వారా Telugu Word Telegram group లో జాయిన్ అవ్వండి.
🎯 తెలుగు వర్డ్ Telegram Link : CLICK HERE FOR TELEGRAM LINK
1 thought on “కొత్త ఏడాదిలో మారిపోదామా ?”
Comments are closed.