జాగ్రత్త… కొత్త సంవత్సరం వస్తోంది… ఈ అవకాశం కోసమే సైబర్ నేరగాళ్ళు వెయిట్ చేస్తున్నారు. New Year Greetings పేరుతో కొత్త దందా మొదలుపెట్టారు. మీరు ఏ లింక్ క్లిక్ చేసినా… ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా సరే… ఫోన్లోకి జొరబడి మీ వ్యక్తిగత సమాచారం దొంగలిస్తారు. మీ బ్యాంకుల ఖాతాలు కొల్లగొట్టి… నిలువునా దోచేస్తారు. గ్రీటింగ్స్, ఆఫర్లు, కూపన్ల పేరుతో వచ్చే మెస్సేజెస్ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి.
కొత్త ఏడాదికి ఇంకా కొన్ని రోజులే టైమ్ ఉంది. దాంతో New Year greetings హడావిడి మొదలైంది. Advanced greetings తో పాటు… డిసెంబరు 31 రాత్రి నుంచే శుభాకాంక్షల మెస్సేజెస్ పంపుతుంటారు. ఈ టైమ్ లో రక రకాల పిక్స్, మెస్సేజెస్…. మీ పేరుతో తయారు చేసుకోవచ్చు… మీ ఫ్రెండ్స్ కి పంపడానికి ఈ లింకుపై క్లిక్ చేసి… డిటైల్స్ ఫిలప్ చేయమని మెస్సేజెస్ వస్తుంటాయి. అయితే వాటిని నిజమే అనుకొని క్లిక్ చేశారంటే మీ మొబైల్ లోకి cyber criminals చొరబడతారు. ఆండ్రాయిడ్ ప్యాకేజీ కిట్ (apk) ఫైల్స్ రూపంలో వచ్చే అప్లికేషన్ ఒకసారి మీ మొబైల్లోకి వస్తే… మీ డేటా మొత్తం నేరగాళ్ళకు చేరిపోతుంది. Bank Accounts details, Photos, Videos, Contact Numbers, అన్ని ఫైల్స్ కాపీ చేసుకుంటారు. అందుకే New year మెస్సేజెస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని Cyber experts హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే మెస్సేజెస్ స్టార్ట్ చేసిన సైబర్ క్రిమినల్స్…. రాబోయే 2,3 రోజుల్లో ఇలాంటి ఎటాక్స్ మరిన్ని చేసే చాన్సుంది.
Read this also : Fake Calls: ఆ మొబైల్ నెంబర్స్ ఎత్తకండి… మీ కొంప కొల్లేరే !
న్యూ ఇయర్ డిస్కౌంట్ల పేరుతో లింక్స్
కొత్త సంవత్సరం సందర్భంగా షాపింగ్ మాల్స్, బడా బడా e-commerce సంస్థల పేరుతో ప్రకటించే ఆఫర్లతోనూ మోసాలకు పాల్పడే అవకాశముంది. Discount Coupons, భారీ ఆఫర్లు, Events passes పేరుతోనూ బోగస్ లింకులు పంపి మోసాలకి పాల్పడుతున్నారు కొందరు కేటుగాళ్ళు. వాటిని పొరపాటున ఓపెన్ చేశారంటే మీ మొబైల్ హ్యాక్ అవుతుంది. బ్యాంకు అకౌంటు ఖాళీ అవుతుంది. ఆ లింక్స్ ఇతరులకు ఫార్వార్డ్ చేస్తే… వాళ్ళని కూడా మోసం చేసే ఛాన్సుంది. సైబర్ కేటుగాళ్ళు… జనానికి అనుమానం రాకుండా… పెద్ద పెద్ద సంస్థల పేరుతోనే Event passes పంపుతున్నట్టు తెలుస్తోంది. మీ డిటైల్స్ నమోదు చేస్తే తక్కువ ధరకే టికెట్లు వస్తాయని ఆశ పెడుతున్నారు. లింక్స్ తెరిస్తే… వెంటనే మాల్వేర్ తో సైబర్ నేరగాళ్లు ఫోన్ ను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. బ్యాంకు అకౌంట్స్ లో డబ్బులు కాజేయడంతోపాటు… మీ ఫోటోలను న్యూడ్ గా మార్చి… మార్ఫింగ్ చేసే ఛాన్స్ కూడా ఉందని పోలీసులు, సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే మీకు తెలియని, కొత్త నెంబర్ల నుంచి వచ్చే లింక్స్ ఏవీ ఓపెన్ చేయొద్దని హెచ్చరిస్తున్నారు.
🎯 తెలుగు వర్డ్ Telegram Link : CLICK HERE FOR TELEGRAM LINK