పాక్ ఆక్రమిత కశ్మీరు (పీఓకే)పై భారత్ ఊహించని దాడి చేసేందుకు ఓ రహస్య ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడి భారత్ నుంచి కాకుండా, ఆశ్చర్యకరంగా తజకిస్తాన్ నుంచి జరగనుందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని, తజకిస్తాన్‌లోని ఆయనీ వైమానిక స్థావరం నుంచి భారత యుద్ధ విమానాలు దాడులు చేయనున్నాయట.
పీఓకేకి, తజకిస్తాన్కి మధ్య వఖాన్ కారిడార్ అనే ఎవరి ఆధీనంలోనూ లేని భూభాగం ఉంది. ఈ మార్గం గుండా భారత వాయుసేన యుద్ధ విమానాలు పీఓకేలోకి చొచ్చుకెళ్లి దాడి చేయనున్నాయని అంచనా. ముఖ్యంగా, పైలట్ల ప్రాణాలకు ముప్పు లేకుండా మానవరహిత విమానాలు (డ్రోన్లు)తో ఈ దాడులు జరపాలని భారత వాయుసేన ఆలోచిస్తున్నట్లు సమాచారం.
ఆయనీ వైమానిక స్థావరం భారత్‌దేనా?
తజకిస్తాన్‌లోని దక్షిణ ప్రాంతంలో ఆయనీ అనే చిన్న గ్రామం ఉంది. అక్కడ గల గిస్సార్ సైనిక ఎయిర్‌డ్రోమ్ ఒకప్పుడు శిథిలావస్థలో ఉండేది. దాన్ని అటల్ బిహారీ వాజ్‌పేయీ ప్రభుత్వం అభివృద్ధి చేసింది. రన్‌వేను 3,200 మీటర్లకు విస్తరించి, యుద్ధ విమానాలు దిగడానికి, టేకాఫ్ చేయడానికి అనువైన స్థావరంగా మార్చారు. ఈ పనుల్లో అప్పటి కీలక అధికారులైన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, వాయుసేన మాజీ అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ బి.ఎస్. ధనోవా ముఖ్యమైన పాత్ర పోషించారు.
ఈ స్థావరంలో విమానాల మరమ్మత్తు కోసం హ్యాంగర్లు, ఓవర్‌హాలింగ్ కేంద్రాలు, ఇంధన నింపే సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. దీని కోసం భారత్ దాదాపు 10 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. ఇప్పుడు ఈ ఆయనీ వైమానిక స్థావరాన్ని భారత్, తజకిస్తాన్ సైన్యాలు కలిసి నిర్వహిస్తున్నాయి. ఇది విదేశాల్లో భారత్‌కు తొలి వైమానిక స్థావరంగా గుర్తింపు పొందింది.
సుఖోయ్‌లు సిద్ధంగా ఉన్నాయా?
ఆయనీ స్థావరంలో ఇప్పటికే భారత్‌కు చెందిన కొన్ని సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానాలు ఉన్నట్లు సమాచారం. ఈ స్థావరం పాకిస్తాన్‌లోని పెషావర్‌కు 500 కిలోమీటర్లు, ఇస్లామాబాద్, పీఓకేకి సుమారు 600 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఉత్తర ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుకు కేవలం 150 కిలోమీటర్ల దూరంలో ఉండటం వల్ల, పాకిస్తాన్‌పై నిఘా, అవసరమైతే దాడులకు ఈ స్థావరం చాలా అనుకూలం.
ఈ ప్రణాళిక వెనుక భారత్ రక్షణ వ్యూహంలోని చాకచక్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు శాంతిని కోరుకుంటూనే, మరోవైపు దేశ భద్రత కోసం ఎలాంటి సాహసోపేత నిర్ణయాలైనా తీసుకోవడానికి భారత్ సిద్ధంగా ఉందని ఈ ప్లాన్ చెబుతోంది.
Read this also ఇండో పాక్ టెన్షన్ – 7న సివిల్ మాక్ డ్రిల్ – రెడీగా ఉండండి!