Fake Calls: ఆ మొబైల్ నెంబర్స్ ఎత్తకండి… మీ కొంప కొల్లేరే !

Cyber Alerts Latest Posts Money Matters Personal Finance Top Stories Trending Now

మొబైల్ మాల్ వేర్ అటాక్స్ లో ప్రపంచంలో ఇండియానే టాప్ గా నిలిచింది. అత్యధికంగా సైబర్ దాడుల బారిన పడుతున్న దేశాల్లో మొదటి స్థానంలో ఉన్నట్టు రిపోర్టులు చెబుతున్నాయి. డబ్బులు నొక్కేయడమే టార్గెట్ గా ఈ దాడులు జరుగుతున్నాయి. గత ఏడాదిన్నరలో 11 వేల కోట్ల రూపాయలను కొట్టేశారు ఈ కేటుగాళ్ళు. అందుకే గుర్తు తెలియని ఫోన్ నెంబర్లను లిఫ్ట్ చేయొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Fake phone calls

డ్రగ్స్ పార్శిల్స్, లోన్లు ఇస్తామనడం, లింకులు పంపడం, మాల్ వేర్ ను మొబైల్స్ లోకి పంపడం, డిజిటల్ అరెస్ట్ పేరుతో భయపెట్టి ఉన్నదంతా దోచుకోవడం లాంటి నేరాలకు పాల్పడుతున్నారు సైబర్ క్రిమినల్స్. ఇప్పుడు రింగ్ చేసిన వెంటనే మన మొబైల్ ని హ్యాంగ్ చేసే దారుణాలకు కూడా తెగబడుతున్నారు. అందుకే మీకు తెలిసిన నెంబర్ లేదా… ఇండియాకు సంబంధించిన నెంబర్లు మాత్రమే లిఫ్ట్ చేయండి. + కోడ్ తో ప్రారంభమయ్యే ఇతర దేశాల నెంబర్లను ఎట్టి పరిస్థితుల్లో లిఫ్ట్ చేయొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మన ఫోన్ హ్యాంగ్ అయిందేంటి అని అదే నెంబర్ కి మళ్ళీ కాల్ చేస్తే… మన కాంటాక్ట్ డిటైల్స్ తో పాటు బ్యాంక్ అకౌంట్స్, క్రెడిట్ కార్డుల సమాచారం లాంటివి కేవంల మూడంటే… 3 సెకన్లలోనే కాపీ చేసుకుంటున్నారు. ఇవి కాకుండా 1 నొక్కండి అని లేదా….#90 లేదా #09 తొమ్మిది నంబర్లను నొక్కమని సూచిస్తున్నారు. అలా రికార్డెడ్ కాల్స్ ద్వారా గానీ, క్రిమినల్స్ కాల్ చేసినా గానీ… ఏవి నొక్కమన్నా స్పందించకూడదు. అలా నొక్కామంటే చాలు… క్షణాల్లో మన బ్యాంక్ అకౌంట్స్ లో డబ్బులు నొక్కేస్తున్నారు.

ఇది కూడా చదవండి :Cyber Alert : 9 నొక్కారో… మీ అకౌంట్ ఊడ్చేస్తారు !

ఈ నెంబర్లు అస్సలు ఎత్తవద్దు (Don’t Lift these mobile numbers)

Fake phone calls

తెలియని నెంబర్ల నుంచి కాల్స్ వస్తే ఎట్టి పరిస్థితుల్లో లిఫ్ట్ చేయొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఆ నెంబర్ల వివరాలు ఈ కింద ఇస్తున్నాం.

+94777 455913

+37127913091

+37178565072

+56322553736

+37052529259

+255901130460

ఇవే కాకుండా… నా పర్సనల్ గా (Vishnu Kumar, Senior Journalist) వచ్చిన కొన్ని నెంబర్లను కూడా మీకు షేర్ చేస్తాను. వీటిని కూడా లిఫ్ట్ చేయొద్దు. నాకు ప్రతి రోజూ ఉదయం శ్రీ వేంకటేశ్వరుడి సుప్రభాతం వినడం కన్నా ముందే ఈ కింద తెలిపిన నెంబర్ల నుంచి కాల్స్ వస్తున్నాయి.

Don’t Lift these mobile numbers

+87 నెంబర్ల నుంచి కాల్స్ ఎక్కువగా వస్తున్నాయి.

+87086367270,

+870868939315,

+187723483589,

+870999596979 ఇవి నాకు వచ్చిన నెంబర్లు. ఈ నెంబర్లు కూడా ఎవరూ లిఫ్ట్ చేయొద్దు. ఇవి specific గా ఏ దేశానికి చెందినవి కావు. షిప్ నుంచి నుంచి తీర ప్రాంతాలకు చేస్తున్నట్టుగా ఇంటర్నెట్ లో చూపిస్తోంది.

ఇది కూడా చదవండి : Digital Arrest : డిజిటల్ అరెస్ట్ లేనే లేదు … డోన్ట్ ఫియర్ !

Fake calls

పశ్చిమ యూరప్ దేశాల నుంచే ! (Fake calls from Northern Europe countries)

గత కొంత కాలంగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని అనేక నగరాలకు ఆఫ్రికాతో పాటు నార్తర్న్ యూరప్ కంట్రీస్ నుంచి ఎక్కువగా కాల్స్ వస్తున్నాయి.

+371 ( లాత్వియా)

+375 (బెలారస్)

+381 (సెర్బియా)

+563 (లోవా)

+370 (లిథువేనియా)

+255 ( టాంజానియా)

ఈ దేశాల నుంచి వచ్చే కాల్స్ కూడా ఎవరూ లిఫ్ట్ చేయొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Fake phone calls

ఎలా బ్లాక్ చేయాలి ? (How to BLOCK fake Numbers)

Unknown నెంబర్స్ నుంచి కాల్స్ వచ్చినప్పుడు… వాటిని ఎట్టి పరిస్థితుల్లో లిఫ్ట్ చేయొద్దు. కాల్ కట్ చేయండి.. కట్ అయ్యాక… వెంటనే మీరు recent calls లోకి వెళ్ళి history అనే ఆప్షన్ నొక్కండి. అక్కడ right side లో కనిపించే 3 డాట్స్ లో Block చేసే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ అదే నెంబర్ నుంచి మీకు కాల్స్ ఎట్టి పరిస్థితుల్లో రావు.

లేకపోతే…  ఈ లింక్ ద్వారా National Cyber Crime portal లో కంప్లయింట్ చేయొచ్చు.  ఇంకా 1930 కి కాల్ చేసి తెలుగులోనే మీ సమస్యను, మీకు జరిగిన మోసాన్ని వివరించవచ్చు.

https://cybercrime.gov.in/

తెలుగు వర్డ్ వెబ్ సైట్ విజ్ఞప్తి (Sincere request to Telugu Word readers)

Telugu word

 

చదువుకున్నవాళ్ళు, యువకులు, ఉద్యోగుల్లో చాలా మంది సైబర్ కేటుగాళ్ళ బారి నుంచి ఎలాగోలా బయటపడుతున్నారు. కానీ ఇంట్లో ఉండే గృహిణులు, సీనియర్ సిటిజన్స్ (వృద్ధులను) ఈ కేటుగాళ్ళు దారుణంగా మోసం చేస్తున్నారు. వృద్దాప్యంలో ఆసరాగా ఉంటాయని దాచుకున్న ఫించన్ పైసలు, డిపాజిట్ డబ్బులను కోట్ల రూపాయల్లో నొక్కేస్తున్నారు సైబర్ క్రిమినల్స్. అందుకే దయచేసి… మీ తల్లిదండ్రులు, అత్తమామలు లేదా మీ బంధువుల్లో ఎవరైనా వృద్ధులు ఉంటే… వాళ్ళకి కూడా ఈ సమాచారం తెలియజేయండి. కొత్త నెంబర్లు వస్తే కాల్స్ లిఫ్ట్ చేయొద్దని మీ వంతు బాధ్యతగా ఈ ఆర్టికల్ చదివిన వెంటనే కాల్ చేసి చెప్పండి… అంతే కాదు… వాళ్ళకి ఈ ఆర్టికల్ ని షేర్ చేయండి. అస్సలు అశ్రద్ధ చేయొద్దు. ఓ సీనియర్ జర్నలిస్ట్ గా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా…

ఇలాంటి మంచి ఆర్టికల్స్ అందిస్తున్న Telugu word website కి సంబంధించి ఈ కింది లింక్ ద్వారా Telegram Group లో జాయిన్ అవ్వండి. ఇప్పటి నుంచి Telugu Word ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్ గా చేసుకోండి. Thank you.

ఇక్కడ క్లిక్ చేయండి

Tagged