Life Insurance Corporation (LIC) దగ్గర Unclaimed policies గుట్టలా పేరుకుపోతున్నాయి. గత ఏడాదిలో గడువు తీరిన రూ.880.93 కోట్ల విలువైన పాలసీలను ఎవరూ Claim చేయలేదు. 3,72,282 పాలసీదారులు తమ Policyలను క్లెయిమ్ చేసుకోలేదు. పాలసీ maturity time అయిన 3యేళ్లలోపు ఆ మొత్తాన్ని తీసుకోకపోతే…. దాన్ని క్లెయిం చేసుకోని మొత్తంగా గుర్తిస్తారు. పాలసీ గడువు అయిపోవడం, పాలసీదారుడు చనిపోవడం, ప్రీమియం చెల్లించకపోవడం వల్ల ఇలా క్లెయిమ్ కాకుండా మిగిలిపోతాయి. పదేళ్ల వరకూ Policyని ఎవరూ క్లెయిం చేసుకోకపోతే ఆ అమౌంట్ Central Government Senior citizen welfare fundకి జమ అవుతుంది. ఒకవేళ మీ పాలసీ కూడా ఇలా unclaimed గా మారిందా లేదా తెలుసుకోండి. ఒకవేళ మారితే వెంటనే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ని LIC ఆఫీసులో సమర్పించి మీ పాలసీ మొత్తాన్ని claim చేసుకోవచ్చు.
ఎలా క్లెయిమ్ చేసుకోవాలి ?
మొదట LIC Websiteకి వెళ్లండి. అక్కడ Customer Serviceలో Unclaimed Accounts ని ఎంచుకోండి. మీ Policy details, పేరు, పుట్టిన తేదీ, PAN Card లాంటి వివరాలను ఎంటర్ చేయండి. అప్పుడు మీ పాలసీకి సంబంధించిన వివరాలు కనిపిస్తాయి.
పాలసీని claim చేసుకుడానికి అప్లికేషన్ పూర్తి చేసి, అందులో అడిగిన డాక్యుమెంట్స్ జత చేయాలి. మీకు దగ్గరల్లో ఉన్న LIC ఆఫీసులో వాటిని submit చేయండి. LIC అధికారులు ఈ డాక్యుమెంట్స్
పరిశీలించి… ఆ పాలసీని పరిష్కరించి… అమౌంట్ ను మీ అకౌంట్ లోకి జమ చేస్తారు.
Link ఇదే : CLICK HERE FOR LIC UNCLAIMED DETAILS