వామ్మో ఆ కూరలు తింటున్నారా ?

Healthy Life Latest Posts Top Stories Trending Now

Bacteria in Vegetables : ప్రతి రోజూ ఆకు కూరలు తినండి… కూరగాయలు తినండి… ఒబెటిసీ, డయాబెటీస్ కి చెక్ చెప్పండి అంటూ ఆరోగ్య నిపుణులు తరుచుగా చెబుతుంటారు. కానీ కొన్ని కూరగాయలు, ఆకు కూరల్లో రుచి తేడా అనిపిస్తోందన్న కంప్లయింట్స్ తరుచుగా వస్తున్నాయి. కొన్ని చేదుగా ఉంటే… మరికొన్ని ఫెస్టిసైడ్స్ వాసన వస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, విజయవాడ, విశాఖ లాంటి నగర మార్కెట్లలో దొరికే కూరగాయలు, ఆకు కూరలపై ఇలాంటి ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి. అవి తినడం సేఫేనా అని జనం భయం పడుతున్నారు. ICMR సర్వే తర్వాత ఈ అనుమానాలు మరింత నిజం అయ్యాయి.

Read this also : మహా కుంభ్ మేళాపై ఎందుకీ కడుపు మంట ?

Vegetables

కూరగాయల్లో డేంజర్ బ్యాక్టీరియా !

మనం తింటున్న ఆకు కూరలు, కూరగాయల్లో డేంజరస్ బ్యాక్టీరియా ఉందని Indian Council for medical research (ICMR) స్టడీలో తేలింది. దాంతో మన కడుపులోకి ప్రతీ రోజు ఎంత పెద్ద మొత్తంలో విషం వెళ్తుందో అన్న భయంతో జనం వణికిపోతున్నారు. ICMR, Central University, Agricultural University ఇలా 3 ప్రముఖ సంస్థలు… హైదరాబాద్ లోనే కాదు… దేశవ్యాప్తంగా సర్వేని నిర్వహించాయి. మొత్తం 1780 శాంపిల్స్ సేకరించి పరీక్షలు చేస్తే… వాటిల్లో డేంజర్ బ్యాక్టీరియాతో పాటు యాంటీ బయాటిక్స్, డ్రగ్ రెసిస్టెన్స్ అవశేషాలు బయటపడ్డాయి. మన మూత్రనాళాల వ్యవస్థకు హాని చేసే యూరో పాథోజెనిక్ ఈ-కొలైస్ట్రెయిన్స్ తో శరీరాన్ని సెప్టిక్ చేసే సెప్టిసీమియా ఈకొలై స్ట్రెయిన్ ఉన్నట్టు బయటపడ్డాయి.

Vegetables

క్యారెట్ లో 25శాతం బ్యాక్టీరియా !

కూరగాయల నుంచి సేకరించిన శాంపిల్స్ లో 77 రకాల బ్యాక్టీరియా వర్గాలు బయటపడ్డాయి. క్యారెట్ లో హయ్యస్ట్ గా 25శాతం బ్యాక్టీరియా రకాలు ఉన్నాయి. క్యాబేజీలో 19.3%, మెంతిలో 18.5%, టమాటాలో 15.9శాతం బ్యాక్టీరియా strains ఉన్నాయి. కూరగాయలే కాదు… ఆకు కూరల్లోనూ బ్యాక్టీరియా ఫుల్లుగా ఉంది. కొత్తిమీరలో 15.7, పాలకూరలో 15.2శాతం, పుదీనాలో 12శాతం బ్యాక్టీరియాల స్ట్రెయిన్స్ ఉన్నాయి.

Vegetables

ఈ కూరగాయలతో ఎన్నో రోగాలు

కూరగాయల్లో ఉన్న బ్యాక్టీరియా స్ట్రెయిన్స్ ను తినడం వల్ల మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లు, బ్లడ్ ఇన్ఫెక్షన్లు గ్యారంటీ అంటున్నారు సైంటిస్టులు. గతంలో చికెన్, మటన్ లో మాత్రమే ఇలాంటి స్ట్రెయిన్స్ ఉన్నట్టు చెప్పేవారు. కానీ ఇప్పుడు కూరగాయల్లోనూ కనిపిస్తున్నాయి. మనుషులు విసర్జించే మల మూత్రాల నుంచే ఇవి కూరగాయల మొక్కల్లోకి చేరుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు ఫెస్టిసైడ్స్ వాడకం వల్ల యాంటీ బయాటిక్స్ అవశేషాలు కూడా ఎంటర్ అవుతున్నాయి. పిల్లల్లో మెదడు వాపునకు కారణమయ్యే నియోనేటర్ మెనింజైటిస్ ఈ కొలైస్ట్రెయిన్స్ కూడా కూరగాయల్లో ఉన్నాయంటున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో మనం డాబా గార్డెన్స్ కి ప్రాధాన్యత ఇవ్వడమే బెటర్ అనిపిస్తోంది. మీరేమంటారు. మీ ఒపీనియన్ కామెంట్ చేయండి.

Read this also :Cancer Risk: క్యాన్సర్ కి ఇవే కారణం: అర్జెంట్ గా అవతల పారేయండి ! 

ఇలాంటి మంచి ఆర్టికల్స్ అందిస్తున్న Telugu Word Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

CLICK HERE

Tagged