మహా కుంభ్ మేళాపై ఎందుకీ కడుపు మంట ?

Devotional Latest Posts Top Stories Trending Now

144 యేళ్ళకు ఒక్క సారి వచ్చేది మహా కుంభమేళా … ఈ మేళా సందర్భంగా గంగా నదిలో ఒక్కసారి స్నానం చేస్తే…. కోటి సార్లు స్నానం చేసినంత పుణ్యఫలాన్ని పొందవచ్చని స్కాంద పురాణం చెబుతోంది. అందుకే ఇంతటి మహోన్నతమైన మహా కుంభ మేళాలో పుణ్య స్నానాలు చేయడానికి కోట్ల మంది జనం ఉత్తరప్రదేశ్ కు క్యూలు కడుతున్నారు.. మేం బతికి ఉన్న కాలంలో మహా కుంభమేళా అనేది జరిగిందని ప్రతి ఒక్క హిందువు తమ జీవిత కాలంమంతా చెప్పుకునేలా జరుగుతోంది ఈ ఉత్సవం… ఈ ఆధ్యాత్మిక ఉత్సవం గురించి ఈమధ్యే పాకిస్తాన్ కు చెందిన ఓ సీనియర్ జర్నలిస్ట్ రాసిన ఆర్టికల్ కూడా వాట్సాప్ లో తిరుగుతోంది.

భారత దేశంలోనే కాదు… ప్రపంచ దేశాల్లోనే అతి పెద్ద మహోత్సవంగా ఈ మహా కుంభ్ మేళాను చెప్పుకుంటున్నారు. అలాంటి ఈ ఉత్సవం అంటే కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీల అగ్రనేతలు ఎందుకు ద్వేషం పెంచుకుంటున్నారు… ఎందుకు నోరు పారేసుకుంటున్నారో హిందువులకు అర్థం కాని విషయం.

గంగా నదిలో స్నానం చేస్తే పేదరికం పోతుందా అని AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అంటే…

మహా కుంభ్ కాదు… ఫాల్త్ కుంభ్ అని బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కామెంట్

తొక్కిసలాటలో చనిపోయిన వారి డెడ్ బాడీస్ అదే మహాకుంభ్ మేళాలో జరిగే గంగా నదిలో వేస్తున్నారని… జయా బాధురీ కామెంట్ చేశారు.

ఇది మహా కుంభ్ కాదు… మృత్యు కుంభ్ మేళా అని పశ్చిమ్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అసెంబ్లీలోనే కామెంట్ చేశారు.

అసలు ఏమైంది… ఈ నేతలకు… ?

హిందువులంటే ఎందుకింత ద్వేషం ?

వీళ్ళంతా హిందువుల ఓట్లు లేకుండానే గెలిచారా ?

కళ్ళ ముందు జరుగుతున్న మహా కుంభ్ మేళా అద్భుతాన్ని … ఈ మహా జనసందోహాన్ని చూసి ఇండియా కూటమి నేతలు ఎందుకు జడుసుకుంటున్నారో అర్థం కావట్లేదు. బీజేపీపై కోపాన్ని ఇండియా కూటమి నేతలంతా హిందువులపై తీర్చుకుంటున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. కోట్ల మంది భక్తులు మహా కుంభమేళాలో పుణ్యస్నానాలకు వస్తున్నారు. ఈ సందర్భంగా తొక్కిసలాటలు జరుగుతున్నాయి. అయినా సరే… మృత్యువుకు భయపడకుండా… జాతి, కుల, మత, దేశీయ, విదేశీయులకు అతీతంగా… ఇలా అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా మేళాలో పాల్గొనడంపై ప్రపంచ దేశాల్లోనే పెద్ద చర్చ నడుస్తోంది. ఇదే కాంగ్రెస్, ఇతర పార్టీల నేతలు చాలా మంది మహా కుంభమేళాలో పాల్గొని పుణ్యస్నానాలు చేస్తున్నారు.

ఇదేనా మీ లౌకికవాదం ?

పొద్దున లేస్తే … భారత దేశంలో లౌకిక వాదం గురించి మాట్లాడతారు ఈ నేతలు. తామే నిజమైన లౌకిక వాదులమని చెప్పుకుంటారు. లౌకిక వాదం అంటే అన్ని మతాలను గౌరవించాలని కాదా… హిందూ మతం తప్ప మిగతా మతాలకు మాత్రమే గౌరవించాలని మీ పార్టీల రాజ్యాంగంలో రాసి ఉందా ?

మీకు కోపం ఉంటే బీజేపీపై విమర్శలు చేసుకోండి…

కానీ హిందువుల సంప్రదాయాన్ని తిట్టే హక్కు మీకు ఎవరిచ్చారు ?

బీజేపీకి రాజకీయంగా ఎదుర్కోలేక… హిందుత్వాన్ని, హిందువుల సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను ఎందుకు దూషిస్తున్నారు ?

మహాకుంభ్ మేళాను మృత్యు కుంభమేళా అని మమతా బెనర్జీ అనడాన్ని చూస్తే… ప్రతి హిందువుకీ ఒళ్ళు మండిపోతోంది.

ఇండియా కూటమి నేతల కామెంట్స్ పై మీ ఒపీనియన్ ను కామెంట్స్ రూపంలో తెలియజేయండి ప్లీజ్.

అలాగే ఈ ఆర్టికల్ ను మీకు తెలిసిన అన్ని సోషల్ మీడియా గ్రూపుల్లో ఫార్వార్డ్ చేయండి.

మన Telegu Word – Telegram Group లో జాయిన్ అవ్వండి : LINK

Tagged