రీసెంట్ కామెంట్స్ పై విమర్శలు
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జోరు మామూలుగా లేదు. ఈ బ్యూటీ నటించిన సినిమాలన్నీ వరుసగా బ్లాక్ బ్లస్టర్లు అవుతుండటంతో ఆమె క్రేజ్ మామూలుగా లేదు. భాషతో సంబంధం లేకుండా వరుసబెట్టి సినిమాలు చేస్తూ కెరీర్లో ముందుకు దూసుకెళ్తోంది. పుష్ప, యానిమల్, ఛావా సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్‌లు అందుకున్న రష్మిక.. రీసెంట్ గా ధనుష్ తో కలిసి చేసిన కుబేర సినిమా సూపర్ హిట్ టాక్ తో సక్సెస్‌ఫుల్ గా రన్ అవుతుంది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక .. గత కొన్నాళ్లుగా సొంత భాష అయిన కన్నడ ఇండస్ట్రీ నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది. గతంలో తన కామెంట్స్ తో కన్నడిగుల ఆగ్రహానికి గురైన రష్మిక.. ఇప్పుడు మరోసారి వాళ్ల చేతికి దొరికింది.
రీసెంట్ గా ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ కొడవ కమ్యూనిటీ నుంచి ఇండస్ట్రీకి వచ్చిన ఏకైక వ్యక్తిని తానే అని చెప్పుకొచ్చారు. దీంతో రష్మిక వ్యాఖ్యలపై కన్నడిగులు ఫైర్ అవుతున్నారు. ఎందుకంటే కొడవ కమ్యూనిటీ నుంచి ఇప్పటికే ఎంతోమంది ఇండస్ట్రీలోకి వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతో ఫేమస్ అయిన ప్రేమ కూడా కొడవ కమ్యూనిటీకి చెందిన వ్యక్తే. ప్రేమ, రష్మిక కంటే చాలా ముందే ఇండస్ట్రీలోకి వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రేమ కాకుండా నిధి సుబ్బయ్య, కృషి థపండ, హర్షిక పూనచ్చ, డైసీ బోపన్న, శ్వేత చంగప్ప లాంటి ఎంతో మంది కూడా కొడవ కమ్యూనిటీ నుంచి వచ్చిన వారే. దీంతో సొంత డబ్బా కొట్టుకుంటోందంటూ కన్నడ జనం రష్మికను ఓ రేంజ్ లో ఏసుకుంటున్నారు.
Also read: నా పెళ్లెప్పుడో మీకెందుకు..?
Also read: ఇక ఆ వీడియోలకు డబ్బులు రావు
Also read: రేవంత్ పాలన ఎండగట్టాలని డిసైడ్