కేసీఆర్ రెఢీ
* 2,3 రోజుల్లో ప్రెస్ మీట్
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కాస్త వెనక్కి తగ్గినట్టే కనిపించాడు. ఫాంహౌస్‌లోనే ఎక్కువ ఉంటూ, అసెంబ్లీకి రాకుండా, జనంలో అరుదుగా కనిపించారు. ఒక్కసారి బయటకొస్తే, రేవంత్ రెడ్డిని విమర్శించి మళ్ళీ వెళ్లిపోయారు. ఆమధ్య వరంగల్ లో జరిగిన బీఆర్‌ఎస్ రజతోత్సవ సభలో మాట్లాడినా, గతంలో లాంటి ఫైర్, ఎనర్జీ లేదని పార్టీ నాయకులే ఫీలయ్యారు. కేసీఆర్ కూతురు కవిత కూడా తన లేఖలో ఇదే మాట చెప్పారు.
అయినా, కేసీఆర్ అజ్ఞాతంలో ఉన్నారని అనుకోవడం తప్పు. ఆయన మౌనంగా ఉన్నా, వ్యూహాలు పన్నుతూనే ఉంటారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటారు. ఫామ్ హౌస్ కి వచ్చే పార్టీ లీడర్లు, కార్యకర్తలతో మాట్లాడుతూ రాష్ట్రంలో జనం నాడిని తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం ఆరోగ్యం కాస్త ఇబ్బందిగా ఉండటంతో హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. రెండు రోజుల తర్వాత తీవ్రమైన సమస్య ఏమీ లేకపోవడంతో, మినిమమ్ ట్రీట్మెంట్ తీసుకొని డిశ్చార్జ్ అయ్యారు.
కొందరు బీఆర్‌ఎస్ లీడర్లు యశోద హాస్పిటల్ లో ఉన్న కేసీఆర్‌ను కలిశారు. రాష్ట్రంలోని సమస్యలు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల గురించి చర్చించారు. ఈ సమావేశంలో కేసీఆర్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నాురు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి, బహిరంగంగా విమర్శలు గుప్పించాలని ఫిక్స్ అయ్యారు. “హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యా … ప్రెస్‌మీట్ పెట్టి, కాంగ్రెస్ పాలనలోని లోపాలు, రైతుల సమస్యలు, ఏపీలో బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు కలిగే నష్టం లాంటి అంశాలను ప్రజల ముందు పెడతా” అని గులాబీ పార్టీ లీడర్లతో కేసీఆర్ చెప్పారు. ఆరు గ్యారంటీల అమలు విషయంలో ప్రభుత్వం వైఫల్యంగా, ముఖ్యంగా రైతులకు రుణమాఫీ, రైతు భరోసాలో జరిగిన అన్యాయం మీద ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ తో మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడతారని భావిస్తున్నారు. అందుకోసం పేపర్ వర్క్ మీద ఆయన ప్రస్తుతం దృష్టి పెట్టినట్టు చెబతుున్నారు. మరి కేసీఆర్ ప్రెస్‌మీట్‌లో ఏం మాట్లాడతాడు? రేవంత్‌ను ఏ విషయాల్లో టార్గెట్ చేస్తాడు? ఇవన్నీ రాబోయే 2,3 రోజుల్లో చూడాలి.
Also read: రాజాసింగ్ కి రాం … రాం…
Also read: రష్యా చమురు కొంటే భారత్‌కు నష్టమా?
Also read: రెండు వారాల్లో 900 ఎర్త్ క్వేక్స్