రాజాసింగ్ కి రాం … రాం…

Latest Posts Trending Now

* వదులుకోడానికే బీజేపీ నిర్ణయం
* ఎమ్మెల్యేగా సస్పెండ్ చేయించే ఆలోచన
* స్పీకర్ కు విజ్ఞప్తి చేయాలని డిసైడ్

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను వదులుకోవాలని బీజేపీ డిసైడ్ అయింది. బీజేపీ అధ్యక్ష పదవికి పోటీ పడిన రాజాసింగ్ తనకు అవకాశం ఇవ్వలేదంటూ రాజీనామా చేశారు. అప్పటి అధ్యక్షుడు కిషన్ రెడ్డికి తన రిజైన్ లెటర్ ఇచ్చి వెళ్ళిపోయారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్. రామచందర్ రావు నియామకాన్ని రాజాసింగ్ వ్యతిరేకించారు. మీవాడు… మా వాడు అని పదవులు ఇస్తే, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాదు అని మాట్లాడారు. గత ఏడాదిన్నరగా రాజాసింగ్ బీజేపీలో రెబల్ గా తయారయ్యారు. తనకు అసెంబ్లీలో బీజేపీ ఎల్పీ పదవి ఇవ్వాలని పట్టుబట్టారు. అది దక్కకపోవడంతో అప్పటి నుంచి అలకబూనారు. తరుచుగా రాష్ట్ర నాయకత్వం, కిషన్ రెడ్డి మీద విమర్శలు చేస్తూ పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారు.

గతంలో రాజాసింగ్ పై వేటు పడినా, బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన చొరవతో మళ్ళీ పార్టీలోకి తీసుకొచ్చారు. కానీ ఈసారి మాత్రం రాజా సింగ్ ను వదులుకోడానికే బీజేపీ నిర్ణయించింది. ఎంత హార్డ్ కోర్ హిందూత్వ వాది అయినా, పార్టీ లైన్ దాటి మాట్లాడుతుండటం బీజేపీకి ఇబ్బందిగా మారింది. అందుకే రాజాసింగ్ పై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ స్పీకర్ ను కోరాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. అందుకోసం ప్రత్యేకంగా లెటర్ రాయాలని భావిస్తోంది. ఎన్. రామచంద్రరాబు శనివారం నాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ప్రెసిడెంట్ హోదాలో ఆయన మొదటి నిర్ణయం రాజాసింగ్ వేటుపైనే ఉండొవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గోషామహల్ కి బై ఎలక్షన్ వస్తే…రాజాసింగ్ నెక్ట్స్ ఏ పార్టీలో చేరతారన్న దానిపై ఊహాగానాలు వస్తున్నాయి. స్వతంత్ర్య అభ్యర్థిగా మళ్ళీ పోటీ చేస్తారన్న టాక్ నడుస్తోంది. లేదంటే మహారాష్ట్రలో ఉద్ధవ్ థాకరే ఆధ్వర్యంలో నడుస్తున్న శివసేన (బాల్ థాకరే ) పార్టీలో చేరతారని అంటున్నారు. కొందరు పవన్ కల్యాణ్ ని కలసి జనసేనలో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. కానీ కూటమిలో ఆ పార్టీ భాగస్వామిగా ఉండటంతో, తెలంగాణ నుంచి రాజా సింగ్ ను చేర్చుకునే అవకాశాలు ఎంతమాత్రం లేవని తెలుస్తోంది.

Also read: రష్యా చమురు కొంటే భారత్‌కు నష్టమా?

Also read: రెండు వారాల్లో 900 ఎర్త్ క్వేక్స్

Also read: ఖర్గే టూర్ పై కాంగ్రెస్ నేతల్లో టెన్షన్

Also read: https://www.msn.com/en-in/news/India/telangana-bjp-mla-raja-singh-resigns-from-party-over-state-chief-appointment-alleges-internal-threats/ar-AA1HHiBE

Tagged

Leave a Reply