ఖర్గే టూర్ పై కాంగ్రెస్ నేతల్లో టెన్షన్

Latest Posts Trending Now

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యారు. శుక్రవారం కూడా ఇక్కడే ఉంటారు. పార్టీ ఇంటర్నల్ మీటింగ్స్ తో పాటు, ఎల్బీ స్టేడియంలో జరిగే గ్రామస్థాయి కార్యకర్తల బహిరంగ సభలో కూడా పాల్గొంటున్నారు. అయితే గాంధీ భవన్ శుక్రవారం జరిగే పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఖర్గే పాల్గొంటున్నారు. ఈ మీటింగ్ కి రాష్ట్ర పార్టీ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ నాయకత్వం వహిస్తున్నారు. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ నుంచి ఏఐసీసీలో ప్రాతినిధ్యం వహిస్తున్న కార్యదర్శులు, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, రేణుకా చౌదరి, జానారెడ్డి లాంటి కొందరు సీనియర్ నేతలు పాల్గొంటారు.

లోక్ సభ ఫలితాలపై పోస్ట్ మార్టమ్
కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై పోస్ట్ మార్టమ్ జరగబోతోంది. ఎలక్షన్స్ జరిగిన 3 నెలల తర్వాత ఇప్పుడు ఆ ఫలితాలపై విశ్లేషణ జరుగుతుండటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో టెన్షన్ మొదలైంది. అసెంబ్లీలో మెజారిటీ స్థానాలు సాధించి తెలంగాణలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. కానీ మొత్తం 17 లోక్ సభ సీట్లల్లో సరే ఒకటి ఎంఐఎంకు పోయినా, మిగిలి వాటిల్లో బీజేపీతో సమానంగా 8 సీట్లను మాత్రమే దక్కించుకుంది. లోక్ సభ సీట్లపైనే ఆశలు పెట్టుకున్న ఎఐసీసీకి ఇది ఇబ్బందిగా మారింది. దీంతో పాటు ప్రభుత్వ పాలన ఎలా ఉంది, ప్రజల్లో ఎలాంట రియాక్షన్స్ ఉన్నాయో కూడా సమీక్ష జరగనుంది. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ ఉండే అంతర్గత పోరుపైనా ఖర్గే డిస్కస్ చేయబోతున్నారు. రాబోయే రోజుల్లో ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి ఎదురయ్యే సవాళ్లు, వాటిని ఎదుర్కొనే వ్యూహాలపై చర్చ జరగనుంది. ఈ విషయంలో మల్లికార్జున ఖర్గే తగిన సూచనలు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.


టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొననున్న ఖర్గే

తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం తర్వాత ఖర్గే గాంధీ భవన్‌లోనే పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో సీఎం, పీసీసీ చీఫ్, సీనియర్ మంత్రులు సహా టీపీసీసీ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొంటారు. ఈ సమావేశంలో వారి నుంచి అభిప్రాయాలు, ఆలోచనలు, సూచనలు స్వీకరిస్తారు. పార్టీని బలోపేతం చేయడం, స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ నేతలను సంసిద్ధం చేయడం ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం. పార్టీలో ఐక్యతను, క్రమశిక్షణను పెంపొందించేలా అఖిల భారత అధ్యక్షుడు ఖర్గే పలు సూచనలు చేసే అవకాశం ఉంది.
గ్రౌండ్ లెవల్ కార్యకర్తలతో మీటింగ్
దేశమంతటా కాంగ్రెస్‌ పార్టీని పటిష్టం చేయాలన్న లక్ష్యంతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మొదటిసారిగా కార్యకర్తలతో ఎల్టీ స్టేడింట్లో సమావేశం నిర్వహిస్తున్నారు. ఏ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ఇలాంటి సభలు నిర్వహించలేదు. జిల్లా, బ్లాక్, గ్రామ అధ్యక్షులను ఖర్గే డైరెక్ట్ గా కలవబోతున్నారు. గ్రామ స్థాయి నుంచి పార్టీని ఎలా పటిష్టం చేయాలన్న దానిపై ఇక్కడ చర్చిస్తారు. ఇది కాకుండా ఇదే ఎల్బీ స్టేడియంలో మధ్యాహ్నం నుంచి బహిరంగ సభ కూడా జరుగుతోంది. దీనికి తెలంగాణ జిల్లాల నుంచి జన సమీకరణ చేస్తున్నారు. తమ ప్రభుత్వం వచ్చాక సంక్షేమ పథకాల అమలు, అవి ప్రజలకు ఎలా చేరాయో వివరిస్తారు. అయితే గాంధీభవన్ లో జరిగే పొలిటికల్ ఎఫైర్స్ మీట్ లోనే పార్టీలో అంతర్గత పోరుపై చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also read: రేపు మెగా సునామీ?

Also read: టెక్ ఉద్యోగాలు ఎందుకు పోతున్నయ్ ?

Also read: భారత్ దెబ్బకు పాకిస్తాన్ విల విల !

Also read: https://www.msn.com/en-in/news/India/make-kharge-s-meeting-a-grand-success-telangana-dy-cm-bhatti/ar-AA1HSi1O

Tagged

Leave a Reply