: ఆర్థికంగా భారీ నష్టాలు
భారత్ లో ఉగ్రవాదాన్ని ఎగదోసి… టెర్రరిస్టులకు ట్రైనింగ్ ఇచ్చి మనదేశానికి పంపుతూ…యేటా వందలు, వేల మంది ప్రాణాలు తీస్తున్న పాకిస్తాన్ ఇప్పుడు అంతకు అంత అనుభవిస్తోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియా పెట్టిన ఒకే ఒక కండిషన్ తో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం కొలాప్స్ అయింది…
పాక్ లో నిత్యావసర ధరలు పెరిగిపోయాయి. ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది.
భారత్ నిషేధంతో పాకిస్తాన్ కి ఓ భారీ షాక్ తగిలింది. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత, మే 2 నుంచి భారత్ పాకిస్థానీ నౌకలపై భారత్ నిషేధం విధించింది. దీంతో భారతీయ పోర్టుల్లో పాక్ నౌకలకు ఎంట్రీ లేదు. ఈ నిషేధం వల్ల పాకిస్థాన్ ఎగుమతులు, దిగుమతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సాధారణంగా 30 నుంచి 50 రోజుల ఆలస్యం జరుగుతోంది. కరాచీ, కాసీం, గ్వాదర్ వంటి పాక్ పోర్టుల్లో నౌకలు లంగర్ వేసుకుని వెయిట్ చేస్తున్నాయి. లాజిస్టిక్స్ ఖర్చులు ఆకాశానికి పాకాయి. భారత్ నిషేధం వల్ల షిప్పింగ్ ఖర్చులు భారీగా పెరిగాయి. కరాచీకి చెందిన ఎక్స్ పోర్టర్స్ చెబుతున్నట్టుగా… లాజిస్టిక్స్ ధరలు, బీమా ఖర్చులు విపరీతంగా పెరిగాయి. దీంతో వ్యాపారులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. పాక్ ప్రభుత్వం దొడ్డిదారిలో సరుకు రవాణా చేయడానికి ప్రయత్నించింది. అయితే… ఇండియన్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఎ) ‘ఆపరేషన్ డీప్ మానిఫెస్ట్’ ద్వారా UAE, శ్రీలంక, సింగపూర్ నుంచి వచ్చే సరుకుల రవాణాను అడ్డుకుంటోంది. పాక్ నౌకలపై నిషేధం విధించడంతో… మన జలాల నుంచి వెళ్ళడానికి అధికారులు ఒప్పుకోవట్లేదు. అంతేకాదు రూ.9 కోట్ల విలువైన 1,100 మెట్రిక్ టన్నుల సరుకు ను భారత అధికారులు సీజ్ చేశారు.
పాక్ పోర్టుల ఆదాయంపైనా ఎఫెక్ట్
కరాచీ, కాసీం, గ్వాదర్ పోర్టులు పాక్ జీడీపీకి 0.5% వాటాను అందిస్తాయి. ఈ పోర్టుల ద్వారా ఏటా రూ.15 వేల కోట్ల ఆదాయం వస్తుంది. కానీ, భారత్ నిషేధం వల్ల ఈ ఆదాయం భారీగా తగ్గింది. 2018లో భారత్-పాక్ వాణిజ్యం 2.41 బిలియన్ డాలర్లు ఉండగా, 2024లో అది 1.2 బిలియన్ డాలర్లకు పడిపోయింది. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. గత వారంలో పాక్ ప్రభుత్వం నిత్యావసరాల ధరలను భారీగా పెంచింది. LPG గ్యాస్ సిలిండర్ ధర 50% పెరిగి, సబ్సిడీ సిలిండర్ రూ.1,000 నుంచి రూ.1,500కు చేరింది. పెట్రోల్ ధర లీటరు రూ.78.56 నుంచి రూ.80.02కు, డీజిల్ ధర రూ.79.84 నుంచి రూ.82.26కు పెరిగింది. వీటికి మళ్ళీ ట్యాక్సులు అదనం. జూలై 1 నుంచి ఈ ధరలు మరింత పెరగనున్నాయి.
మదర్ షిప్పులు ఆగినయ్
భారత్ నిషేధం వల్ల మదర్ షిప్పులు పాకిస్థాన్‌కు వెళ్లడం దాదాపు ఆగిపోయాయి. దీంతో పాక్ ఫీడర్ నౌకలపై ఆధారపడుతోంది. ఈ ఫీడర్ సర్వీసుల వల్ల సరుకులు కొలంబో, UAEలోని జెబెల్ అలీ పోర్టుల్లో వదిలేస్తున్నాయి. అక్కడి నుంచి పాక్‌కు తీసుకెళ్లడానికి ఫ్రెయిట్ చార్జీలు, టైమ్ రెండూ కూడా పెరుగుతున్నాయి. పాక్ మారిటైం మంత్రి ముహమ్మద్ జునైద్ అన్వన్ చౌదరీ ట్యాక్సులను 50% తగ్గించినట్లు చెప్పారు, కానీ సమస్యలు ఇంకా కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ షిప్పులపై భారత్ నిషేధం విధించడంతో… ఆ దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది. ఎగుమతులు, దిగుమతుల ఆలస్యం, పెరిగిన ధరలు, తగ్గిన పోర్టు ఆదాయం – ఇవన్నీ పాక్‌ను గిలగిలలాడేలా చేస్తున్నాయి. ఈ పరిస్థితి ఎప్పటికి మారుతుందో అని వ్యాపారులు ఎదురు చూస్తున్నారు.
Also read: బీజేపీ అధ్యక్షుడిగా రామచందర్ రావు
Also read: బీజీపీ అధ్యక్షుడి ఎంపికలో నారా చక్రం
Also read: షెఫాలీ మృతికి ఆ మందులే కారణం