రేపు మెగా సునామీ?

Latest Posts Trending Now

* జపాన్, ఫిలిప్పీన్స్‌లో విలయం!
* జపాన్ బాబా వాంగా’ జోస్యం

జూలై 5 … అంటే శనివారం… తర్వాత రోజు ఆదివారం… ఈ రెండు రోజుల్లో జపాన్, ఫిలిప్పీన్స్ మధ్య ఒక మెగా సునామీ వచ్చి విలయం సృష్టించబోతోంది. ఆ రెండు దేశాల్లో తీవ్ర ప్రాణ నష్టం జరుగుతుంది. ఈ జోస్యం చెబుతోంది… ‘జపాన్ బాబా వాంగా’గా పిలిచే ర్యో తత్సుకీ. ఈమె ‘ద ఫ్యూచర్ ఐ సా’ అనే పుస్తకంలో ఈ భయంకర సునామీ గురించి సంచలన హెచ్చరిక చేశారు. ఈ వార్త ఇంటర్నెట్‌లో ‘జూలై 5 డిజాస్టర్’గా ట్రెండ్ అవుతోంది. టోక్యో, ఫిలిప్పీన్స్‌లో జనం భయంతో విమానాలు, రైళ్ళు, ఇతర ప్రయాణాలు రద్దు చేసుకుంటున్నారు. ఈ జోస్యం నిజమవుతుందా? అసలు ర్యో తత్సుకీ ఎవరు?

ర్యో తత్సుకీ జపాన్‌కు చెందిన ప్రసిద్ధ మాంగా ఆర్టిస్టు, జోస్యం చెప్పే వ్యక్తి. ఈమె ‘ద ఫ్యూచర్ ఐ సా’ అనే పుస్తకంలో భవిష్యత్తులో జరిగే సంఘటనలను ఊహించి రాశారు. ఈమె గతంలో చెప్పిన జోస్యాల్లో కొన్ని నిజమయ్యాయి. ఉదాహరణకు, 2011లో జపాన్‌లో వచ్చిన భూకంపం, సునామీ,
బ్రిటన్ యువరాణి డయానా మరణం, కరోనా వైరస్ మహమ్మారిని కూడా ఈమె ముందే ఊహించారు.
ఈ ఖచ్చితమైన జోస్యాల వల్ల ఈమెను ‘జపాన్ బాబా వాంగా’గా పిలుస్తున్నారు. బాబా వాంగా అనేది గత శతాబ్దిలో బల్గేరియాకు చెందిన ఒక ప్రసిద్ధ జోత్స్యురాలు, ఆమె జోస్యాలు కూడా చాలా నిజమయ్యాయి.

జూలై 5 సునామీ జోస్యం ఏమిటి?

తత్సుకీ తన పుస్తకంలో దాదాపు 20 ఏళ్ల క్రితం ఈ సునామీ గురించి హెచ్చరించారు. ఆమె చెప్పిన దాని ప్రకారం, “జపాన్, ఫిలిప్పీన్స్ మధ్య సముద్ర గర్భం ఒక్కసారిగా బద్దలై, ఆకాశహర్మ్యాలను తాకేంత ఎత్తున అలలు ఎగసిపడతాయి. ఈ సునామీ వల్ల లక్షలాది మంది ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. ఈ జోస్యం విన్న జనం భయంతో ఊపిరి బిగబట్టి ఎదురుచూస్తున్నారు. ఇంటర్నెట్‌లో ఈ విషయంపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. సోషల్ మీడియాలో #July5Disaster, #MegaTsunami లాంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి. ఈ జోస్యం వల్ల జపాన్‌లోని టోక్యో, ఒసాకా, ఫిలిప్పీన్స్‌లోని మనీలా లాంటి ప్రాంతాల్లో జనం భయాందోళనలో ఉన్నారు. చాలామంది తమ విమాన టికెట్లు, రైలు టికెట్లు రద్దు చేసుకుంటున్నారు. కొందరు సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. జపాన్ వాతావరణ శాఖ, ఇతర అధికారులు ఈ జోస్యంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు, కానీ జనం మాత్రం ఈ వార్త విని ఆందోళన చెందుతున్నారు.

సైంటిఫిక్ గా ఆలోచిస్తే….

శాస్త్రవేత్తలు మాత్రం ఇలాంటి జోస్యాలపై అంతగా నమ్మకం లేదని చెబుతున్నారు. జపాన్ భూకంప శాస్త్రవేత్తలు, సునామీ హెచ్చరికల కోసం హైఎండ్ టెక్నాలజీని వాడుతున్నారు. వాళ్ళ ప్రకారం, పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌లో ఉన్న జపాన్, ఫిలిప్పీన్స్ లాంటి దేశాలకు భూకంపాలు, సునామీలకు ఎల్లప్పుడూ అవకాశం ఉంటుంది, కానీ ఖచ్చితమైన తేదీ, సమయంతో ఊహించడం సాధ్యం కాదని అంటున్నారు..
అయినప్పటికీ, ఈ జోస్యం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జనంలో భయం పెరిగిపోతోంది.
గత సునామీల నుంచి చాలా పాఠాలు నేర్చుకున్నాం…జపాన్‌లో 2011లో వచ్చిన తోహోకు భూకంపం, సునామీ గురించి మనకు తెలుసు. ఆ సునామీలో దాదాపు 15 వేల మంది మరణించారు, ఆ తర్వాత ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రంలో పెను విపత్తు సంభవించింది. ఈ సంఘటన తర్వాత జపాన్ సునామీ హెచ్చరిక వ్యవస్థలను మరింత బలోపేతం చేసింది. ఫిలిప్పీన్స్ కూడా సునామీ హెచ్చరికల కోసం అనేక చర్యలు తీసుకుంది.

భారత్ సంగతి ఏంటి ?
జపాన్, ఫిలిప్పీన్స్ లో అయితే జాగ్రత్తలు తీసుకుంటున్నారు… మన భారత్ సంగతి ఏంటి అంటే…ర్యో తత్సుకీ జోస్యం ప్రకారం జూలై 5, 2025న జపాన్, ఫిలిప్పీన్స్ మధ్య సంభవించే మెగా సునామీ భారతీయ తీర ప్రాంతాలపై ప్రత్యక్ష ప్రభావం చూపకపోవచ్చు, ఎందుకంటే ఈ సునామీ పసిఫిక్ మహాసముద్రంలోని జపాన్, ఫిలిప్పీన్స్ ప్రాంతాలకు సంబంధించినది. అయితే, 2004 భారత మహాసముద్ర సునామీ అనుభవం దృష్ట్యా, భారత తీర రాష్ట్రాలు (ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశా,అండమాన్ నికోబార్) ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. సముద్ర తీరంలోని ప్రజలు భూకంపం లేదా అసాధారణ సముద్ర పరిస్థితులు (సముద్రం ఒక్కసారిగా వెనక్కి వెళ్లడం) గమనిస్తే, వెంటనే ఎత్తైన ప్రాంతాలకు తరలివెళ్లాలి. అత్యవసర బ్యాగ్‌లో ఆహారం, నీరు, మందులు సిద్ధంగా ఉంచుకోవాలి.
ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (INCOIS) హెచ్చరికలను ఫాలో అవ్వాలి.
ఈ జోస్యం గురించి భయపడకండి, ఎందుకంటే ఇది కేవలం ఊహాగానాలు మాత్రమే అని సైంటిస్టులు చెబుతున్నారు. బట్ ఎవరి నమ్మకం వాళ్ళది.. ర్యో తత్సుకీ జోస్యం నిజమవుతుందా లేదా అనేది మరో రోజు గడిస్తే తెలుస్తుంది. కానీ, ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా ఎంత టెన్షన్ రేపుతోంది.

Also read: టెక్ ఉద్యోగాలు ఎందుకు పోతున్నయ్ ?

Also read: భారత్ దెబ్బకు పాకిస్తాన్ విల విల !

Also read: బీజేపీ అధ్యక్షుడిగా రామచందర్ రావు

Also read: https://www.msn.com/en-in/autos/photos/is-the-world-ending-on-july-5-japanese-baba-vanga-predicts-tsunami-sparks-panic-before-disaster-date/ar-AA1HOssn

Tagged

Leave a Reply