ఇక ఆ వీడియోలకు డబ్బులు రావు

Latest Posts Trending Now

: క్రియేటర్లకు యూట్యూబ్ షాక్

హైదరాబాద్ : యూట్యూబ్ 2025లో కొత్త మానిటైజేషన్ నిబంధనలను తీసుకొస్తోంది. ఈ మార్పులు జులై 15, 2025 నుంచి అమల్లోకి వస్తున్నాయి, కాబట్టి క్రియేటర్లు ఇప్పుడే అప్రమత్తం కావాలి!

కొత్త రూల్స్ ఏంటి?
యూట్యూబ్ తన YouTube Partner Program (YPP)లో మానిటైజేషన్ కోసం కొత్త రూల్స్ తెచ్చింది. ఈ రూల్స్ ప్రధానంగా “ఒరిజినల్”, “ప్రామాణిక” కంటెంట్‌ను ప్రోత్సహించడంపై దృష్టి పెట్టాయి. అంటే, కేవలం వ్యూస్ కోసం తయారు చేసిన, ఒకే రకమైన, లేదా కాపీ-పేస్ట్ వీడియోలు, AIతో ఆటోమేటెడ్‌గా క్రియేట్ చేసిన కంటెంట్‌కు ఇకపై డబ్బులు రావు. ఈ మార్పుల వల్ల క్రియేటర్లు తమ కంటెంట్‌ను మరింత క్వాలిటీతో, క్రియేటివిటీతో తయారు చేయాల్సి ఉంటుంది.
మాస్-ప్రొడ్యూస్డ్ & రిపీటెడ్ కంటెంట్‌పై నిషేధం: ఒకే టెంప్లేట్‌తో లేదా పదే పదే అదే రకమైన వీయోలు తయారు చేస్తే, అవి YPP నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటాయి. ఉదాహరణకు, క్లిక్‌బైట్ థంబ్‌నెయిల్స్, ఎడ్యుకేషన్ లేదా ఎంటర్‌టైన్మెంట్ విలువ లేని వీడియోలు, లేదా ఇతర కంటెంట్‌ను కాపీ చేసి, ఎలాంటి కొత్తదంన లేకుండా అప్‌లోడ్ చేసిన వీడియోలు ఈ కేటగిరీలోకి వస్తాయి. అలాంటి వీడియోలు మానిటైజేషన్ కోల్పోవడమే కాక, ఛానెల్ రీచ్ తగ్గిపోతుంది, లేదా YPP నుంచి పూర్తిగా తొలగించే అవకాశం ఉంది.
AI జనరేటెడ్ కంటెంట్‌పై కఠిన నిబంధనలు: AI టూల్స్‌తో ఆటోమేటెడ్‌గా తయారు చేసిన వీడియోలు, డీప్‌ఫేక్‌లు, క్లోన్డ్ వాయిస్‌లు, లేదా మనిషితో పని లేకుండా చేసిన కంటెంట్‌పై యూట్యూబ్ కఠినంగా ఉంటుంది. AIతో చేసిన కంటెంట్‌లో క్రియేటివిటీ, మీ సొంత కామెంటరీ లేదా ఎడిటింగ్ ఉండాలి. లేకపోతే, అవి “ఇన్‌ ఆథెంటిక్” కంటెంట్‌గా గుర్తించబడి, మానిటైజేషన్ కోల్పోతాయి. ఒకవేళ AI టూల్స్ ఉపయోగిస్తే, క్రియేటర్లు దాన్ని స్పష్టంగా డిస్‌క్లోజ్ చేయాలి, లేకపోతే డీమానిటైజేషన్ లేదా ఛానెల్ సస్పెన్షన్ జరగొచ్చు.
రివ్యూ ప్రాసెస్ కఠినతరం: యూట్యూబ్ తమ యాడ్ సూటబిలిటీ రివ్యూ ప్రాసెస్‌ను బాగా ఇంప్రూవ్ చేస్తోంది. వీడియోలు (ప్రైవేట్ వీడియోలతో సహా) హ్యూమన్ రివ్యూకు అంటే ఉద్యోగులతో రివ్యూ చేయించవచ్చు. దీనికి 24 గంటల వరకు టైమ్ పట్టొచ్చు. ఈ రివ్యూ మానిటైజేషన్ నిర్ణయాలను మరింత ఖచ్చితంగా అమలు చేస్తుంది. నిబంధనలు పాటించని వీడియోలు రెవెన్యూ కోల్పోతాయి.


ఒరిజినల్ కంటెంట్‌కు ప్రాధాన్యత: యూట్యూబ్ అసలైన, క్రియేటివిటీ ఉన్న కంటెంట్‌ను ప్రోత్సహిస్తుంది. అంటే, ఇతరుల కంటెంట్‌ను రీయూజ్ చేయకుండా, మీ సొంత కామెంటరీ, ఎడిటింగ్, లేదా యూనిక్ పెర్స్‌పెక్టివ్ జోడించాలి. ఉదాహరణకు, రియాక్షన్ వీడియోలు చేస్తే, మీ సొంత ఆలోచనలు, విశ్లేషణ లేదా కామెంటరీ ఇవ్వాలి. కేవలం ఇతర వీడియోలను చూపిస్తూ రియాక్ట్ చేస్తే అది ఒరిజినల్ కంటెంట్‌గా గుర్తించరు.
క్రియేటర్లపై ఎలాంటి ప్రభావం ?
చిన్న క్రియేటర్లకు అవకాశం: 2023లో యూట్యూబ్ మానిటైజేషన్ కోసం సబ్‌స్క్రైబర్ల సంఖ్యను తగ్గించి (1,000 సబ్‌స్క్రైబర్లు, 4,000 వాచ్ అవర్స్ లేదా 10 మిలియన్ షార్ట్స్ వ్యూస్) చిన్న క్రియేటర్లకు అవకాశం కల్పించింది. కానీ, ఇప్పుడు కంటెంట్ క్వాలిటీ మీద ఎక్కువ దృష్టి పెట్టింది. కాబట్టి, తక్కువ సబ్‌స్క్రైబర్లతోనూ క్వాలిటీ కంటెంట్ చేస్తే డబ్బు సంపాదించొచ్చు.
లో-ఎఫర్ట్ కంటెంట్‌కు షాక్: కాపీ-పేస్ట్, AIతో ఆటోమేటెడ్‌గా చేసిన వీడియోలు, లేదా క్లిక్‌బైట్ కంటెంట్‌తో సంపాదించాలనుకునేవారికి ఇది పెద్ద ఎదురుదెబ్బ. ఇలాంటి ఛానెల్స్ మానిటైజేషన్ కోల్పోవచ్చు లేదా పూర్తిగా సస్పెండ్ అయ్యే ప్రమాదం ఉంది.


క్రియేటివిటీ అవసరం: ఇకపై క్రియేటర్లు తమ వీడియోల్లో సొంత ఆలోచనలు, ఎడిటింగ్, లేదా యూనిక్ గా ఉండాలి. ఉదాహరణకు, లాంగ్-ఫార్మ్ వీడియోలు, కమ్యూనిటీ-డ్రివెన్ సిరీస్, లేదా ఒరిజినల్ టాపిక్స్‌పై వీడియోలు చేయడం వల్ల ఎక్కువ రీచ్, రెవెన్యూ వచ్చే అవకాశం ఉంది.
అందువల్ల క్రియేటర్లు మీ ఛానెల్‌లో రిపీటెడ్ లేదా లో-క్వాలిటీ కంటెంట్ ఉంటే, జులై 15 లోపు దాన్ని రిమూవ్ చేయండి లేదా ఇంప్రూవ్ చేయండి. AIని ఉపయోగిస్తే దాన్ని స్పష్టంగా వీడియోలో లేదా డిస్క్రిప్షన్‌లో తెలపండి. క్వాలిటీపై ఫోకస్ చేయండి. ఎడ్యుకేషనల్, ఎంటర్‌టైనింగ్, లేదా ఇన్‌స్పిరేషనల్ కంటెంట్‌పై దృష్టి పెట్టండి. ఇది మీ రీచ్, ఎంగేజ్‌మెంట్‌ను పెంచుతుంది.

Also read: రేవంత్ పాలన ఎండగట్టాలని డిసైడ్

Also read: రాజాసింగ్ కి రాం … రాం…

Also read: రష్యా చమురు కొంటే భారత్‌కు నష్టమా?

Also read: https://www.msn.com/en-in/money/news/youtube-to-tighten-monetisation-rules-for-repetitious-and-mass-produced-content-starting-july-15/ar-AA1HW6eC

Tagged

Leave a Reply