ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. “నాటు నాటు” పాటకు ఆస్కార్ అవార్డు రావడం, ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లు సాధించడం అన్నీ చిరస్మరణీయ ఘట్టాలే. తాజాగా ఈ చిత్రం లండన్‌లోని ప్రతిష్టాత్మక రాయల్ ఆల్బర్ట్ హాల్ వేదికపై లైవ్ కాన్సర్ట్, ప్రీమియర్‌తో మరోసారి అంతర్జాతీయంగా వార్తల్లో నిలిచింది. ఈ వేడుకకు రామ్ చరణ్, ఎన్టీఆర్ దంపతులు హాజరయ్యారు. వారితో కలిసి ఉన్న ఒక వీడియోను ఉపాసన సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఆ వీడియోలో చరణ్, తారక్ కలిసి రాజమౌళిని ఆటపట్టించడమే కాకుండా, సరదాగా అలసటవలకే నవ్వులు పూయించారు.
ఇంతలో ఉపాసన రాజమౌళిని ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు – “ఆర్ఆర్ఆర్ 2 చేస్తారా?” అన్నది. దానికి రాజమౌళి సూటిగా “అవును” అని సమాధానం ఇవ్వగా, వెంటనే ఉపాసన “గాడ్ బ్లెస్ యూ” అంటూ స్పందించారు. దీంతో, ఆర్ఆర్ఆర్ 2 నిజంగానే సెట్స్ పైకి రానుందా? ఇది రాజమౌళి సీరియస్‌గా అన్నారా లేక సరదాగా స్పందించారా? అనే చర్చలు మొదలయ్యాయి. ఏదైనప్పటికీ, మరోసారి ఆర్ఆర్ఆర్ సీక్వెల్ గూర్చి ఫ్యాన్స్ లో ఆసక్తి రేకెత్తుతోంది. ఇక ఈ ప్రీమియర్ సందర్భంగా ఎన్టీఆర్, చరణ్ మళ్లీ తమ మధ్య బలమైన బాండింగ్‌ను చూపించి అభిమానులను ఉత్సాహపరిచారు. రామ్ చరణ్, ఎన్టీఆర్‌ను హత్తుకొని ముద్దు పెట్టిన దృశ్యం వైరల్‌గా మారింది.
అలాగే ఎన్టీఆర్‌కి ముందుగానే బర్త్‌డే విషెస్ కూడా తెలిపారు. తరువాత ఎన్టీఆర్ మాట్లాడుతూ, “చరణ్ లాంటి బెస్ట్ డాన్సర్‌తో కలిసి ‘నాటు నాటు’ పాటకి నృత్యం చేయడం మరిచిపోలేని అనుభవం” అని చెప్పారు. ఆర్ఆర్ఆర్లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా నటించగా, స్వాతంత్ర సమరయోధుల ఆధారంగా రాజమౌళి ఈ కల్పిత కథను తెరకెక్కించారు. ఈ చిత్రం బాక్సాఫీస్‌ను ఊపేసింది, ప్రేక్షక హృదయాల్లో నిలిచిపోయింది.
Read This Also : సరస్వతీ పుష్కరాల మహిమ తెలుసుకోండి!
Read This Also : అమెజాన్ ప్రైమ్ వీడియో కస్టమర్లకు షాకింగ్ న్యూస్
Read This Also : జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పండగే … ఇక వరుస సినిమాలు!